MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamal77683772-b44e-4945-adba-c72fea3a4d69-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamal77683772-b44e-4945-adba-c72fea3a4d69-415x250-IndiaHerald.jpgలోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా భారతీయుడు 2 అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యే అద్భుతమైన విజయం సాధించిన భారతీయుడు మూవీ కి కొనసాగింపుగా రూపొందింది. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించగా ... సిద్ధార్థ్ , రకుల్ ప్రీత్ సింగ్ , కాజల్ అగర్వాల్ ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఎస్ జై సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. లైకా ప్రొడక్షన్స్ , రెడ్ గ్లాంట్ సంస్థల వారు నిర్మించిన ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఇకపోతే శంకర్ భారతీయుడు 2 పkamal{#}surya sivakumar;Red;Bharateeyudu;Siddharth;kajal aggarwal;lyca productions;Music;rakul preet singh;shankar;Cinema;Newsనా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు.. తాను చేసిన వ్యక్తులకు వివరణ ఇచ్చిన కమల్..!నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు.. తాను చేసిన వ్యక్తులకు వివరణ ఇచ్చిన కమల్..!kamal{#}surya sivakumar;Red;Bharateeyudu;Siddharth;kajal aggarwal;lyca productions;Music;rakul preet singh;shankar;Cinema;NewsSun, 07 Jul 2024 20:58:00 GMTలోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా భారతీయుడు 2 అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యే అద్భుతమైన విజయం సాధించిన భారతీయుడు మూవీ కి కొనసాగింపుగా రూపొందింది. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించగా ... సిద్ధార్థ్ , రకుల్ ప్రీత్ సింగ్ , కాజల్ అగర్వాల్మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఎస్ జై సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. లైకా ప్రొడక్షన్స్ , రెడ్ గ్లాంట్ సంస్థల వారు నిర్మించిన ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు.

ఇకపోతే శంకర్ భారతీయుడు 2 పాటు  భారతీయుడు 3 కు సంబంధించిన చాలా సన్నివేశాలను కూడా ఇప్పటికే చిత్రీకరించారు అని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఇక భారతీయుడు 2 మూవీ ని జూలై 12 వ తేదీన విడుదల చేయనున్నారు. దానితో ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ లలో భాగంగా కమల్ హాసన్ నాకు భారతీయుడు 2 కంటే భారతీయుడు 3 సినిమా బాగా నచ్చింది. అందులో ఎమోషన్స్ చాలా బాగున్నాయి అని చెప్పాడు.

దీనితో భారతీయుడు 2 సినిమా గొప్పగా ఉండి ఉండదు భారతీయుడు 3 సినిమానే బాగా ఉండి ఉంటుంది. అందుకే కమల్ హాసన్ అలా అన్నాడు అనే వార్తలు బయటకు రాసాగాయి. దానితో కమల్ తాజాగా ఈ వార్తలపై స్పందించాడు. కమల్ తాజాగా మాట్లాడుతూ ... భారతీయుడు 2 కంటే 3 బాగా నచ్చిందని తాను చేసిన వ్యాఖ్యలను కొందరు మరోలా అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు. మూడో భాగం బాగుంది అన్న... అలా అని రెండవ భాగం బాగాలేదు అని కాదు. సాంబారు , రసంతో భోజనాన్ని ఇష్టంగా తింటాం. పాయసం ఉంటే మరింత ఆసక్తిని చూపిస్తాం. అలాగే పలు అంశాల్లో భారతీయుడు 3 నన్ను ఆకట్టుకుంది అని ఆయన చెప్పుకొచ్చాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>