PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/shakuni-in-mahabharata-ys-see-what-happened-to-jagan-outfitc48c218e-7c9d-4c70-8d5d-42a0c6e353d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/shakuni-in-mahabharata-ys-see-what-happened-to-jagan-outfitc48c218e-7c9d-4c70-8d5d-42a0c6e353d6-415x250-IndiaHerald.jpgమహాభారతంలో కౌరవుల పక్కన ఉంటూ కౌరవుల పతనానికి శకుని ఎలా ? కారణం అయ్యాడు. ఇప్పుడు వైసీపీతో పాటు వైసీపీ అధినేత జగన్ వెనక ఉంటూ అటు పార్టీ.. ఇటు జగన్ ఇద్దరి పతనానికి సజ్జల రామకృష్ణారెడ్డి అంతే కారణం అవుతున్నారా ? అంటే వైసీపీ వాళ్ళే అవునని చెబుతున్న పరిస్థితి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతి విషయానికి సజ్జలను ముందు పెట్టి పాలన సాగించటంపై అటు పార్టీ నేతల్లోనే కాదు ప్రజల్లో సైతం తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ విషయాన్ని వైసీపీ నాయకులు పదేపదే గుర్తు చేస్తున్నారు. ఎన్నికల తర్వాత కూడా ఇదే విషయం ప్రధానంAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jagan; ycp; ys jagan; Mahabharata; Shakuni {#}Research and Analysis Wing;CM;MP;Andhra Pradesh;YCP;Jagan;Partyమ‌హాభార‌తంలో శ‌కుని... వైఎస్‌. జ‌గ‌న్‌కు స‌జ్జ‌ల .. ఏం జ‌రిగిందో చూడండి..?మ‌హాభార‌తంలో శ‌కుని... వైఎస్‌. జ‌గ‌న్‌కు స‌జ్జ‌ల .. ఏం జ‌రిగిందో చూడండి..?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jagan; ycp; ys jagan; Mahabharata; Shakuni {#}Research and Analysis Wing;CM;MP;Andhra Pradesh;YCP;Jagan;PartySat, 06 Jul 2024 09:24:42 GMTమహాభారతంలో కౌరవుల పక్కన ఉంటూ కౌరవుల పతనానికి శకుని ఎలా ? కారణం అయ్యాడు. ఇప్పుడు వైసీపీతో పాటు వైసీపీ అధినేత జగన్ వెనక ఉంటూ అటు పార్టీ.. ఇటు జగన్ ఇద్దరి పతనానికి సజ్జల రామకృష్ణారెడ్డి అంతే కారణం అవుతున్నారా ? అంటే వైసీపీ వాళ్ళే అవునని చెబుతున్న పరిస్థితి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతి విషయానికి సజ్జలను ముందు పెట్టి పాలన సాగించటంపై అటు పార్టీ నేతల్లోనే కాదు ప్రజల్లో సైతం తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ విషయాన్ని వైసీపీ నాయకులు పదేపదే గుర్తు చేస్తున్నారు.


ఎన్నికల తర్వాత కూడా ఇదే విషయం ప్రధానంగా ప్రస్తావనకు వస్తోంది. తాము జగనన్న సీఎం గా గెలిపిస్తే ఆయనకు బదులుగా సజ్జలపాలించడం ఏంటి రా బాబు ? అని వైసీపీ నాయకులు తో పాటు ఆంధ్రప్రదేశ్ జనాలు కూడా త‌లలు పట్టుకున్నారు. అసలు సజ్జన వల్లే ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చిందన్న వాస్తవాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. తాజాగా పార్టీ ఓడిపోయాక కూడా జగన్ తీరులో మార్పు వచ్చినట్టు లేదు. మళ్లీ సజ్జలనే ముందు పెట్టుకుని రాజకీయం చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది.


స‌జ్జ‌ల వ‌ద్దు బాబోయ్ అని చెబుతున్న జగన్ వినిపించుకునే పరిస్థితి లేదు. తాజాగా వైసీపీ జిల్లా అధ్యక్షులు .. ఎమ్మెల్యేలు .. ఓడిపోయిన నేతలు .. ఎంపీ లతో సజ్జల‌ రామకృష్ణారెడ్డి టెలీ కాన్ఫ‌రెన్స్ లో పాల్గొంటారని సందేశం ఆ పార్టీ నేతలకు వెళ్ళింది. దీంతో వైసీపీ నేతలు ఒక్కసారిగా నిరుత్సాహపడ్డారు. ఎప్పటికైనా సజ్జలను దూరం పెట్టాలని ఎంతగా మొత్తుకున్నా జగన్ పట్టించుకోరా అని మండిపడుతున్నారు. జగన్ పేరులో మార్పు రాకపోతే మహాభారత యుద్ధంలో శకుని కౌరవులను ఎలా ? నమ్మి ముంచేసాడో .. ఇప్పుడు జగన్‌కు మరొకసారి కూడా అదే గతి పడుతుందని చెబుతున్నారు. మరి జగన్ తన తీరు ఎప్పటికీ మార్చుకుంటారో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>