MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rg63f60a01-342d-4f7a-83aa-8c3505b14377-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rg63f60a01-342d-4f7a-83aa-8c3505b14377-415x250-IndiaHerald.jpgతెలుగులో మంచి గుర్తింపు కలిగిన యాంకర్ మరియు నటి అయినటువంటి రష్మి గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలలో నటించింది. కాకపోతే వాటి ద్వారా ఈమెకి పెద్ద స్థాయిలో గుర్తింపు దక్కలేదు. దానితో ఆ తర్వాత యాంకరింగ్ రంగంపై ఈ బ్యూటీ దృష్టి పెట్టడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈటీవీ లో పరసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించింది. ఈ షో కి అద్భుతమైన గుర్తింపు రావడంతో ఇందులో ఈమె తన యాంకరింగ్ తో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ షో తర్వాత నుండి ఈమెకrg{#}rashmi gautham;reshmi;Jabardasth;television;BEAUTY;Heroineవారానికి ఐదు రోజులు ఆ ఫుట్ తీసుకోండి.. అద్భుతమైన హెల్త్ టిప్ చెప్పిన రష్మీ..!వారానికి ఐదు రోజులు ఆ ఫుట్ తీసుకోండి.. అద్భుతమైన హెల్త్ టిప్ చెప్పిన రష్మీ..!rg{#}rashmi gautham;reshmi;Jabardasth;television;BEAUTY;HeroineMon, 08 Jul 2024 10:26:00 GMTతెలుగులో మంచి గుర్తింపు కలిగిన యాంకర్ మరియు నటి అయినటువంటి రష్మి గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలలో నటించింది. కాకపోతే వాటి ద్వారా ఈమెకి పెద్ద స్థాయిలో గుర్తింపు దక్కలేదు. దానితో ఆ తర్వాత యాంకరింగ్ రంగంపై ఈ బ్యూటీ దృష్టి పెట్టడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈటీవీ లో పరసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించింది. ఈ షో కి అద్భుతమైన గుర్తింపు రావడంతో ఇందులో ఈమె తన యాంకరింగ్ తో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ షో తర్వాత నుండి ఈమెకు సినిమాలలో హీరోయిన్ అవకాశాలు ఇతర అవకాశాలు కూడా రావడం మొదలు అయింది.

అందులో భాగంగా ఈమె ఇప్పటికే అనేక సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఈమె సినిమాలలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇకపోతే సినిమాలతో , టీవీ షో లతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ అప్పుడప్పుడు కొన్ని విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి. వారంలో ఎన్ని రోజులు ఏ ఫుడ్ తీసుకోవాలి. దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయంపై స్పందించింది. తాజాగా రేష్మి గౌతమ్ మాట్లాడుతూ ... వారంలో 5 రోజులు వెజిటేరియన్ ఫుడ్ తినాలి. 2 రోజులు నాన్ వెజ్ ఫుడ్ తినాలి.

ఒకప్పుడు జనాలు వారంలో ఎక్కువ శాతం వెజిటేరియన్ ఫుడ్ తినేవారు. అందుకే వారు ఎంతో కాలం చాలా ఆరోగ్యంగా బ్రతికారు. ఇక ప్రస్తుత కాలంలో చాలా మంది వారంలో ఎక్కువ రోజులు నాన్ వెజ్ వంటకాలను తింటున్నారు. అందుకే ఇప్పుడు చాలా మంది చిన్న వయసులోనే అనేక హెల్త్ సమస్యలతో చనిపోతున్నారు. అందుకే కచ్చితంగా వారం రోజుల్లో ఐదు రోజులు వెజిటేరియన్ తినేలా చూసుకోండి. రెండు రోజులు మాత్రమే నాన్ వెజ్ మీ భోజనంలో ఉండేలా జాగ్రత్త పడండి అని రష్మి గౌతమ్ తాజాగా చెప్పుకొచ్చింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>