PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/will-jagan-move-back-to-lotus-ponda623c3f4-8613-4277-8d5f-d575e689b236-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/will-jagan-move-back-to-lotus-ponda623c3f4-8613-4277-8d5f-d575e689b236-415x250-IndiaHerald.jpg2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడానికి జగన్ కుటుంబ సభ్యులే కారణమని చాలామంది భావిస్తారు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ సునీత జగన్ కు అండగా నిలబడటంతో పాటు వైసీపీ తరపున ప్రచారం చేసి ఆ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఐదేళ్లలోనే పరిస్థితులు పూర్తిస్థాయిలో మారిపోయాయి. jagan{#}Party;Hanu Raghavapudi;YCP;Jaganజగన్ బలం బలహీనత కుటుంబ సభ్యులే.. ఇప్పట్లో కోలుకోలేని చావుదెబ్బ కొట్టారుగా!జగన్ బలం బలహీనత కుటుంబ సభ్యులే.. ఇప్పట్లో కోలుకోలేని చావుదెబ్బ కొట్టారుగా!jagan{#}Party;Hanu Raghavapudi;YCP;JaganSat, 06 Jul 2024 07:10:00 GMT2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడానికి జగన్ కుటుంబ సభ్యులే కారణమని చాలామంది భావిస్తారు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ సునీత జగన్ కు అండగా నిలబడటంతో పాటు వైసీపీ తరపున ప్రచారం చేసి ఆ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఐదేళ్లలోనే పరిస్థితులు పూర్తిస్థాయిలో మారిపోయాయి.
 
జగన్ కుటుంబ సభ్యులంతా జగన్ కు వ్యతిరేకంగా పని చేయడంతో ఎన్నికల ఫలితాలు పూర్తిస్థాయిలో వ్యతిరేకంగా వచ్చాయి. 2024 ఎన్నికల ఫలితాలతో జగన్ తీవ్ర నిరాశకు గురయ్యారు. తమ పార్టీకి ఇంత దారుణమైన ఫలితాలు వస్తాయని అస్సలు ఊహించలేదని వైసీపీ నేతలే అభిప్రాయపడుతున్నారు. జగన్ సైతం కుటుంబ సభ్యుల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభించకపోయినా ఎన్నికల ముందు పెద్దగా పట్టించుకోలేదు.
 
ఇప్పుడు జగన్ కుటుంబ సభ్యులను కలుపుకొని ముందుకు వెళ్లినా పెద్దగా ఫలితం ఉండదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఐదేళ్ల తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చెప్పలేము. కూటమి నేతలు మాత్రం తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. పదేళ్ల పాటు తమ పార్టీనే అధికారంలో ఉండేలా కూటమి నేతల తీరు ఉంది. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే దిశగా కూటమి నేతల అడుగులు పడుతున్నాయి.
 
2029 ఎన్నికల్లో జగన్ సీఎం కావడం సులువు అయితే కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లడం మాత్రమే జగన్ ముందున్న ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ శ్రేణులు పూర్తిస్థాయిలో డీలా పడ్డాయి. వైసీపీకి అనుకూలంగా మాట్లాడితే ఏం జరుగుతుందో అనే టెన్షన్ సైతం ఆ పార్టీ నేతల్లో ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో జగన్ మళ్లీ పాదయాత్ర చేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
 
 









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>