Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-kajalb8ed740f-1014-4831-9e19-6ac0d653b8aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-kajalb8ed740f-1014-4831-9e19-6ac0d653b8aa-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం అభినయంతో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ పీక్స్ లో వున్న సమయాంలోనే తన చిన్న నాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. గత ఏడాది బాలయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కాజల్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.అలాగే రీసెంట్ గా సత్యభామ సినిమాతో కాజల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే#kajal{#}gautham new;gautham;kajal aggarwal;Kesari;Moon;Satyabhama;Darsakudu;Bharateeyudu;marriage;Ram Charan Teja;Event;vishwa;shankar;Indian;News;Blockbuster hit;Tamil;Telugu;Balakrishna;Director;Cinemaఅప్పుడలా.. ఇప్పుడిలా.. కాజల్ కు వరుస షాక్ లు ఇస్తున్న డైరెక్టర్స్..!!అప్పుడలా.. ఇప్పుడిలా.. కాజల్ కు వరుస షాక్ లు ఇస్తున్న డైరెక్టర్స్..!!#kajal{#}gautham new;gautham;kajal aggarwal;Kesari;Moon;Satyabhama;Darsakudu;Bharateeyudu;marriage;Ram Charan Teja;Event;vishwa;shankar;Indian;News;Blockbuster hit;Tamil;Telugu;Balakrishna;Director;CinemaMon, 08 Jul 2024 10:57:25 GMTటాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం అభినయంతో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ పీక్స్ లో వున్న సమయాంలోనే తన చిన్న నాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. గత ఏడాది బాలయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కాజల్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.అలాగే రీసెంట్ గా సత్యభామ సినిమాతో కాజల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే విశ్వ నటుడు కమల్ హాసన్ హీరోగా బ్లాక్ బస్టర్ మూవీ ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2  సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే..ఈ సీక్వెల్‌లో కాజల్ క్యారెక్టర్ కనిపించదని దర్శకుడు శంకర్ తెలుగు ప్రమోషన్స్‌లో వెల్లడించాడు.ఇండియన్ 2లో కాజల్ అగర్వాల్‌ను మెయిన్ హీరోయిన్‌గా తీసుకున్నారు శంకర్‌. ఇండియన్ 2 లో తన రోల్ కోసం గుర్రపుస్వారీ, మార్షల్ ఆర్ట్స్‌లో కాజల్‌ ట్రైనింగ్ తీసుకున్నది. చాలా రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ చేసింది. ఇండియన్ 2 తమిళ ప్రమోషన్స్‌లో కూడా కాజల్ సందడి చేయడంతో ఆమె ఈ సినిమాలో కనిపించడం ఖాయమని అభిమానులు భావించారు. 

కానీ కాజల్ ఈ సినిమాలో అసలు కనిపించదని చెప్పి శంకర్ ట్విస్ట్ ఇచ్చాడు.ఆదివారం భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో శంకర్ మాట్లాడుతూ కాజల్ క్యారెక్టర్ ఇండియన్ 2లో ఉండదని, పార్ట్ 3లో ఆమె కనిపిస్తుందని తెలిపారు.ఇండియన్ 2 కోసం కాజల్‌పై షూట్ చేసిన సీన్స్ మొత్తం పార్ట్ 3లో కనిపించేలా శంకర్ స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేశాడని సమాచారం.. ఆ ఛేంజెస్‌లో భాగంగానే కాజల్ క్యారెక్టర్ సీక్వెల్‌లో కనిపించకుండాపోయిందని తెలుస్తుంది.. పార్ట్ 2లో తన క్యారెక్టర్ లేదని ముందుగానే తెలియడంతో ఈ సినిమా ప్రమోషన్స్‌కు కాజల్ దూరంగా ఉంటుందని  సమాచారం .గతంలో ఆచార్య సినిమాలో కూడా ఇలాగే జరిగింది. చిరంజీవి, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఈ మూవీలో కాజల్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. చిరంజీవి, కాజల్ కాంబినేషన్‌లో చాలా సీన్స్ షూట్ చేశారు. రామ్ చరణ్ క్యారెక్టర్ నిడివి పెంచి, కథను మరింత కమర్షియలైజ్ చేయడానికి రిలీజ్‌కు కొద్ది రోజుల ముందు కాజల్ క్యారెక్టర్ మొత్తాన్ని సినిమా నుంచి తొలగించి దర్శకుడు కొరటాల కాజల్ కు షాక్ ఇచ్చారు. ఇప్పుడు శంకర్ కూడా అలా చేయడంతో కాజల్ ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు. ఇండియన్ పార్ట్ 3 ఎప్పుడు రిలీజ్ అవుతుందో ప్రస్తుతానికి క్లారిటీ లేదు..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>