PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagand2a41876-be8b-4fbf-a642-23ef713f2819-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagand2a41876-be8b-4fbf-a642-23ef713f2819-415x250-IndiaHerald.jpgతాజా ఎన్నికల్లో వైస్సార్సీపీ పార్టీ ఘోర ఓటమిని చవిచూసిన తరువాత ఇలాంటి డిబేట్స్ రావడం సర్వ సాధారణం అయిపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో వ్యాపారస్తుడు ఉన్నాడా? పాలకుడు ఉన్నాడా? అనే చర్చ ఇపుడు సర్వత్రా సాగుతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే లెక్కేలేదు. ఎన్నో రకాలుగా జగన్ జీవితం గురించి చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో ఎక్కువ ఆయనలో వ్యాపారస్తుడే ఉన్నారని అంటున్నారు. అదే టైంలో ఆయన్ను చాలా దగ్గర నుంచి చూసినోళ్లు మాత్రం ఆయనలో తెలివైన రాజకీయ నాయకుడు ఉన్నాడని వ్యాఖ్యానిస్తున్నారు. మరికొంతమంది మాత్రం జగన్ గురింjagan{#}Party;Jagan;CBNజగన్ వ్యాపారస్తుడా? రాజకీయ నేతా?జగన్ వ్యాపారస్తుడా? రాజకీయ నేతా?jagan{#}Party;Jagan;CBNSat, 06 Jul 2024 13:21:00 GMTతాజా ఎన్నికల్లో వైస్సార్సీపీ పార్టీ ఘోర ఓటమిని చవిచూసిన తరువాత ఇలాంటి డిబేట్స్ రావడం సర్వ సాధారణం అయిపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో వ్యాపారస్తుడు ఉన్నాడా? పాలకుడు ఉన్నాడా? అనే చర్చ ఇపుడు సర్వత్రా సాగుతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే లెక్కేలేదు. ఎన్నో రకాలుగా జగన్ జీవితం గురించి చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో ఎక్కువ ఆయనలో వ్యాపారస్తుడే ఉన్నారని అంటున్నారు. అదే టైంలో ఆయన్ను చాలా దగ్గర నుంచి చూసినోళ్లు మాత్రం ఆయనలో తెలివైన రాజకీయ నాయకుడు ఉన్నాడని వ్యాఖ్యానిస్తున్నారు. మరికొంతమంది మాత్రం జగన్ గురించి ఎక్కువగా తెలిసిన కంటే తెలియని వారే ఎక్కువని అంటున్నారు. అందుకే జగన్ గురించి ఉహించుకొని చెప్పడం ఒకింత కష్టమే అని చెబుతున్నారు.

ఇక చంద్రబాబుకు.. జగన్ కు ఉన్న పెద్ద తేడా గురించి చెప్పమంటే చంద్రబాబుకు ఉన్న రాజకీయ పరిణితి జగన్ కి లేదని అంటున్నారు. దాంతోనే తాజా ఎన్నికల్లో జగన్ ఘోర ఓటమిని చవిచూశారని చెబుతున్నారు. మరో విషయం ఏమిటంటే చంద్రబాబుతో తన అనునయలు ఎల్లప్పుడూ చుట్టూ ఉంటూ ఆయనకు అత్యంత సన్నిహితంగా తమ ప్రైవేటు సంభాషణల్లో ఆయన గురించి ఏదైనా సద్విమర్శ చేయడానికి పెద్దగా వెనుకాడరు. దీనికి కారణం.. తాము మాట జారినట్లు తెలిసినా.. బాబు క్షమించేస్తారు అన్న భావనే. అదే సమయంలో జగన్ విషయంలో మాత్రం ఆ ఆలోచనకే వణుకుతారు ఆయన సన్నిహితులు. ఎందుకుంటే.. తన గురించి చేసే అనవసర వ్యాఖ్యలకు వారు ఎలాంటి మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందో వారికి బాగా తెలుసు.

ఇపుడు ఇలాంటి అంశాలే ఆయనికి ఓ నాయకుడి లక్షణాలు ఉన్నాయి అనేకంటే ఒక వ్యాపారవేత్త లక్షణాలు ఉన్నాయని అని చెప్పడానికి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. నిజానికి ఇదే ఆయనకు ప్లస్ గా చెబుతారు. ఐతే తాజా ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయానికి మూలకారణం కూడా ఇదేనన్న విషయాన్ని ఇప్పుడు ఆయన సన్నిహితులే అంగీకరిస్తున్నారు. అవును, జగన్ మంచి వ్యాపారస్తుడు అనడానికి సరైన ఉదాహరణే అది. జగన్ విషయానికి వస్తే తన వ్యాపారాలను పెంచుకుంటూ పోవటం అనేది ఒక వ్యాపారవేత్తగా అదేమీ తప్పు కాదు కానీ ఓ ప్రజా నాయకుడిగా.. ఆయన చెప్పే సంక్షేమం తన సంస్థల్లో పని చేసే ఉద్యోగుల విషయంలో కనీస స్థాయిలో ప్రదర్శించకపోవటమే చిత్రమైన అంశం. ఇదే ఆయన పాలిట శాపంలా మారింది అని చెప్పక తప్పదు!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>