MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/kalki-2898-ad0841899b-4f59-40a0-9564-7d7f115dfdd0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/kalki-2898-ad0841899b-4f59-40a0-9564-7d7f115dfdd0-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని తొక్కుకుంటూ పోతున్న కల్కి?రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి మూవీ జూన్ 27 వ తేదీన విడుదలై ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా అదిరిపోయే రీతిలోనే లభిస్తోన్నాయి. ఇలా ఇప్పటి వరకూ మొత్తం రూ. 371 కోట్ల షేర్, 742 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. ఇక అమెరికాలో కల్కి రిలీజ్ ముందు నుంచే Kalki 2898 AD{#}Fidaa;bollywood;Amitabh Bachchan;Varsham;producer;Producer;Blockbuster hit;vyjayanthi;Prabhas;India;nag ashwin;vijay kumar naidu;Box office;Cinemaబాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని తొక్కుకుంటూ పోతున్న కల్కి?బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని తొక్కుకుంటూ పోతున్న కల్కి?Kalki 2898 AD{#}Fidaa;bollywood;Amitabh Bachchan;Varsham;producer;Producer;Blockbuster hit;vyjayanthi;Prabhas;India;nag ashwin;vijay kumar naidu;Box office;CinemaSat, 06 Jul 2024 11:08:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి మూవీ జూన్ 27 వ తేదీన విడుదలై ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా అదిరిపోయే రీతిలోనే లభిస్తోన్నాయి. ఇలా ఇప్పటి వరకూ మొత్తం రూ. 371 కోట్ల షేర్, 742 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. ఇక అమెరికాలో కల్కి రిలీజ్ ముందు నుంచే సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది.ఇప్పటి వరకు కల్కి సినిమా అమెరికాలో ఏకంగా 14.6 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది.  అంటే దాదాపు మన లెక్కల్లో 116 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్‌లో అయితే ఫస్ట్ నుంచి కూడా దుమ్ము దులిపేసింది. అక్కడ అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ కి పిచ్చ ఫిదా అవుతున్నారు. అందుకే బాలీవుడ్ లో ఇప్పటిదాకా ఏకంగా రూ.165 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా .


ఇప్పుడు కల్కి ఈ వసూళ్లతో ఈ సినిమా క్లీన్ హిట్ అయ్యి లాభాల్లోకి వచ్చేసింది.  'కల్కి 2898 ఏడీ' సినిమాకి నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 76 కోట్లతో కలిపి తెలుగులో రూ. 168 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 25 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లతో కలిపి మొత్తం రూ. 370 కోట్లు బిజినెస్ జరిగింది.చాలా వేగంగా ఈ సినిమా 1000 కోట్ల వైపు దూసుకుపోతుంది.600 కోట్ల భారీ బడ్జెట్ తో కల్కి 2898 ఏడి సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్విని దత్ నిర్మించాడు.ఈ సినిమా రెండో భాగం కూడా రూపొందుతోందని, అందులో 60 శాతం పూర్తయిందన్న వార్త కూడా వినిపిస్తోంది. రెండో భాగంలో కొన్ని ముఖ్యమైన సీన్లను మాత్రం ఇంకా పూర్తిచేయాల్సి ఉందంటున్నారు. చాలా వరకు పూర్తయిపోయందనే అంటున్నారు.కల్కి పార్ట్ 2 ఇంకా చాలా ఆసక్తికరంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>