PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ysrba56f3e7-9e62-4d24-91f2-f2d82d8fcf35-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ysrba56f3e7-9e62-4d24-91f2-f2d82d8fcf35-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో అత్యంత కీలకమైన నేతలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు. ఈయన 1978 లో తొలి సారిగా పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభలో అడుగుపెట్టాడు. రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా, 4 సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీ చేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు. జనతా పార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని విజయం సాధించిన తొలి ఎన్నికల (1978) వెంటనే మంత్రి పదవి పొందాడు. ఆ తరువాత వెనువెంటనే ముగ్గురు ముఖ్యమంత్రులు మారిననూ ఆ మూడు మysr{#}Pulivendula;Praja Rajyam;kadapa;dr rajasekhar;Assembly;Party;Telugu Desam Party;Congress;Telangana Chief Minister;Minister;Chiranjeeviవైయస్సార్@75 : ఎన్ని పార్టీలు కలిసిన ఆయనను మాత్రం ఆపలేకపోయాయి..?వైయస్సార్@75 : ఎన్ని పార్టీలు కలిసిన ఆయనను మాత్రం ఆపలేకపోయాయి..?ysr{#}Pulivendula;Praja Rajyam;kadapa;dr rajasekhar;Assembly;Party;Telugu Desam Party;Congress;Telangana Chief Minister;Minister;ChiranjeeviSun, 07 Jul 2024 22:05:56 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో అత్యంత కీలకమైన నేతలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు. ఈయన 1978 లో తొలి సారిగా పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభలో అడుగుపెట్టాడు. రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా, 4 సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీ చేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు. జనతా పార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని విజయం సాధించిన తొలి ఎన్నికల (1978) వెంటనే మంత్రి పదవి పొందాడు.

ఆ తరువాత వెనువెంటనే ముగ్గురు ముఖ్యమంత్రులు మారిననూ ఆ మూడు మంత్రిమండళ్లలో ఈయన స్థానం సంపాదించాడు. ఆ తరువాత చాలా కాలం పాటు రాజశేఖర్ రెడ్డి కి ఎటువంటి ప్రభుత్వ పదవీ దక్కలేదు. 1989-94 మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించినా కూడా అవకాశం రాలేదు. 1999 లో మళ్ళీ శాసన సభకు ఎన్నికై ప్రతి పక్షనేతగా ఉంటూ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అనేక వ్యూహాలను రచించాడు. 2003 లో మండు వేసవిలో 1460 కిలో మీటర్లు పాదయాత్ర చేశాడు. ఈ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకి , వైయస్ రాజశేఖర్ రెడ్డి కి మంచి ఫాలోయింగ్ ను తీసుకువచ్చింది.

2004 ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుంచి 40 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందడంతో ముఖ్యమంత్రి పదవి కూడా వై.ఎస్.రాజశేఖరరెడ్డి కి దక్కింది. ఇక 2004 నుండి 2009 వరకు ముఖ్యమంత్రిగా ఈయన పాలన అద్భుతంగా ముందుకు సాగింది. ఇక 2009 ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి ఓ వైపు తెలుగు దేశం నుండి మరో వైపు చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీ నుండి గట్టి పోటీ వచ్చింది. ఇక అలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ రెండు బలమైన పార్టీలను తట్టుకునే నిలబడుతుందా అని చాలా మంది అనుకున్నారు.

ఇలా ప్రజలు అంతా అనుకుంటున్న సమయంలో షాకింగ్ రిజల్ట్ వచ్చింది. తెలుగుదేశం పార్టీ పరవాలేదు అనే స్థాయిలో మాత్రమే అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంటే , ప్రజా రాజ్యం పార్టీ అతి తక్కువ అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దానితో మళ్లీ కాంగ్రెస్ పెద్ద ఎత్తున అసెంబ్లీ స్థానాలను దక్కించుకొని 2009 వ సంవత్సరం కూడా అధికారంలోకి వచ్చింది. అలాగే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అలా ఎన్నో పార్టీలు కలిసి ఆయనను 2009 ఎన్నికలలో అడ్డుకోలేకపోయాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>