Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle817a7492-dbb5-4e18-b9a8-c6c4fdd5f465-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle817a7492-dbb5-4e18-b9a8-c6c4fdd5f465-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దేవర' . యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. అనిరుధ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న 'దేవర' చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ 'ఫియర్ సాంగ్' కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు రెండో సాంగ్ విడుదలకు ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది. సెకండ్ సింగిల్ గా రొమాంటిక్ సాంగ్ విడుదల కానుందట.socialstars lifestyle{#}Saif Ali Khan;koratala siva;mikkilineni;Sangeetha;Music;Romantic;Mass;NTR Arts;Chitram;Shamshabad;NTR;Heroine;News;Cinemaదేవరతో రొమాన్స్ కు సిద్దమైన జాన్వీ..!!దేవరతో రొమాన్స్ కు సిద్దమైన జాన్వీ..!!socialstars lifestyle{#}Saif Ali Khan;koratala siva;mikkilineni;Sangeetha;Music;Romantic;Mass;NTR Arts;Chitram;Shamshabad;NTR;Heroine;News;CinemaSun, 07 Jul 2024 11:25:00 GMTజూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దేవర' . యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్  హీరోయిన్ కాగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. అనిరుధ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న 'దేవర' చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ 'ఫియర్ సాంగ్' కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు రెండో సాంగ్ విడుదలకు ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది. సెకండ్ సింగిల్ గా రొమాంటిక్ సాంగ్ విడుదల కానుందట.

దీనిని జూలై 19న విడుదల చేయనున్నారని సమాచారం. కాగా, ఇటీవల గోవాలో ఎన్టీఆర్-జాన్వీ లపై ఈ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ జరిగింది. ఈ సాంగ్ లో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందట. ఇప్పుడు ఆ పాటే సెకండ్ సింగిల్ గా రానుందని టాక్. ఎన్టీఆర్, జాన్వీ ల రొమాన్స్ ని లిరికల్ వీడియోలో శాంపిల్ గా చూపిస్తారని.. థియేటర్లో ఫుల్ వీడియో సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ రావడం ఖాయమని అంటున్నారు.

అలాగే తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలోని మాస్ డ్యూయెట్ సాంగ్ కోసం శంషాబాద్ లో మూవీ మేకర్స్ భారీ సెట్ ని వేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సాంగ్ షూటింగ్ వచ్చే వారం ప్రారంభం కానుంది.
ఇప్పటికే యాక్షన్‌ పార్ట్, టాకీ ఎక్కువ శాతం పూర్తి కావడంతో కొరటాల శివ పాటల చిత్రీకరణపై ఫోకస్‌ పెట్టినట్లుగా తెలుస్తోంది.ఈ మూవీలో సైఫ్‌ అలీఖాన్, శ్రీకాంత్, ప్రకాశ్‌రాజ్, షైన్‌ టామ్‌ చాకో, నరైన్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. కల్యాణ్‌రామ్‌ సమర్పణలో కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్‌ నిర్మిస్తున్న 'దేవర' రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగాన్ని సెప్టెంబరు 27న విడుదల చేయనున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>