PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rayalasima-pulivendula-ycp-tdpdce2c6a1-f027-4d1c-b235-b79cb85e3f9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rayalasima-pulivendula-ycp-tdpdce2c6a1-f027-4d1c-b235-b79cb85e3f9f-415x250-IndiaHerald.jpgమాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గం లో ఇప్పుడు జరిగిన సంఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.పులివెందులలో టిడిపి ఇన్చార్జిగా ఉన్న బీటెక్ రవి అనుచరులు దాస్టికం పెరిగిపోయింది. వేంపల్లి లో వైసీపీ కార్యకర్తగా ఉన్న అజయ్ కుమార్ రెడ్డి పైన టిడిపి అనుచరులు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఒంటరిగా ఉన్న అతని పైన విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఇప్పుడు పులివెందులలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతోంది. ఎన్నికల రోజున వేRAYALASIMA;PULIVENDULA;YCP;TDP{#}ajay;Vempalli;V;Kumaar;TDP;Government;Pulivendula;YCP;Reddy;Telangana Chief Minister;CM;Jagan;Ishtam;ravi anchorఏపీ: పులివెందులలో బీటెక్ రవి అనుచరుల రచ్చ..!ఏపీ: పులివెందులలో బీటెక్ రవి అనుచరుల రచ్చ..!RAYALASIMA;PULIVENDULA;YCP;TDP{#}ajay;Vempalli;V;Kumaar;TDP;Government;Pulivendula;YCP;Reddy;Telangana Chief Minister;CM;Jagan;Ishtam;ravi anchorSat, 06 Jul 2024 14:33:00 GMTమాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గం లో ఇప్పుడు జరిగిన సంఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.పులివెందులలో టిడిపి ఇన్చార్జిగా ఉన్న బీటెక్ రవి అనుచరులు దాస్టికం పెరిగిపోయింది. వేంపల్లి లో వైసీపీ కార్యకర్తగా ఉన్న అజయ్ కుమార్ రెడ్డి పైన టిడిపి అనుచరులు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఒంటరిగా ఉన్న అతని పైన విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఇప్పుడు పులివెందులలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతోంది.


ఎన్నికల రోజున వేంపల్లి లో బీటెక్ రవి చిన్నాన్న తో పాటు కొంత మంది దౌర్జన్యానికి దిగడంతో.. వైసిపి నాయకుడు మాజీ మండల్ డిప్యూటీ చైర్మన్ ఎస్ వి సతీష్ కుమార్ రెడ్డి తో పాటు పలువురు నేతలు అడ్డుకోవడం జరిగింది. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న బీటెక్ రవి చిన్నాన్న మరి కొంత మంది అనుచరులతో సైతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అజయ్ పైన దాడి చేస్తున్నట్లు తెలుస్తోంది.


స్థానికులైన వేంపల్లి టిడిపి కార్యకర్తలను సైతం అజయ్ పైన దాడికి బీటెక్ రవి చిన్నాన్న ఇతర అనుచరులను ఉసగొలిపినట్లు తెలుస్తోంది. అయితే వారు ముందుగా దాడికి వెనుకడుగు వేసినప్పటికీ ఆ తర్వాత వేంపల్లికి వెళ్లి మరి అజయ్ పైన ఇష్టం వచ్చినట్లుగా దాడి చేసినట్లు సమాచారం.దారిన వెళ్లే వారెవరు ఈ ఘటనను మొబైల్లో రికార్డు చేసినట్లుగా సమాచారం. దాడిలో గాయపడిన అజయ్ ని వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించినట్లుగా తెలుస్తోంది. కార్యకర్తలకు ధైర్యం చెబుతూ అన్యాయంగా ఇలాంటి పని చేస్తున్న వారందరినీ కూడా మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించడం జరిగింది. ప్రస్తుతం అయితే బీటెక్ రవి అనుచరుల ఆగడాలు పులివెందులలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>