PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-brs-congress-tcm-revanth-reddy-telangana-cm-revanth-reddy-bandi-sanjay-tx-cm-kcrd1b4a704-5281-48de-9cae-cd0b943a53e3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-brs-congress-tcm-revanth-reddy-telangana-cm-revanth-reddy-bandi-sanjay-tx-cm-kcrd1b4a704-5281-48de-9cae-cd0b943a53e3-415x250-IndiaHerald.jpg- ప‌దేళ్లు ఫ‌స్ట్ ర్యాంక్‌లో ఉన్న BRS కి పార్ల‌మెంటు పోరులో 4వ ప్లేస్‌ - మూడో స్థానం గ‌త‌నుకున్న కాంగ్రెస్ నేడు అధికారంతో ఫ‌స్ట్ ర్యాంక్‌ - అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌డి... పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో స్వింగ్ అయిన BJP ( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికర ఎత్తులు పై ఎత్తులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన ఈ 10 ఏళ్లలో తెలంగాణ పొలిటికల్ గేమ్ చేంజర్‌ అనే ఆట.. అదిరిపోయే త్రిల్లింగ్ ఎపిసోడ్లతో నడుస్తోంది. 2014 నుంచి 2023 వరకు తొమBJP; Brs; Congress; tcm revanth Reddy; Telangana CM revanth Reddy; Bandi Sanjay; tx CM KCR{#}Hyderabad;India;GEUM;MIM Party;Huzurabad;Revanth Reddy;MP;Bharatiya Janata Party;Telangana;Assembly;KCR;Congress;Party;Parliamentతెలంగాణ పొలిటిక‌ల్ గేమ్ చేంజ‌ర్ : BRS, కాంగ్రెస్‌, BJP.. 1,2,3 ర్యాంకులు.. ట్విస్టులు..?తెలంగాణ పొలిటిక‌ల్ గేమ్ చేంజ‌ర్ : BRS, కాంగ్రెస్‌, BJP.. 1,2,3 ర్యాంకులు.. ట్విస్టులు..?BJP; Brs; Congress; tcm revanth Reddy; Telangana CM revanth Reddy; Bandi Sanjay; tx CM KCR{#}Hyderabad;India;GEUM;MIM Party;Huzurabad;Revanth Reddy;MP;Bharatiya Janata Party;Telangana;Assembly;KCR;Congress;Party;ParliamentTue, 09 Jul 2024 08:07:00 GMT- ప‌దేళ్లు ఫ‌స్ట్ ర్యాంక్‌లో ఉన్న BRS కి పార్ల‌మెంటు పోరులో 4వ ప్లేస్‌
- మూడో స్థానం గ‌త‌నుకున్న కాంగ్రెస్ నేడు అధికారంతో ఫ‌స్ట్ ర్యాంక్‌
- అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌డి... పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో స్వింగ్ అయిన  BJP

( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ )

2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికర ఎత్తులు పై ఎత్తులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన ఈ 10 ఏళ్లలో తెలంగాణ పొలిటికల్ గేమ్ చేంజర్‌ అనే ఆట.. అదిరిపోయే త్రిల్లింగ్ ఎపిసోడ్లతో నడుస్తోంది. 2014 నుంచి 2023 వరకు తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యం కొనసాగించింది. రాజకీయంగా కేసీఆర్ కు తిరుగులేకుండా పోయింది. 2014తో పాటు 2018 ముందస్తు ఎన్నికల్లోను ఆయనే ఘనవిజయం సాధించి తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు ఏక చక్రాధిపత్యంగా తెలంగాణను ఏలేశారు. ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలలో తెలంగాణలో రాజకీయంగా బిఆర్ఎస్ నెంబర్ వన్ ర్యాంక్‌లో ఉంది. అయితే రాష్ట్ర విభజన జరిగాక 2014లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. 2018 ఎన్నికల టైం కు వచ్చేసరికి కాంగ్రెస్ పూర్తిగా డీలా పడింది.


ఆ ఎన్నికల్లో ఓడిపోయాక తెలంగాణలో రెండో స్థానం కోసం జరిగిన వార్‌లో బిజెపి ముందుకు వచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 6 నెలలకే జరిగిన పార్లమెంటు ఎన్నికలలో బిజెపి ఏకంగా నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుంటే.. కాంగ్రెస్ మూడు స్థానాలతో సరిపెట్టుకుంది. అక్కడ నుంచి బిజెపి బండి సంజయ్ నాయకత్వంలో దూసుకుపోయి బిఆర్ఎస్ కు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించింది. పైగా దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలలో ఘన విజయాలు సాధించిన బిజెపి.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో దాదాపు పీఠం కైవసం చేసుకునే దశ వరకు వచ్చింది. మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌కు డిపాజిట్ దక్కలేదు. బిజెపి గట్టి పోటీ ఇచ్చి బిఆర్ఎస్ చేతిలో ఓడిపోయింది. దీంతో రాజకీయ పండితులు అందరూ 2023 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ.. బిఆర్ఎస్ వర్సెస్ బిజెపి మధ్య ఉంటాయని అనుకున్నారు.


అయితే బిజెపి బండి సంజయ్‌ను తెలంగాణ అధ్యక్ష బాధ్యతల నుంచి తెప్పించింది. ఒక్కసారిగా ఆ పార్టీ గ్రాఫ్ పతనమైంది. మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ పుంజుకుని రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జ‌య‌కేతనం ఎగరవేసింది. పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బిఆర్ఎస్ 39 సీట్లు గెలుచుకునే ప్రధాన ప్రతిపక్షంగా ఉంటే.. అధికారంలోకి వస్తుందని అందరూ భావించిన బిజెపి.. కేవలం 8 సీట్లతో సరిపెట్టుకొని మూడో స్థానంలో ఉంది. విచిత్రం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆరు నెలలకే మే నెలలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ఫలితాలు తెలంగాణ పొలిటికల్ గేమ్ మళ్లీ ఆసక్తిగా మార్చేశాయి. తొమ్మిదిన్నర సంవత్సరాలు పాటు తెలంగాణలో నెంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్న బీఆర్ఎస్.. మూడో స్థానం కాదు కదా నాలుగో స్థానానికి పడిపోయింది.


అధికార కాంగ్రెస్, బిజెపి చేరి ఎనిమిది ఎంపీ స్థానాలు గెలుచుకున్నాయి. ఎంఐఎం హైదరాబాద్ పార్లమెంటు సీటు నిలుపుకుంది. బిఆర్ఎస్ కు ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా దక్కలేదు. అంటే ఇక్కడ గేమ్ మారిపోయింది. తొమ్మిదిన్నర సంవత్సరాలు తొలి ర్యాంక్‌లో ఉన్న బిఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికలలో నాలుగో స్థానంతో సరిపెట్టుకోవటం.. ఆ పార్టీ దారుణ పరాజయానికి నిదర్శనం అని చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణలో నెంబర్ వన్ స్థానం కోసం కాంగ్రెస్, బిజెపి మధ్య ఆసక్తికర పోరు నడుస్తున్నా.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ తొలి స్థానంలో ఉంటే.. బిజెపి రెండు, బిఆర్ఎస్ మూడో స్థానంలో ఉన్నాయని చెప్పాలి. ఏది ఏమైనా బిఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ భారీగా పతనం అయిపోతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>