PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-ycpd1d55300-fcdf-4ecd-8b06-1036989316df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-ycpd1d55300-fcdf-4ecd-8b06-1036989316df-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లో నిన్నటి రోజు నుంచి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా రిజైన్ చేసి ఎంపీగా పోటీ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీని ద్వారా కేంద్రంతో సంబంధాలు పెట్టుకోబోతున్నారని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వెళ్లడం జరిగింది.. ముఖ్యంగా తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఉత్సవాలకు సంబంధించి వెళ్లడం జరిగింది.. ఈ సందర్భంలో అక్కడితో ఆగకుండా.. వైసిపి నేతల మీద కార్యాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నప్పటికీ.. అందులో వైసిపి కార్యకర్త దాడిలో గాయపడడంతో పJAGAN;YCP{#}Jayanthi;Perni Nani;Father;dr rajasekhar;Jagan;Reddy;News;Party;CM;police;Yevaru;YCPఏపీ: కీలక అడుగు వేసిన జగన్..!ఏపీ: కీలక అడుగు వేసిన జగన్..!JAGAN;YCP{#}Jayanthi;Perni Nani;Father;dr rajasekhar;Jagan;Reddy;News;Party;CM;police;Yevaru;YCPSun, 07 Jul 2024 09:30:00 GMTఆంధ్రప్రదేశ్లో నిన్నటి రోజు నుంచి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా రిజైన్ చేసి ఎంపీగా పోటీ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీని ద్వారా కేంద్రంతో సంబంధాలు పెట్టుకోబోతున్నారని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వెళ్లడం జరిగింది.. ముఖ్యంగా తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఉత్సవాలకు సంబంధించి వెళ్లడం జరిగింది.. ఈ సందర్భంలో అక్కడితో ఆగకుండా.. వైసిపి నేతల మీద కార్యాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నప్పటికీ.. అందులో వైసిపి కార్యకర్త దాడిలో గాయపడడంతో పరామర్శించడానికి వెళ్లారు.



ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి అడుగు అని కూడా చెప్పవచ్చు.. గతంలో కార్యకర్తలకు ఏం జరిగినా కూడా చాలామంది స్టేట్మెంట్లు మాత్రమే ఇచ్చారు.. ఎవరు కూడా కార్యకర్తల దగ్గరకు వెళ్లలేదని ఫీలింగ్ చాలా మందికి ఉన్నది.. కేవలం అంబాటి రాంబాబు పేర్ని నాని వంటి వారు మాత్రమే వెళ్లారు. ఇలాంటి సందర్భంలో జగన్ వెళ్లడం అంటే.. మిగతా నాయకులకు ఇది ఒక సంకేతం లాంటిదని చెప్పవచ్చు. గాయపడిన వాళ్లు బాధితుల దగ్గరకు వెళ్లడం వాళ్లని ఓదార్చడం వారికి అండగా ఉంటానని చెప్పడం ప్రభుత్వానికి మరొకసారి హెచ్చరిక జారీ చేశారు.


ఈ తరహా దాడులు మంచి సంస్కృతికి కాదు అని.. దీనివల్ల ప్రమాదం అంటూ హెచ్చరించారు. అయితే ఇలాంటివి నాయకులు ప్రోత్సహిస్తారని చెప్పారు కానీ.. అడ్డు చెప్పకపోతే.. కింద స్థాయిలోని నేతలు రెచ్చిపోవడం జరుగుతుంది. రేపొద్దున కూడా ఇలాంటి విషయాల పైన ఎవరు అదుపు చేయలేరు. ఏ పార్టీ వాళ్ళైనా సరే పోలీసులు పర్ఫెక్ట్ గా ఉండాలి.. ఘర్షణలు సృష్టించడానికి వీలులేదని ఆపుతూ ఉండాలి. ఏదైనా ప్రజలకు అన్యాయం జరిగితే కేసు పెట్టి చట్టపరమైన న్యాయం చూస్తామని.. మీరు ఇలా చేయడానికి వీలులేదని చెప్పాలి.. ఇప్పుడు హింస జరుగుతోందని చూస్తూ ఉంటే రేపు పొద్దున కూడా.. ఇవాళ తన్నినోళ్లు రేపు తన్నులు తింటారు. ఇవాళ ఆస్తులు కోల్పోయిన వాళ్ళు రేపు పొద్దున ఆస్తులను కూల్చేస్తారు.. దీనివల్ల నష్టపోయేది సామాన్యులు.. ఇటు కార్యకర్త అటు కార్యకర్తలే అని చెప్పవచ్చు. ఇలాంటి విషయాలను గుర్తు పెట్టుకోవాలని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>