PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcr4e15fe53-b156-47aa-9d8e-dded3a89e308-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcr4e15fe53-b156-47aa-9d8e-dded3a89e308-415x250-IndiaHerald.jpgబీఆర్ఎస్ పరిస్థితి అయోమయంలో పడింది. పార్టీలో ఉండేది ఎవరో.... పోయేది ఎవరో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. వరుసగా బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తాకుతున్నాయి. రాత్రికి రాత్రే ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీలు మారారు. తాజాగా కీలక సమావేశం ఏర్పాటు చేస్తే ఐదుగురు ఎమ్మెల్యేలు, 10 మంది కార్పొరేటర్లు డుమ్మకొట్టారు. వారంతా మీటింగ్ కి రాకపోవడంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో ఉండే కేసీఆర్ ఎన్ని ప్లాన్స్ వేసినా ....ఎంత ధీమా వ్యక్తం చేసిన పార్టీ నుంచి ఒక్కొక్కరు తప్పుకుంటున్నారు.kcr{#}bhanu;prabhakar;sudigali sudheer;Chintamaneni Prabhakar;Madhavaram;Parakala Prabhakar;KCR;MLA;Telangana;CM;dr rajasekhar;Party;Congress;Houseకేసీఆర్‌కు భారీ షాక్.. మరో ఎమ్మెల్యే, బడా లీడర్ జంప్ ?కేసీఆర్‌కు భారీ షాక్.. మరో ఎమ్మెల్యే, బడా లీడర్ జంప్ ?kcr{#}bhanu;prabhakar;sudigali sudheer;Chintamaneni Prabhakar;Madhavaram;Parakala Prabhakar;KCR;MLA;Telangana;CM;dr rajasekhar;Party;Congress;HouseSun, 07 Jul 2024 16:40:00 GMTబీఆర్ఎస్ పరిస్థితి అయోమయంలో పడింది. పార్టీలో ఉండేది ఎవరో.... పోయేది ఎవరో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. వరుసగా బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తాకుతున్నాయి. రాత్రికి రాత్రే ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీలు మారారు. తాజాగా కీలక సమావేశం ఏర్పాటు చేస్తే ఐదుగురు ఎమ్మెల్యేలు, 10 మంది కార్పొరేటర్లు డుమ్మకొట్టారు. వారంతా మీటింగ్ కి రాకపోవడంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో ఉండే కేసీఆర్ ఎన్ని ప్లాన్స్ వేసినా ....ఎంత ధీమా వ్యక్తం చేసిన పార్టీ నుంచి ఒక్కొక్కరు తప్పుకుంటున్నారు.


లేదంటే సమావేశాలకు డుమ్మాలు కొడుతున్నారు. అలాంటి పరిణామమే చోటు చేసుకుంది. పార్టీ మారిన జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించిన క్రమంలో తెలంగాణ భవన్ లో తలసాని నేతృత్వంలో ఓ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ కు గ్రేటర్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అంతా తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. కానీ కొందరు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ముఖం చాటేశారు. ఎమ్మెల్యేలు బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్ మీటింగ్ కు రాలేదు. వారితో పాటు పదిమంది కార్పొరేటర్లు కూడా హాజరుకాలేదు.


వారు డుమ్మా కొట్టడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మాగంటి గోపీనాథ్, పద్మారావు, సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, ప్రకాష్ గౌడ్ మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. డుమ్మ కొట్టిన వారంతా పార్టీ మారుతున్నారా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గైర్హాజరైన వారిలో ఇప్పటికే ఒకరిద్దరూ సీఎం రేవంత్ రెడ్డిని గతంలోనే కలిశారు. దాంతో మల్లి వికెట్లు పడతాయని పార్టీలో ఆందోళన వ్యక్తం అవుతుంది.


ఇదిలా ఉండగా.... బీఆర్ఎస్ కు చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీలు మారారు. అర్ధరాత్రి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. బసవరాజు సారయ్య, భాను ప్రసాద్ రావు, దండే విఠల్, ఎగ్గె మల్లేశం, ప్రభాకర్ రావు, దయానంద్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ బలం 12కి పెరిగింది. ఇప్పటివరకు ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు మారారు. ఇక ఇప్పుడు అలంపూర్‌ ఎమ్మెల్యే విజేయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కూడా కాంగ్రెస్‌ లోకి వెళుతున్నారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>