Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalkid7551e1f-8cb2-4dd4-9699-a2ee9ec8363d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalkid7551e1f-8cb2-4dd4-9699-a2ee9ec8363d-415x250-IndiaHerald.jpgకల్కి.. కల్కి.. కల్కి.. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఈ పేరు కాస్త గట్టిగానే వినిపిస్తుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్.. ప్రధాన పాత్రలో తెరకేక్కిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుంది. మొదటి రోజు నుంచి కూడా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న కల్కి మూవీ.. అటు థియేటర్ల వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ కూడా సినీ ప్రేక్షకులందరూ థియేటర్లకు తరలి వెళ్తున్నారు. ఆధ్యాత్మికతతో కూడిన కథKalki{#}Wanted;Tsunami;Darsakudu;Supreme;Blockbuster hit;Prabhas;vijay kumar naidu;nag ashwin;Director;Cinema;Indianఅసలు కథ సీక్వల్ లోనే.. ట్విస్ట్ ఇచ్చిన నాగీ?అసలు కథ సీక్వల్ లోనే.. ట్విస్ట్ ఇచ్చిన నాగీ?Kalki{#}Wanted;Tsunami;Darsakudu;Supreme;Blockbuster hit;Prabhas;vijay kumar naidu;nag ashwin;Director;Cinema;IndianSat, 06 Jul 2024 11:00:00 GMTకల్కి.. కల్కి.. కల్కి.. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఈ పేరు కాస్త గట్టిగానే వినిపిస్తుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్.. ప్రధాన పాత్రలో తెరకేక్కిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుంది. మొదటి రోజు నుంచి కూడా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న కల్కి మూవీ.. అటు థియేటర్ల వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ కూడా సినీ ప్రేక్షకులందరూ థియేటర్లకు తరలి వెళ్తున్నారు. ఆధ్యాత్మికతతో కూడిన కథకి సైన్స్ ఫిక్షన్ జోడించి ఫ్యూచర్స్టిక్ అనే కాన్సెప్ట్ తో నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించాడు.


 ఈ క్రమంలోనే నాగి కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు దీపికా పదుకొనే దిశా పటాన్ని లాంటి స్టార్ హీరోయిన్లు అమితాబచ్చన్, కమలహాసన్ లాంటి లెజెండరీ నటులు కూడా నటించారు. ఇక ఈ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉండగా ఇక సినిమా విడుదలైన తర్వాత అందరి అంచనాలు అందుకోవడం కాదు అంతకుమించి అనే రేంజ్ లోనే ప్రేక్షకులను మెప్పించగలిగింది ఈ మూవీ. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎన్నో రికార్డులను వసూళ్ల సునామీతో చెరిపేస్తూ వస్తుంది కల్కి మూవీ. ఈ సినిమాకు సీక్వల్ కూడా ఉండబోతుందని నాగ్ అశ్విన్ ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే.


 కాగా ఈ మూవీలో అశ్వద్ధామ, కర్ణుడు, సుప్రీమ్ యాస్కిన్ పాత్రలు ప్రశంసలు అందుకుంటున్నాయి అని చెప్పాలి. అయితే ఇందులో కొన్ని పాత్రలు కేవలం కొంతసేపు మాత్రమే ఉన్నాయి. ఇక రెండవ పార్ట్ లో మాత్రం సినిమా మొత్తం ఈ పాత్రలు చుట్టే తిరుగుతుంది అన్నది తెలుస్తోంది. అయితే ఈ పాత్రల అసలు కథంతా సీక్వెల్ లోనే ఉంటుందని దర్శకుడు నాగీ చెప్పుకొచ్చారు. అశ్వత్థామ, కర్ణుడు, సుప్రీమ్ యాస్కిన్ మధ్య శక్తివంతమైన ధనస్సు కీలకపాత్ర పోషించనుంది అంటూ చెప్పుకొచ్చాడు. సీక్వల్ కు సంబంధించి నెలరోజులు షూటింగ్ చేశాం.  ఎంతో బాగా వచ్చింది ఇంకా తీయాల్సి ఉంది. వీటికి సంబంధించిన సూపర్ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయి అంటూ నాగ్ అశ్విన్ చెప్పిన కామెంట్స్ పార్ట్ 2 పై అంచనాలను మరింత పెంచేశాయ్.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>