MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jr-ntrb615ce71-1756-4a11-bc2b-755edee7edbe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jr-ntrb615ce71-1756-4a11-bc2b-755edee7edbe-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను ఫుల్ స్పీడ్ గా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని జాన్వి కపూర్ హీరోయినjr ntr{#}Saif Ali Khan;Beautiful;Romantic;Janhvi Kapoor;koratala siva;september;Goa;Hero;Blockbuster hit;Hyderabad;NTR;Jr NTR;Telugu;Music;News;Cinemaదేవర మూవీలో మొత్తం ఎన్ని రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయో తెలుసా..?దేవర మూవీలో మొత్తం ఎన్ని రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయో తెలుసా..?jr ntr{#}Saif Ali Khan;Beautiful;Romantic;Janhvi Kapoor;koratala siva;september;Goa;Hero;Blockbuster hit;Hyderabad;NTR;Jr NTR;Telugu;Music;News;CinemaSun, 07 Jul 2024 21:35:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను ఫుల్ స్పీడ్ గా పూర్తి చేస్తూ వస్తున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని జాన్వి కపూర్ హీరోయిన్ గా కనిపించనుండగా ... ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ , జాన్వి కపూర్ పై రెండు రొమాంటిక్ సాంగ్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకు అంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ గోవా లో ఎన్టీఆర్ మరియు జాహ్న కపూర్ పై ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించినట్టు వార్తలు వచ్చాయి.

ఇక ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ వచ్చే వారం ఎన్టీఆర్ , జాన్వి కపూర్ కాంబినేషన్ లో మరో రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ ను హైదరాబాద్ శివారు లలో వేసిన ఒక ప్రత్యేక సెట్ లో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తోనే జాన్వీ కపూర్ తెలుగు తేరకు పరిచయం కానుంది. ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ కావడం , కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>