MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manoj50b256ce-3f43-41a1-bf8c-962167d45218-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manoj50b256ce-3f43-41a1-bf8c-962167d45218-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో మంచు మనోజ్ 2023, మార్చి 3న భూమా నాగి రెడ్డి, శోభా నాగి రెడ్డిల చిన్న కుమార్తె భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దంపతులకు ఒక ఏడాది కాలంలోనే పండంటి ఆడబిడ్డ జన్మించింది. 2024, ఏప్రిల్ 13న తమకు ఆడపిల్ల పుట్టిందని మనోజ్, మౌనిక ప్రకటించారు. అయితే ఈ జంట తాజాగా తమ గారాలపట్టికి తాజాగా నామకరణం చేశారు. బిడ్డ పేరును అర్థవంతంగా, ట్రెడిషనల్‌గాManoj{#}lakshmi manchu;manchu manoj kumar;mounika;Bhuma Akhila Priya;Tiger;Annayya;Bhuma Nagi Reddy;Parents;Wife;Girl;CBN;marriage;Hero;Marchకూతురికి అదిరిపోయే పేరు పెట్టిన మంచు మనోజ్.. వింటే వావ్ అనాల్సిందే..కూతురికి అదిరిపోయే పేరు పెట్టిన మంచు మనోజ్.. వింటే వావ్ అనాల్సిందే..Manoj{#}lakshmi manchu;manchu manoj kumar;mounika;Bhuma Akhila Priya;Tiger;Annayya;Bhuma Nagi Reddy;Parents;Wife;Girl;CBN;marriage;Hero;MarchMon, 08 Jul 2024 15:35:00 GMT
టాలీవుడ్ స్టార్ హీరో మంచు మనోజ్ 2023, మార్చి 3న భూమా నాగి రెడ్డి, శోభా నాగి రెడ్డిల చిన్న కుమార్తె భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దంపతులకు ఒక ఏడాది కాలంలోనే పండంటి ఆడబిడ్డ జన్మించింది. 2024, ఏప్రిల్ 13న తమకు ఆడపిల్ల పుట్టిందని మనోజ్, మౌనిక ప్రకటించారు. అయితే ఈ జంట తాజాగా తమ గారాలపట్టికి తాజాగా నామకరణం చేశారు. బిడ్డ పేరును అర్థవంతంగా, ట్రెడిషనల్‌గా, అందంగా పెట్టారు.

 మనోజు తన అత్తయ్య శోభ నాగిరెడ్డి, సుబ్రహ్మణ్య స్వామి సతీమణి దేవసేన పేర్లు క‌లిసి వ‌చ్చేలా ‘దేవసేన శోభా ఎంఎం’ (Devasena Shobha MM) అని తన కూతురికి పేరు పెట్టారు. ఈ పేరు చాలా బాగుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 

ఇక కొద్దిరోజుల క్రితం మంచు మనోజ్ అక్క మంచు లక్ష్మి సోష‌ల్ మీడియాలో ఈ పాప గురించి ప్రత్యేకంగా ఒక పోస్ట్ చేసింది. తమ ఇంట్లోకి చిన్న దేవత వచ్చిందని దానికి ఒక క్యాప్షన్ కూడా జోడించింది. అప్పుడే తమ ముద్దుల చిన్నారికి ఎంఎం పులి (MM Puli) అనే నిక్ నేమ్ పెట్టినట్లు వెల్లడించింది. కాగా ఈరోజు ఈ పాప‌కు నామ‌క‌ర‌ణం చేశారు.

"మీ అందరి ఆశీస్సులతో మా బిడ్డ దేవసేన శోభ MM ను మీకు పరిచయం చేస్తున్నాం. ఆ పరమేశ్వరుని భక్తులమైన మేము.. సాక్షాత్తు ఆ శివుని కుటుంబంలో సుబ్రహ్మణ్య స్వామి భార్య అయిన “దేవసేన" పేరును మా పాపకు పెట్టుకున్నాం. మా అత్తగారు స్వర్గీయ శ్రీమతి శోభా నాగిరెడ్డి గారిపేరు నుంచి “శోభ" అనే పేరును తీసుకున్నాము. వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా కుటుంబం పై ఉంటాయి. అన్నయ్య ధైరవ్ నాగిరెడ్డి.. తన చిట్టి చెల్లెలిని ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. మా మావయ్య భూమా నాగిరెడ్డి గారి వారసత్వం ఇలాగే కొనసాగుతుంది. మా జీవితంలో అడుగడుగునా అండగా ఉంటూ.. మాకు కొండంత బలంగా నిలుస్తున్న తల్లిదండ్రులు మోహన్ బాబు గారు శ్రీమతి నిర్మలా దేవి గారి ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయి." అని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లో మనోజ్ అన్నాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>