PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-fansc4b238a9-74ac-4faf-a507-171cbec2e8e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-fansc4b238a9-74ac-4faf-a507-171cbec2e8e7-415x250-IndiaHerald.jpgగత కొద్దిరోజులుగా మేం పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ ఇటీవల కాలంలో చాలామంది జనసేన కార్యకర్తలు సైతం బైకుల పైన స్టిక్కర్లు అతికించుకుంటూ ఉన్నారు. ఎన్నికల ముందు నుంచి ఇలాంటి హడావిడి ఎక్కువగా కనిపించింది. పిఠాపురంలో మరింత ఎక్కువగా కనిపించడమే కాకుండా ఏపీలో చాలా చోట్ల ఈ స్టిక్కర్లు సైతం ఎక్కువగా కనిపిస్తూ ఉండడంతో పోలీసులు సైతం ఏపీ ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ పైన అభిమానాన్ని ఎవరు కాదనరు కానీ అది శృతిమించి నిబంధనలకు అడ్డుపడుతోందని పోలీసులు తెలియజేస్తున్నారు. పిఠాపురం ఎమ్మెల్యJANASENA;FANS{#}pithapuram;Traffic police;MLA;Janasena;police;Andhra Pradesh;kalyan;Yevaruఏపీ: పోలీసులపై జనసేన ఫ్యాన్స్ ఫైర్.. ఏం జరిగిందంటే..?ఏపీ: పోలీసులపై జనసేన ఫ్యాన్స్ ఫైర్.. ఏం జరిగిందంటే..?JANASENA;FANS{#}pithapuram;Traffic police;MLA;Janasena;police;Andhra Pradesh;kalyan;YevaruSat, 06 Jul 2024 10:49:40 GMTగత కొద్దిరోజులుగా మేం పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ ఇటీవల కాలంలో చాలామంది జనసేన కార్యకర్తలు సైతం బైకుల పైన స్టిక్కర్లు అతికించుకుంటూ ఉన్నారు. ఎన్నికల ముందు నుంచి ఇలాంటి హడావిడి ఎక్కువగా కనిపించింది. పిఠాపురంలో మరింత ఎక్కువగా కనిపించడమే కాకుండా ఏపీలో చాలా చోట్ల ఈ స్టిక్కర్లు సైతం ఎక్కువగా కనిపిస్తూ ఉండడంతో పోలీసులు సైతం ఏపీ ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ పైన అభిమానాన్ని ఎవరు కాదనరు కానీ అది శృతిమించి నిబంధనలకు అడ్డుపడుతోందని పోలీసులు తెలియజేస్తున్నారు.
పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ స్కూటీ పైన అంటించిన స్టిక్కర్ సైతం పోలీసుల కంటపడడంతో యువకులను ఆపి మరి ఆ స్టిక్కర్ ను తీయించారు. ఎవరయ్యా మీలో ఎమ్మెల్యే గారి తాలూకా అని అడిగినట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఆ సమయంలో ఆ యువకులు సైతం సైలెంట్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే సదర్ స్టిక్కర్ ని నెంబర్ ప్లేట్ స్థానంలో అతికించడం నెంబర్ ప్లేట్ కనపడకుండానే ఈ స్టిక్కర్ ఉండడంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని ఆపి మరి స్టిక్కర్ అంటించుకోవడం నిబంధనలకు విరుద్ధమంటూ తెలియజేశారు.
మీకు అభిమానం ఉంటే ఎవరైనా కాదన్నారు బండి పైన ఇంకెక్కడైనా స్టిక్కర్ వేయించుకోవాలని నెంబర్ ప్లేట్ మీద మాత్రం వదిలేయండి అంటూ తెలియజేశారు. ఒకవేళ ఏదైనా దొంగతనం జరిగినప్పుడు లేదా ఇంకా ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించడానికి సులువుగా ఉంటుంది అంటూ పోలీసులు తెలియజేశారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని కూడా తెలిపారు.. స్టిక్కర్ని తొలగింపు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు అభిమానులు కాసింత అసహనాన్ని తెలియజేస్తున్నారు. కొంతమంది పోలీసుల చర్యను వ్యతిరేకించగా మరి కొంతమంది పోలీసులు చేస్తున్నది సరైన పద్ధతి అంటూ తెలియజేస్తున్నారు.
సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.