MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamilnadu-woman-a6c6640c-2ac9-4c4a-a101-c49ba4511e94-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamilnadu-woman-a6c6640c-2ac9-4c4a-a101-c49ba4511e94-415x250-IndiaHerald.jpgఈ కాలంలో మోసాలు ఎక్కువ అయిపోయాయి. కొందరు ఆడవాళ్లు కూడా మగవారితో సమానంగా మోసాలకు పాల్పడుతూ షాకలిస్తున్నారు. డబ్బుల కోసం ఎవరిని పడితే వారిని పెళ్లి చేసుకోవడం వారితో కొద్దిరోజులు సంసారం చేయడం తర్వాత అందిన కాడికి క్యాష్ నగలు తో చేయడం కొందరికి అలవాటైపోయింది. తాజాగా తమిళనాడుకు చెందిన ఒక మహిళ ఏకంగా 50 మందిని పెళ్లి చేసుకొని మోసం చేసిందని పోలీసులు తెలుసుకున్నారు. ఆమె 50 మందిని మోసం చేయగా వారిలో ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారట ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. Tamilnadu woman {#}sandhya;Palani;District;police;Tamil;marriage;Husband;Evening;Girl;Parentsడబ్బు, నగల కోసం ఏకంగా 50 పెళ్లిళ్లు చేసుకున్న తమిళనాడు మహిళ..!డబ్బు, నగల కోసం ఏకంగా 50 పెళ్లిళ్లు చేసుకున్న తమిళనాడు మహిళ..!Tamilnadu woman {#}sandhya;Palani;District;police;Tamil;marriage;Husband;Evening;Girl;ParentsSun, 07 Jul 2024 11:31:00 GMTఈ కాలంలో మోసాలు ఎక్కువ అయిపోయాయి. కొందరు ఆడవాళ్లు కూడా మగవారితో సమానంగా మోసాలకు పాల్పడుతూ షాకలిస్తున్నారు. డబ్బుల కోసం ఎవరిని పడితే వారిని పెళ్లి చేసుకోవడం వారితో కొద్దిరోజులు సంసారం చేయడం తర్వాత అందిన కాడికి క్యాష్ నగలు తో చేయడం కొందరికి అలవాటైపోయింది. తాజాగా తమిళనాడుకు చెందిన ఒక మహిళ ఏకంగా 50 మందిని పెళ్లి చేసుకొని మోసం చేసిందని పోలీసులు తెలుసుకున్నారు. ఆమె 50 మందిని మోసం చేయగా వారిలో ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారట ఇది ఇప్పుడు సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళితే, తిరువూర్ జిల్లా తారాపురానికి చెందిన ఓ యువకుడు తారాపురం ఉడుమలై రోడ్డులో బేకరీ, పశుగ్రాస విక్రయ కంపెనీ నిర్వహిస్తున్నాడు. అతడికి 35 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు దాంతో బంధువులు పెళ్లి కోసం అమ్మాయి కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో సదరు యువకుడికి కొడుమూడికి చెందిన సంధ్య అనే యువతికి ‘అంబి డేట్ ద తమిళ్ వే’ అనే ఇంటర్నెట్ సైట్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆమె తనకు కేవలం 30 ఏళ్ళ వయసు మాత్రమే ఉందని చెప్పింది. చాలా ప్రేమగా మాట్లాడింది. దాంతో యువకుడు ఆమె బుట్టలో పడిపోయాడు. అనంతరం పళని సమీపంలోని ఓ దేవాలయంలో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అబ్బాయి తల్లిదండ్రులు కూడా పెళ్లికి అంగీకరించారు.3 నెలలుగా యువకుడితో కలిసి వైవాహిక జీవితాన్ని గడిపింది సంధ్య. అయితే ఆమె చెప్పిన వయసు, శరీర రూపురేఖలు ఒకదానితో ఒకటి మ్యాచ్ కాకపోవడంతో  అనుమానం వచ్చింది. ఆమె ఆధార్ కార్డును పరిశీలించగా భర్త స్థానంలో చెన్నైకి చెందిన మరో వ్యక్తి పేరు ఉన్నట్లు తేలింది. వయస్సు కూడా భిన్నంగా ఉన్నట్లు సదరు యువకుడు తెలుసుకున్నాడు.

దీంతో దిగ్భ్రాంతికి గురైన యువకుడి కుటుంబీకులు సంధ్యను విచారించగా, సంధ్య ఆగ్రహం చెంది యువకుడితో పాటు అతని కుటుంబసభ్యులను బెదిరించింది. దీంతో అప్రమత్తమైన యువకుడు యువతిని ఆల్‌ ఉమెన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించగా.. ఆ యువతి చెన్నైకి చెందిన ఓ వ్యక్తిని 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నట్లు తేలింది. పెళ్లయిన కొద్ది నెలల్లోనే సంధ్య భర్తతో గొడవపడి నగలు, డబ్బుతో అజ్ఞాతంలోకి వెళ్లింది. సంధ్య మ్యాట్రిమోనియల్ లిస్ట్‌లో, 40 ఏళ్లు పైబడిన పురుషులను ఫాలో అవుతోంది. అలా ఆమె అమ్మాయిలు కోసం వెతుకుతున్న వారిని తన బుట్టలో వేసుకొని వారి దగ్గర డబ్బులు కాజేస్తోంది. సంధ్యను పోలీసులు విచారిస్తుండగా షాపింగ్ నిజాలు బయటపడుతున్నాయి, పలువురు వ్యాపారవేత్తలు ఆమెను పెళ్లి చేసుకుని నగలు పోగొట్టుకున్నారని, ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>