PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandra-babu-revanth-reddy-edb5c785-eaa8-46e9-a000-640808bc6a4b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandra-babu-revanth-reddy-edb5c785-eaa8-46e9-a000-640808bc6a4b-415x250-IndiaHerald.jpgతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎదగడానికి ముందు చాలానే కష్టపడ్డారు. కేసీఆర్ అతడిని ఓటుకు నోటు కేసులో చాలానే ఇబ్బంది పెట్టారు. అయినా లెక్క చేయకుండా అంతటి శక్తివంతమైన రాజకీయ నేతకు ఎదురొడ్డి విజయం సాధించారు. అధికారంలోకి వచ్చిన సమయం నుంచి బీఆర్ఎస్‌ను తొక్కేస్తున్నారు. ఇంతకుముందు బీఆర్ఎస్ తెలంగాణలో తమకు పోటీగా ఏ పార్టీ లేకుండా చేసింది. ఇప్పుడుChandra Babu revanth Reddy {#}KTR;MLA;Party;KCR;CM;Congress;Reddy;revanth;Revanth Reddy;CBN;Telanganaగురువును మించిన శిష్యుడిలా ఉన్నారే.. బీఆర్ఎస్‌ను పాతాళానికి తొక్కేస్తున్నారుగా...??గురువును మించిన శిష్యుడిలా ఉన్నారే.. బీఆర్ఎస్‌ను పాతాళానికి తొక్కేస్తున్నారుగా...??Chandra Babu revanth Reddy {#}KTR;MLA;Party;KCR;CM;Congress;Reddy;revanth;Revanth Reddy;CBN;TelanganaSun, 07 Jul 2024 07:37:00 GMT
• గురువును మించిన శిష్యుడిలా మారిన రేవంత్  

• తెలంగాణలో బీఆర్ఎస్‌ను పాతాళానికి తొక్కేస్తున్నారు

• చంద్రబాబుకు సాధ్యం కానిది సుసాధ్యం చేసి చూపిస్తున్నారు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎదగడానికి ముందు చాలానే కష్టపడ్డారు. కేసీఆర్ అతడిని ఓటుకు నోటు కేసులో చాలానే ఇబ్బంది పెట్టారు. అయినా లెక్క చేయకుండా అంతటి శక్తివంతమైన రాజకీయ నేతకు ఎదురొడ్డి విజయం సాధించారు. అధికారంలోకి వచ్చిన సమయం నుంచి బీఆర్ఎస్‌ను తొక్కేస్తున్నారు. ఇంతకుముందు బీఆర్ఎస్ తెలంగాణలో తమకు పోటీగా ఏ పార్టీ లేకుండా చేసింది. ఇప్పుడు పోటీలో బీఆర్ఎస్‌ అనేది లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్నారు రేవంత్ రెడ్డి.

ఆపరేషన్ ఆకర్ష్ పేరిట కీలకమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో జాయిన్ చేయిస్తున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు హస్తం పార్టీలోకి జంప్ చేశారు. రీసెంట్ గా గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఇంకా ఇలాంటి చేరికలు జరుగుతూనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్లాన్ కారణంగా కేసీఆర్ తల పట్టుకుంటున్నారట. గతంలో కేసీఆర్ ఇలానే చాలామంది ప్రతిపక్ష పార్టీ నేతలను తమ బీఆర్ఎస్‌లో కలుపుకున్నారు. సేమ్ అదే రూట్‌లో రేవంత్ వెళుతూ కేసీఆర్, కేటీఆర్ లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. అధికారం అధికారంలోకి వచ్చేది మనమే అని కేసీఆర్ ఎంత చెప్తున్నా వినడం లేదు.

 ముఖ్య నేతలను పార్టీలో కలుపుకుంటే బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో పతనం అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు 39 సీట్లు వచ్చాయి. బాగా బలంగా ఉన్న నేతలు పోతే గెలవడం మాట అటు ఉంచితే 20 సీట్లు కూడా దాటే అవకాశం ఉండదని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఎత్తుకు పై ఎత్తుకు వేసి అందర్నీ కలుపుకుంటూ వెళ్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసే సామర్థ్యం ఉన్నవారు. అలా జరగకుండా ఉండాలంటే చేరికలు తప్పనిసరి అని రేవంత్ తమ పార్టీ మెంబర్స్ అందరికీ చెప్పినట్లు. దాంతో వారు కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అందుకే చేరికలు జోరుగా సాగుతున్నాయి. ఒకప్పుడు చంద్రబాబు కేసీఆర్ ని ఢీకొనలేక తెలంగాణ నుంచి వెళ్ళిపోయారు. కానీ ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి కేసీఆర్ ను పాతాళంలోకి తొక్కేస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డి గురువును మించిన శిష్యుడు అని అనవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>