PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila-politics-is-this-a-big-blow-to-jagan31de74b7-f46b-4e53-a24e-51535345e98f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila-politics-is-this-a-big-blow-to-jagan31de74b7-f46b-4e53-a24e-51535345e98f-415x250-IndiaHerald.jpgఏపీలో రాజకీయంగా ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతున్న అంశం ఇదే. ఎన్నికలకు ముందు కూడా ఈ విష‌యం చర్చకు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది నాయకులు షర్మిల వెనుక వెళ్లిపోతారని ఆమెతో కలిసి అడుగులు వేస్తారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే కొంద‌రు మాత్ర‌మే వెళ్లారు. వీరిలో టికెట్లు రానివారు మాత్రమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి ఆమె వెంట ఒకరిద్దరు నడిచారు. కోనేటి ఆదిమూలం వంటి వారు వెళ్లి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పరిణామాలు కూAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; ycp; ys jagan; Sharmila{#}YCP;Jagan;Government;Y. S. Rajasekhara Reddy;Sharmila;Congress;Partyషర్మిల రాజ‌కీయం... జ‌గ‌న్‌కు ఇంత పెద్ద దెబ్బ‌డిపోతోందా ?షర్మిల రాజ‌కీయం... జ‌గ‌న్‌కు ఇంత పెద్ద దెబ్బ‌డిపోతోందా ?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; ycp; ys jagan; Sharmila{#}YCP;Jagan;Government;Y. S. Rajasekhara Reddy;Sharmila;Congress;PartyMon, 08 Jul 2024 11:06:09 GMTఏపీలో రాజకీయంగా ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతున్న అంశం ఇదే. ఎన్నికలకు ముందు కూడా ఈ విష‌యం చర్చకు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది నాయకులు షర్మిల వెనుక వెళ్లిపోతారని ఆమెతో కలిసి అడుగులు వేస్తారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే కొంద‌రు మాత్ర‌మే వెళ్లారు. వీరిలో టికెట్లు రానివారు మాత్రమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి ఆమె వెంట ఒకరిద్దరు నడిచారు. కోనేటి ఆదిమూలం వంటి వారు వెళ్లి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.


కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పరిణామాలు కూడా మారాయి. ప్రజల్లో జగన్ పట్ల విశ్వసనీయత తగ్గుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిని ఆయన ఎదుర్కొంటారా? ఎదుర్కోరా? అనేదాన్ని బట్టి పార్టీ నాయకులు ఉండటమా? వెళ్లడమా? అనేది తేలిపోతుంది. ఒకవైపు 164 స్థానాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ, నిత్యం అసలు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ మీద దాడులు చేస్తోంది. జగన్ విధానాలను తీవ్రస్థాయిలో తూర్పూరా బ‌డుతోంది. గతంలో జరిగిన అక్రమాలను రోజుకొకటి వెలుగు లోకి తెస్తోంది.


వాస్తవానికి ఇప్పుడు ఈ అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమే లేదు. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అందులోనూ ఒకరిద్దరు బయటకు వస్తారని స‌మ‌చారం. ఇలాంటి సమయంలో ప్రభుత్వం తీవ్రమైన దాడి చేయడం ద్వారా 40% ఓటు బ్యాంకు తెచ్చుకున్న జగన్ ను మైనస్ చేయాలనే వ్యూహాన్ని అమలు చేస్తోంది. తద్వారా ఇది గనక ప్రజల్లోకి వెళితే జగన్ మీద విశ్వాసం పోయి నాయకులు కూడా బలహీనమవుతారు. ఈ సమయమే కాంగ్రెస్ పార్టీ సద్వినియోగం చేసుకునే దిశగా షర్మిల అడుగులు వేస్తున్నారు.


గతంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకులుగా వ్యవహరించిన వారు, కీలక ప‌ద‌వులు అనుభవించిన వారు, పార్టీ అధిష్టానంతో ఇప్పటికీ సంబంధాలు నేర్పుతున్న వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారంతా రాబోయే రోజుల్లో ష‌ర్మిల వెంట న‌డిచినా ఆశ్చర్యం లేదు. ఇదే జ‌రిగితే వైసిపి ఖాళీ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందని సందేహం లేదు. కాబట్టి నాలుగేళ్లలో ఏదైనా జ‌రిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>