PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan46e236b3-19e9-4bc6-b141-3933f26cff11-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan46e236b3-19e9-4bc6-b141-3933f26cff11-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... ఇప్పుడు అందరూ వైఎస్ షర్మిల గురించి చర్చించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఓడిపోయింది. అటు కాంగ్రెస్ కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. దీంతో... ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి స్థానాన్ని భర్తీ చేసేందుకు షర్మిల... ప్లాన్ వేస్తున్నారట. ఇందులో భాగంగానే ఈనెల 8వ తేదీన వైయస్సార్ జయంతిని చాలా ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ వేస్తున్నారు. jagan{#}kadapa;Telugu Desam Party;Rajya Sabha;Jayanthi;Telangana Chief Minister;Congress;Sharmila;Party;Andhra Pradesh;Reddy;YCP;Jaganషర్మిలను లైట్ తీసుకుంటే..జగన్ కెరీర్ క్లోజ్ అవుతుందా?షర్మిలను లైట్ తీసుకుంటే..జగన్ కెరీర్ క్లోజ్ అవుతుందా?jagan{#}kadapa;Telugu Desam Party;Rajya Sabha;Jayanthi;Telangana Chief Minister;Congress;Sharmila;Party;Andhra Pradesh;Reddy;YCP;JaganSat, 06 Jul 2024 07:20:11 GMT
* షర్మిలను జగన్ లైట్ తీసుకోవడం రిస్క్
* జగన్ ప్రతి విజయం వెనుక షర్మిల
* జగన్ జైల్లో ఉన్నా కూడా వైసీపీని కాపాడిన షర్మిల
* షర్మిలకు రాజ్యసభ ఇచ్చుంటే..  జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వాడా ?


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... ఇప్పుడు అందరూ వైఎస్ షర్మిల గురించి చర్చించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఓడిపోయింది. అటు కాంగ్రెస్ కూడా అట్టర్ ఫ్లాప్ అయింది.  జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. దీంతో... ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి స్థానాన్ని భర్తీ చేసేందుకు షర్మిల... ప్లాన్ వేస్తున్నారట. ఇందులో భాగంగానే ఈనెల 8వ తేదీన వైయస్సార్ జయంతిని చాలా ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ వేస్తున్నారు.

 దీనికోసం పాత కాంగ్రెస్ నేతలందరినీ ఆహ్వానిస్తున్నారు షర్మిల. తెలంగాణ, ఏపీలో ఉన్న కీలక రాజకీయ నాయకులు అందరిని  ఈ కార్యక్రమానికి తీసుకువచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. వాస్తవానికి ఏపీలో వైయస్ షర్మిల పలుకుబడి చాలా బలంగానే ఉంటుంది. 2012 సంవత్సరం నుంచి... 2014 అలాగే 2019లో వైసీపీ పార్టీని వైఎస్ షర్మిలనే కాపాడారు.

 జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నా కూడా... రెండు భుజాలపై వైసీపీ జెండాను మోశారు. పార్టీ క్యాడర్ను అలాగే పార్టీని కాపాడారు. ఫలితంగా జగన్ మోహన్ రెడ్డి మొదటిసారిగా ముఖ్యమంత్రి కావడం జరిగింది. అయితే వీరిద్దరూ ప్రస్తుతం విడిపోవడంతో... జగన్మోహన్ రెడ్డి స్థానానికి ఎర్త్ పెట్టారట షర్మిల. జగన్ ఇప్పట్లో కోలుకోడని.. ఒకవేళ ఆయన కోలుకున్న కూడా జైలుకు వెళ్లడం గ్యారంటీ అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు.

 ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం కూటమికి... ప్రతిపక్ష నేత ఎవరనేది క్లారిటీ లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి స్థానాన్ని... వైయస్ షర్మిల భర్తీ చేసేందుకు ఇలా రంగం సిద్ధం చేస్తున్నారట. అయితే... ఇది పసిగట్టిన జగన్మోహన్ రెడ్డి... హుటా హుటిన కడప జిల్లాకు బయలుదేరుతున్నారు. వైయస్ షర్మిల టాపిక్... డైవర్ట్ చేసేందుకు...  ఆయన కూడా కడప జిల్లాలో వైయస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. అయితే.. షర్మిల విషయంలో జగన్మోహన్ రెడ్డి కాస్త లైట్ తీసుకున్న.. వైసిపి పార్టీకి పెను ప్రమాదం తప్పదని సూచనలు చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆమె విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని చెబుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>