MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/kalki-2898-adcbda9815-aff1-4748-9016-fec9f2dcd1f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/kalki-2898-adcbda9815-aff1-4748-9016-fec9f2dcd1f5-415x250-IndiaHerald.jpgబాలీవుడ్కి ఉన్న ఆ ఒక్క రికార్డుని కూడా లేపేసిన కల్కి? యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి2898AD సినిమా రోజుకో రికార్డు క్రియేట్ చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తుంది. జూన్ 27 వ తేదీన న విడుదలైన ఈ పాన్ ఇండియా సినిమా యానానిమస్ గా అన్ని భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న విషయం అందరికి తెలిసిందే.ఈ మూవీ ప్రీమియర్స్ నుండే భారీ కలెక్షన్లతో థియేటర్లలో హౌస్ ఫుల్ అవుతూ రచ్చ చేస్తుంది. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కి అమితాబ్, కమల్ ల వైవిధ్యమైన నటనకి యాక్షన్స్ కి ఆడియన్స్ ఫుల్ గా ఫిదా అవుతునKalki 2898 AD{#}Hrithik Roshan;Raccha;Fighter;House;Hollywood;June;vijay kumar naidu;Fidaa;India;bollywood;Blockbuster hit;krishnam raju;Prabhas;Box office;Audience;Cinemaబాలీవుడ్కి ఉన్న ఆ ఒక్క రికార్డుని కూడా లేపేసిన కల్కి?బాలీవుడ్కి ఉన్న ఆ ఒక్క రికార్డుని కూడా లేపేసిన కల్కి?Kalki 2898 AD{#}Hrithik Roshan;Raccha;Fighter;House;Hollywood;June;vijay kumar naidu;Fidaa;India;bollywood;Blockbuster hit;krishnam raju;Prabhas;Box office;Audience;CinemaTue, 09 Jul 2024 15:12:00 GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి2898AD సినిమా రోజుకో రికార్డు క్రియేట్ చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తుంది. జూన్ 27 వ తేదీన న విడుదలైన ఈ పాన్ ఇండియా సినిమా యానానిమస్ గా అన్ని భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న విషయం అందరికి తెలిసిందే.ఈ మూవీ ప్రీమియర్స్ నుండే భారీ కలెక్షన్లతో థియేటర్లలో హౌస్ ఫుల్ అవుతూ రచ్చ చేస్తుంది. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కి అమితాబ్, కమల్ ల వైవిధ్యమైన నటనకి యాక్షన్స్ కి ఆడియన్స్ ఫుల్ గా ఫిదా అవుతున్నారు. పైగా విజువల్స్ పరంగా కూడా హాలీవుడ్ సినిమాలని తలపించే రేంజ్ లో ఈ సినిమా ఉండడంతో కల్కి వరల్డ్ వైడ్ గా  కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తుంది. ఇప్పటికే 900 కోట్లకి పైగా వసూలు చేసిన కల్కి ఖాతాతో మరో అరుదైన రికార్డ్ వచ్చి చేరింది.బాలీవుడ్ లో ఈ సంవత్సరం విడుదలైన చాలా పెద్ద సినిమాలు ఘోరంగా ప్లాప్ అయ్యాయన్న సంగతి తెలిసిందే. ప్లాప్ ల సంగతి పక్కన బెడితే ఈ సంవత్సరం పట్టుమని పది హిట్లు కూడా బాలీవుడ్ ఖాతాతో చేరలేదు. 


అప్పుడెప్పుడో ఐదు నెలల కింద రిలీజ్ అయిన హృతిక్ రోషన్ ఫైటర్ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా మంచి కలెక్షన్లు వసూలు చేసి ఓ మోస్తరు విజయం సాధించింది. ఆ తర్వాత సైతాన్ వంటి చిన్న సినిమాలు కొన్ని హిట్ అయ్యాయి. తాజాగా ప్రభాస్ కల్కిసినిమా ఈ ఏడాది బాలీవుడ్ కి ఉన్న ఒక్కగానోక్క ఫైటర్ రికార్డుని కూడా బ్రేక్ చేసి ఈ ఇయర్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.ఈ సంవత్సరం రిలీజ్ అయిన బాలీవుడ్ సినిమాల్లో హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ సినిమా మొత్తం 215 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ ని ఇండియాలో సొంతం చేసుకుని, ఈ ఇయర్ లో బాలీవుడ్ నుండి హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. కానీ ఇప్పుడు ఫైటర్ కలెక్షన్స్ ని కల్కి2898AD మూవీ కేవలం 12 రోజుల కలెక్షన్స్ తో బ్రేక్ చేసి 220 కోట్లతో 2024 ఇయర్ లో బాలీవుడ్ నుండి హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీ గా నిలిచింది. నిజానికి రిలీజ్ కి ముందు కల్కి పై బాలీవుడ్ లో మరీ ఎక్కువ అంచనాలు లేకపోయినా, రిలీజ్ తర్వాత యానానిమస్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్లు వసూలు చేస్తూ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ సినిమా. ఇక లాంగ్ రన్ లో 250 నుండి 300 కోట్ల దాకా వసూలు చేసే ఛాన్స్ ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>