PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-assembly-elections-ap-elections-survey-telangana-parliament-elections-andhrapradesh-assembly-elections-assembly-elections-2024-jagan-ycp-ys-jagan6a71d261-6807-4503-b190-6f7316f28274-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-assembly-elections-ap-elections-survey-telangana-parliament-elections-andhrapradesh-assembly-elections-assembly-elections-2024-jagan-ycp-ys-jagan6a71d261-6807-4503-b190-6f7316f28274-415x250-IndiaHerald.jpg( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ . ) ఏపీలో ఐదేళ్ల జ‌గ‌న్ పాల‌న‌లో చాలా వ్య‌క్తిగ‌త కార్య‌క్ర‌మాల‌కు... సొంత ఇంట్లో ప‌నిమ‌నుష్యుల‌కు కూడా చాలా వ‌ర‌కు వైసీపీ వాళ్లు ప్ర‌భుత్వ ధ‌నంతోనే జీతాలు ఇవ్వ‌డ‌మో లేదా దోచి పెట్ట‌డ‌మో చేశారు. జ‌గ‌న్ సెక్యూరిటీలో అంద‌రికి ప్ర‌భుత్వ ధ‌నంత‌నే జీతాలు ఇచ్చార‌న్న టాక్ కూడా ఉంది. ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు కొన్ని వంద‌ల మందికి ఇదే త‌ర‌హాలో ప్ర‌భుత్వ ధ‌నంతోనే జీతాలు ఇచ్చేసి దోచి పెట్టేశారు. ఈ క్ర‌మంలోనే వైఎస్సార్ విగ్ర‌హాల కోసం కూడా ప్ర‌భుత్వ ధనాన్ని ఇష్టం వ‌చ్చిన‌ట్టు పAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jagan; ycp; ys jagan{#}sree;Y. S. Rajasekhara Reddy;MLA;Idupulapaya;India;YCP;Jagan;Ishtamఇడుపుల పాయ ఖ‌ర్చు కూడా జ‌నం ఖాతాలో వేసిన జ‌గ‌న్‌..?ఇడుపుల పాయ ఖ‌ర్చు కూడా జ‌నం ఖాతాలో వేసిన జ‌గ‌న్‌..?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jagan; ycp; ys jagan{#}sree;Y. S. Rajasekhara Reddy;MLA;Idupulapaya;India;YCP;Jagan;IshtamSun, 07 Jul 2024 12:44:41 GMTఇండియా హెరాల్డ్ . )

ఏపీలో ఐదేళ్ల జ‌గ‌న్ పాల‌న‌లో చాలా వ్య‌క్తిగ‌త కార్య‌క్ర‌మాల‌కు... సొంత ఇంట్లో ప‌నిమ‌నుష్యుల‌కు కూడా చాలా వ‌ర‌కు వైసీపీ వాళ్లు ప్ర‌భుత్వ ధ‌నంతోనే జీతాలు ఇవ్వ‌డ‌మో లేదా దోచి పెట్ట‌డ‌మో చేశారు. జ‌గ‌న్ సెక్యూరిటీలో అంద‌రికి ప్ర‌భుత్వ ధ‌నంత‌నే జీతాలు ఇచ్చార‌న్న టాక్ కూడా ఉంది. ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు కొన్ని వంద‌ల మందికి ఇదే త‌ర‌హాలో ప్ర‌భుత్వ ధ‌నంతోనే జీతాలు ఇచ్చేసి దోచి పెట్టేశారు. ఈ క్ర‌మంలోనే వైఎస్సార్ విగ్ర‌హాల కోసం కూడా ప్ర‌భుత్వ ధనాన్ని ఇష్టం వ‌చ్చిన‌ట్టు పంచేశార‌న్న కొత్త విష‌యం ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది.


ఏకంగా రు. పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టి.. రకరకాల విగ్రహాలతో ఇడుపులపాయ స్మృతి వనాన్ని నింపి ప‌డేశారు. మ‌రో ట్విస్ట్ ఏంటంటే ఆ కాంట్రాక్టులు తీసుకుంది.. అక్క‌డ ప‌నులు చేసింది కూడా అప్ప‌టి ముఖ్య‌మంత్రి జగన్ రెడ్డి చుట్టాలే కావ‌డం గ‌మ‌నార్హం. వారి కొంచెం మెక్కేసి… కొంచెం కమీషన్లు ఇచ్చి.. మిగతా వాటితో విగ్రహాలు తెచ్చి స‌రి పెట్టేశారు. గ‌ట్టిగా అయితే ఐదారు ల‌క్ష‌లు కూడా బిల్లు కాని వాటితో ఏకంగా కోట్ల‌కు బిల్లులు పెట్టి ప్ర‌భుత్వ ధ‌నాన్ని లూటీ చేసి ప‌డేశార‌నే చెప్పాలి.


ఇటు తాడేపల్లిలో సొంత ఇంటికి వంద కోట్లకుపైగా ఖర్చు పెట్టిన జ‌గ‌న్  ఇటు  ఇడుపులపాయలో ప్రజాధనంతో విగ్రహాలు పెట్టేశార‌న్న విమ‌ర్శ‌లు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు . ఇక జ‌స్ట్ రెండు కోట్లు ఖ‌ర్చు పెట్టి ఒక రోడ్డు పోయిస్తే చాలు చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం లో తాను గెలిచే వాడిని ని మాజీ ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ శ్రీ భోరుమంటున్నారు... ఇలా ర‌హ‌దారులు ... రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా గాలికి వ‌దిలేసిన జ‌గ‌న్ .. త‌న సొంత ఇల్లు.. అటు ఇడుపుల పాయ‌లో విగ్ర‌హాల పేరుతో మాత్రం కోట్లాది రూపాయ‌ల ప్ర‌జాధ‌నం పంచేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>