MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mega-star-chiranjeevi-will-sacrifice-for-ram-charan-65e66d55-2bf6-4158-8d4c-4716995676e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mega-star-chiranjeevi-will-sacrifice-for-ram-charan-65e66d55-2bf6-4158-8d4c-4716995676e9-415x250-IndiaHerald.jpgభారతదేశ చిత్ర పరిశ్రమలో ఒక స్టార్ హీరో కొడుకు మరో స్టార్ హీరో అయ్యాడు అంటే అది ఒక్క మెగా ఫ్యామిలీకి సాధ్యపడింది. అవును, మరెవ్వరికీ సాధ్యపడని ఫీట్ అది. బాలీవుడ్ నుంచి మల్లు వుడ్ వరకు ఎవరికి ఇది సాధ్యపడలేదు అని చెప్పుకోవాలి. అవును... మెగాస్టార్ చిరంజీవి చరిస్మాను తనయుడు రామ్ చరణ్ ముందుకు తీసుకెళ్తున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే మెగాస్టార్ కి దీటైన పోటీ ఇచ్చిన హీరో తన కుటుంబంలోనే జన్మించాడు. అయితే ఇది అతనికి ఒక్కరోజులో సాధ్యపడలేదు. ఎన్నో అవమానాలు భరించాడు. ఈ Ram Charan {#}Mahanati;Pathala Bhairavi;Ram Charan Teja;bollywood;vyjayanthi;Darsakudu;Director;Telugu;nag ashwin;vijay kumar naidu;Hero;Chiranjeevi;Cinemaమెగా పవర్ స్టార్ కోసం మెగాస్టార్ త్యాగం చేసారా?మెగా పవర్ స్టార్ కోసం మెగాస్టార్ త్యాగం చేసారా?Ram Charan {#}Mahanati;Pathala Bhairavi;Ram Charan Teja;bollywood;vyjayanthi;Darsakudu;Director;Telugu;nag ashwin;vijay kumar naidu;Hero;Chiranjeevi;CinemaSat, 06 Jul 2024 16:52:00 GMTభారతదేశ చిత్ర పరిశ్రమలో ఒక స్టార్ హీరో కొడుకు మరో స్టార్ హీరో అయ్యాడు అంటే అది ఒక్క మెగా ఫ్యామిలీకి సాధ్యపడింది. అవును, మరెవ్వరికీ సాధ్యపడని ఫీట్ అది. బాలీవుడ్ నుంచి మల్లు వుడ్ వరకు ఎవరికి ఇది సాధ్యపడలేదు అని చెప్పుకోవాలి. అవును... మెగాస్టార్ చిరంజీవి చరిస్మాను తనయుడు రామ్ చరణ్ ముందుకు తీసుకెళ్తున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే మెగాస్టార్ కి దీటైన పోటీ ఇచ్చిన హీరో తన కుటుంబంలోనే జన్మించాడు. అయితే ఇది అతనికి ఒక్కరోజులో సాధ్యపడలేదు. ఎన్నో అవమానాలు భరించాడు. ఈ క్రమంలో చెక్కిన శిల్పంలా తయారయ్యాడు. కాబట్టే రామ్ చరణ్ ఇప్పుడు మెగా అభిమానుల పాలిట వరమయ్యాడు.

అలాంటి మెగాస్టార్ కుటుంబం అంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒకంత మక్కువ ఎక్కువ. ఇక అసలు విషయంలోకి వెళ్తే సినిమాల విషయంలో మెగాస్టార్ ఎంత పర్టిక్యులర్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఒక సినిమాని జడ్జ్ చేసే విషయంలో మెగాస్టార్ చిరంజీవి చాలా పక్కాగా ఉంటారు. అందుకే ఇతర హీరోల సినిమా కథలో కూడా ఆయన జడ్జిమెంట్ తప్పకుండా ఉంటుందని చెబుతూ ఉంటారు. అలాంటిది కన్న కొడుకు విషయంలో మన మెగాస్టార్ ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అర్థం చేసుకోవచ్చు. ఇక విషయంలోకి వెళ్తే ఇప్పుడు ఎక్కడ విన్నా దర్శకుడు నాగ అశ్విన్ పేరే వినబడుతుంది. ఇది మహానటి సినిమా చేస్తున్నప్పటి మాట. ఆ సమయంలో చిరంజీవి ఆ సినిమాని ప్రమోట్ చేస్తూ రాబోయే రోజుల్లో నాగ్ అశ్విన్ తో పాతాళభైరవి అనే సినిమాను చేయాలని ఉంది అంటూ తన మనసులోని కోరికను చిరంజీవి చెప్పగా... దానికి మన కల్కి దర్శకుడు... అంతకంటే మరే భాగ్యము నాకు లేదు అన్నట్టు రియాక్ట్ కావడం అందరికీ తెలిసిందే.

అయితే ఇప్పుడు ఆ కథను మెగాస్టార్ తో కాకుండా తనయుడు రామ్ చరణ్ తో వైజయంతి మూవీస్ వారు తెరకెక్కించనున్నారని గుసగుసలు వినబడుతున్నాయి. చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి ఈ సమయంలో అలాంటి కథలో తనయుడు నటిస్తేనే బాగుంటుందని ఫీల్ అయ్యారట. ఇక దానికి దర్శకుడు ఓకే చెప్పడం... కథను రెడీ చేయడం జరిగిపోయాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమా గురించి అధికారికంగా ఓ ప్రకటన రావలసి ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>