MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/indian-25bcc476b-857c-4774-9250-fa362e503f6e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/indian-25bcc476b-857c-4774-9250-fa362e503f6e-415x250-IndiaHerald.jpgభారతీయుడికి బిగ్ టార్గెట్.. అంత రాబట్టగలడా? 1996వ సంవత్సరంలో విశ్వ నటుడు కమలహాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో నటించిన భారతీయుడు అనే సినిమా విడుదల అయ్యింది. అయితే ఈ మూవీ అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించింది. అప్పటిదాకా ఉన్న రికార్డులు అన్నిటిని బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది.ఇప్పటికీ కూడా ఒక క్లాసికల్ హిట్ సినిమాగా భారతీయుడు సినిమా చరిత్రలో నిలిచిపోయిందనే చెప్పాలి. అలాంటి ఒక భారతీయుడు లాంటి ఇండస్ట్రీ సినిమాకి ఏకంగా 28 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సీక్వెల్ ని తీశారు. అది కూడా భారీ బడ్జెIndian 2{#}vegetable market;vishwa;Industry;Bharateeyudu;Blockbuster hit;News;India;Director;shankar;Cinemaభారతీయుడికి బిగ్ టార్గెట్.. అంత రాబట్టగలడా?భారతీయుడికి బిగ్ టార్గెట్.. అంత రాబట్టగలడా?Indian 2{#}vegetable market;vishwa;Industry;Bharateeyudu;Blockbuster hit;News;India;Director;shankar;CinemaMon, 08 Jul 2024 17:03:00 GMT1996వ సంవత్సరంలో విశ్వ నటుడు కమలహాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో నటించిన భారతీయుడు అనే సినిమా విడుదల అయ్యింది. అయితే ఈ మూవీ అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించింది. అప్పటిదాకా ఉన్న రికార్డులు అన్నిటిని బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది.ఇప్పటికీ కూడా ఒక క్లాసికల్ హిట్ సినిమాగా భారతీయుడు సినిమా చరిత్రలో నిలిచిపోయిందనే చెప్పాలి. అలాంటి ఒక భారతీయుడు లాంటి ఇండస్ట్రీ సినిమాకి ఏకంగా 28 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సీక్వెల్ ని తీశారు. అది కూడా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తీశారు. మరి ఈ సినిమా విడుదల అయ్యాక ఎలాంటి రిజల్ట్ అందుకుంటుదో చూడాలి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం దాదాపు 300 కోట్ల దాకా బడ్జెట్ ను కేటాయించినట్టుగా సమాచారం తెలుస్తుంది. మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఖచ్చితంగా 300 కోట్లకు పైన వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. 


ఇక ఇదిలా ఉంటే తెలుగులో ఈ మూవీని మొత్తం 25 కోట్లకు అమ్మేసారు. ఇక తెలుగులో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఖచ్చితంగా 26 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. నిజానికి డైరెక్టర్ శంకర్ కి తెలుగులో ఉన్న మార్కెట్ కంటే కూడా చాలా తక్కువ రేట్ కి రైట్స్ అమ్ముడుపోయాయనే చెప్పాలి. ఈ సినిమా సక్సెస్ అయితే మరొకసారి శంకర్ పాన్ ఇండియాలో తన సత్తాని చాటిన డైరెక్టర్ గా నిలుస్తాడు.సినిమా ప్లాప్ అయితే మాత్రం శంకర్ ఖాతాలో మరో భారీ ప్లాప్ పక్కాగా చేరుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం ఉన్న దర్శకులందరూ కూడా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ లను అందుకుంటున్నారు. కాబట్టి శంకర్ కూడా ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా ఆయనకి భారీ బ్లాక్ బస్టర్ హిట్టుని ఇస్తుందా లేదా అనేది విడుదల అయ్యాక తెలీనుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>