PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/sand-36e53976-4aaf-42ff-ab12-b2764d6204f8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/sand-36e53976-4aaf-42ff-ab12-b2764d6204f8-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో రేపటి నుంచి ఉచిత ఇసుక పంపిణీ చేయనుంది తెలుగు దేశం కూటమి సర్కార్‌. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు. ఇక ఈ ఇసుక పాలసీ అమలుకు మార్గదర్శకాలు కూడా జారీ చేశారు అధికారులు. వినియోగదారునికి ఉచిత ఇసుకను అందించే క్రమంలో మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేయనున్నారు. sand {#}nandu;Chittoor;Srikalahasti;Evening;Venkatagiri;Gudur;Manam;mandalam;News;Telugu Desam Partyఏపీ : రేపటి నుంచి ఉచిత ఇసుక.. బుక్ చేసుకోవడం ఎలా..!?ఏపీ : రేపటి నుంచి ఉచిత ఇసుక.. బుక్ చేసుకోవడం ఎలా..!?sand {#}nandu;Chittoor;Srikalahasti;Evening;Venkatagiri;Gudur;Manam;mandalam;News;Telugu Desam PartySun, 07 Jul 2024 10:17:00 GMTఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో రేపటి నుంచి ఉచిత ఇసుక పంపిణీ చేయనుంది తెలుగు దేశం కూటమి సర్కార్‌. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు. ఇక ఈ ఇసుక పాలసీ అమలుకు మార్గదర్శకాలు కూడా జారీ చేశారు అధికారులు. వినియోగదారునికి ఉచిత ఇసుకను అందించే క్రమంలో మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేయనున్నారు.


జిల్లా, డివిజనల్ స్థాయిలో కమిటీల ఏర్పాటు చేస్తారు. ఎస్కలేషన్ (పెరుగుదల) రవాణా, పరిపాలనా పరమైన చార్జీలు వసూలు చేయనున్నారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానంలో ఇసుక సరఫరా జరుగనుంది. స్టాక్ పాయింట్, డిసిల్టేషన్ పాయింట్స్ వద్ద అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ ఉంటుంది. స్టాక్ పాయింట్స్ వద్ద సి సి కెమెరాల నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారు. గరిష్టంగా ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది.

ఉదయం 6 నుండి సాయంత్రం 6 గం.ల వరకు మాత్రమే ఉచిత ఇసుక పంపిణీ చేయనుంది తెలుగు దేశం కూటమి సర్కార్‌. డిజిటల్ పేమెంట్ ద్వారా మాత్రమే ఈ చెల్లింపులు చేయనుంది. మనం ఇసుక బుక్‌ చేసుకోవాలంటే కూడా ఆన్‌ లైన్‌ లో చేసుకోవాలి. రూ.88 గ్రామ పంచాయితీలకు కట్టి బుక్‌ చేసుకోవచ్చును. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏడు స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. శ్రీకాళహస్తి డివిజన్ నందు  సుబ్బరాయుడు కండ్రిగ నందు రెండు స్టాక్ పాయింట్ల వద్ద ఒక మెట్రిక్ టన్నుకు 200 రూపాయలుగా ఫిక్స్‌ చేశారట అధికారులు.

పిచ్చాటురు మండలం నందు ఏ కే బీడు నందు 200గా ఫిక్స్‌ చేశారు. అటు చిత్తూరు జిల్లా సూళ్లూరుపేట డివిజన్ దొరవారి సత్రం మండలము మామిల్ల పాడు వద్ద మెట్రిక్ టన్ను 465 రూపాయలు ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. గూడూరు డివిజన్ వెంకటగిరి మండలము మొదలగుంట స్టాక్ పాయింట్ వద్ద 590 రూపాయలు ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. చిత్తూరు రెండు చోట్లా ఉన్న స్టాక్ పాయింట్ 155 రూపాయలు ఫిక్స్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>