MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nbkf7bdab32-2176-4818-8b6b-2770b3ab62fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nbkf7bdab32-2176-4818-8b6b-2770b3ab62fe-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇకపోతే సినిమాల్లో మాత్రమే కాకుండా బాలకృష్ణ రాజకీయాల్లో కూడా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇప్పటి వరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మూడు సార్లు కూడా గెలిచాడు. ఇక మూడు సార్లు గెలిచిన మంత్రి పదవి తీసుకోకుండా మరో గొప్ప పేరును సంపాదించుకున్నాడు. ఇకపోతే బాలకృష్ణ ఎక్కువ శాతం తన తండ్రి అయినటువంటి ఎన్టీఆర్ గురించి చెబుతూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆయన సినిమా ప్రస్థానం గురించి , సినిమాల్లో ఎదిగnbk{#}NTR;Balakrishna;Success;Father;Bobby;Minister;Cinemaఅమ్మ త్యాగం మరువలేనిది.. తన తల్లి గురించి చెబుతూ ఎమోషనల్ అయిన బాలయ్య..!అమ్మ త్యాగం మరువలేనిది.. తన తల్లి గురించి చెబుతూ ఎమోషనల్ అయిన బాలయ్య..!nbk{#}NTR;Balakrishna;Success;Father;Bobby;Minister;CinemaSun, 07 Jul 2024 09:14:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇకపోతే సినిమాల్లో మాత్రమే కాకుండా బాలకృష్ణ రాజకీయాల్లో కూడా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇప్పటి వరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మూడు సార్లు కూడా గెలిచాడు. ఇక మూడు సార్లు గెలిచిన మంత్రి పదవి తీసుకోకుండా మరో గొప్ప పేరును సంపాదించుకున్నాడు. ఇకపోతే బాలకృష్ణ ఎక్కువ శాతం తన తండ్రి అయినటువంటి ఎన్టీఆర్ గురించి చెబుతూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి.

ఆయన సినిమా ప్రస్థానం గురించి , సినిమాల్లో ఎదిగిన విధానం గురించి , అలాగే రాజకీయాల్లోకి రావడం , అందులో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అద్భుతమైన స్థాయికి వెళ్లడం ఇలా ఆయనకు సంబంధించిన అనేక విషయాలు గురించి బాలకృష్ణ చాలా సందర్భాలలో మాట్లాడాడు. కానీ తన తల్లి బసవతారకం గురించి పెద్దగా మాట్లాడలేదు. కాకపోతే తాజాగా బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన తల్లి గురించి మాట్లాడుతూ ఆమె చేసిన త్యాగాలు చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. బాలకృష్ణ తాజా ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... ఎన్టీఆర్ , బసవతారకం ఇద్దరు కూడా మద్రాసులో ఉండేవారు అని , మేమంతా హైదరాబాదులో ఉండే వారం వారు వీలు దొరికినప్పుడల్లా వచ్చేవారు.

కానీ నాన్న గారు మాత్రం గెస్ట్ అపీరియన్స్ , ఎప్పుడో ఒక సారి వచ్చే వారు ఎప్పుడు ఆయన సినిమాలతో చాలా బిజీగా సమయాన్ని గడిపేవారు. ఆయనను ఎక్కువ సినిమాల్లో చూస్తూ ఆనందించే వాళ్ళం. ఇక అమ్మ 13 మంది పిల్లలని కంది. అలా కనడం కోసం ఎంత బాధను అనుభవించిందో. అవన్నీ చూస్తుంటే నాన్న గారి కోసం , మా కోసం ఆమె ఎంతో త్యాగం చేసింది. ఒక పూణ్యాత్మురాలు. అన్ని సద్గుణాలు కలగలిపిన ఒక మహోన్నతమైన వ్యక్తి అమ్మగారు అంటూ తాజా ఇంటర్వ్యూలో బాలయ్య ఎమోషనల్‌ అయ్యారు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ , బాబీ దర్శకత్వంలో NBK 109 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>