PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/shocking-kadapa-parliament-pulivendula-assembly-by-elections-in-6-monthsbea262e8-db5f-4f04-8bf3-39117d7f8206-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/shocking-kadapa-parliament-pulivendula-assembly-by-elections-in-6-monthsbea262e8-db5f-4f04-8bf3-39117d7f8206-415x250-IndiaHerald.jpgటైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా.. గత కొద్దిగంటలుగా వైసీపీ సోషల్ మీడియాలోనూ.. వైసీపీ వర్గాల్లోనూ.. తెలుగు సోషల్ మీడియాలోనూ ఇదే విషయం బాగా చెక్కర్లు కొడుతోంది. ఆరు నెలల్లో కడప పార్లమెంటు స్థానానికి.. పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నట్టు ఒకటే ప్రచారం జోరుగా నడుస్తోంది. మామూలుగానే జగన్‌మోహన్ రెడ్డికి ఈ ఘోర ఓటమి ఎంత మాత్రం నచ్చటం లేదు. జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయటానికి కూడా మొక్కుబడిగా వచ్చారు. ఈ ఐదేళ్లు జగన్ అసెంబ్లీ వెళ్ళేందుకు కూడా ఎంత మాత్రం ఇష్టపడటం లేదు. AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; ycp; ys jagan; Avinash {#}devineni avinash;kadapa;Y S Vivekananda Reddy;Elections;Pulivendula;రాజీనామా;Arrest;Telugu;YCP;Jaganషాకింగ్ : 6 నెలల్లో కడప పార్లమెంట్ - పులివెందుల అసెంబ్లీకి ఉప ఎన్నికలు.. ?షాకింగ్ : 6 నెలల్లో కడప పార్లమెంట్ - పులివెందుల అసెంబ్లీకి ఉప ఎన్నికలు.. ?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; ycp; ys jagan; Avinash {#}devineni avinash;kadapa;Y S Vivekananda Reddy;Elections;Pulivendula;రాజీనామా;Arrest;Telugu;YCP;JaganSun, 07 Jul 2024 09:50:20 GMTటైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా.. గత కొద్దిగంటలుగా వైసీపీ సోషల్ మీడియాలోనూ.. వైసీపీ వర్గాల్లోనూ.. తెలుగు సోషల్ మీడియాలోనూ ఇదే విషయం బాగా చెక్కర్లు కొడుతోంది. ఆరు నెలల్లో కడప పార్లమెంటు స్థానానికి.. పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నట్టు ఒకటే ప్రచారం జోరుగా నడుస్తోంది. మామూలుగానే జగన్‌మోహన్ రెడ్డికి ఈ ఘోర ఓటమి ఎంత మాత్రం నచ్చటం లేదు. జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయటానికి కూడా మొక్కుబడిగా వచ్చారు. ఈ ఐదేళ్లు జగన్ అసెంబ్లీ వెళ్ళేందుకు కూడా ఎంత మాత్రం ఇష్టపడటం లేదు.


అసెంబ్లీకి వెళ్లిన అక్కడ ప్రజా సమస్యలపై లేదా ఏదైనా అంశంపై మాట్లాడేందుకు జగన్‌కు అవకాశం ఇస్తారన్న నమ్మకం కూడా జగన్‌కు కలగటం లేదు. అందులోనూ జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఈ టైంలో అసెంబ్లీకి వెళ్లి అవమానపడటం కంటే.. పార్లమెంటుకు వెళ్లి పార్లమెంట్‌లో రాష్ట్ర హక్కులపై గళ‌మెత్తాల‌ని జగన్ నిర్ణయించుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే పులివెందుల అసెంబ్లీకి జగన్, కడప పార్లమెంటుకు అవినాష్ రెడ్డి ఇద్దరు రాజీనామా చేస్తారని.. ఆరు నెలల్లోనే ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.


ఈ క్రమంలోనే జగన్.. కడప పార్లమెంటుకు పోటీ చేస్తే వైయస్ విజయలక్ష్మి.. పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎప్పుడూ అయినా అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ క్రమంలోనే ఇంకా చెప్పాలంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ కావటానికి ముందే ఆయనతో జగన్ పార్లమెంటుకు రాజీనామా చేయిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా వచ్చే ఆరు నెలల్లో కడప - పులివెందుల కేంద్రంగా రాజకీయ సమీకరణలు శరవేగంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>