MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aswini-dat4181d9cb-8fd3-4341-b87c-5683a2db2958-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aswini-dat4181d9cb-8fd3-4341-b87c-5683a2db2958-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి కాంబినేషన్లో చిరంజీవి , అశ్విని దత్ కాంబినేషన్ ఒకటి. వీరి కాంబోలో మొదటగా జగదేక వీరుడు అతిలోక సుందరి అనే మూవీ వచ్చింది. ఈ మూవీ అప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో ఏ మూవీ కూడా కలెక్ట్ చేయని కలెక్షన్లను వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఈ మూవీ తోనే చిరు , అశ్విని దత్ కాంబోకి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో చూడాలని ఉంది అనే మూవీ రూపొందింది. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత చిరంజీవి హీరోగా అశ్వినీ దత్ నిర్మాణంలో బి.గaswini dat{#}aswini;indra;vijay bhaskar;Jagadeka Veerudu Athiloka Sundari;Aswani Dutt;raj;Chiranjeevi;Mass;Industry;Tollywood;Telugu;Cinemaచిరంజీవికి ఆ స్టోరీ నచ్చలేదు.. అందుకే దాన్ని ఆపేసాం... అశ్విని దత్..!చిరంజీవికి ఆ స్టోరీ నచ్చలేదు.. అందుకే దాన్ని ఆపేసాం... అశ్విని దత్..!aswini dat{#}aswini;indra;vijay bhaskar;Jagadeka Veerudu Athiloka Sundari;Aswani Dutt;raj;Chiranjeevi;Mass;Industry;Tollywood;Telugu;CinemaFri, 05 Jul 2024 09:45:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి కాంబినేషన్లో చిరంజీవి , అశ్విని దత్ కాంబినేషన్ ఒకటి. వీరి కాంబోలో మొదటగా జగదేక వీరుడు అతిలోక సుందరి అనే మూవీ వచ్చింది. ఈ మూవీ అప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో ఏ మూవీ కూడా కలెక్ట్ చేయని కలెక్షన్లను వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఈ మూవీ తోనే చిరు , అశ్విని దత్ కాంబోకి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో చూడాలని ఉంది అనే మూవీ రూపొందింది. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

మూవీ తర్వాత చిరంజీవి హీరోగా అశ్వినీ దత్ నిర్మాణంలో బి.గోపాల్ దర్శకత్వంలో ఇంద్ర అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందింది. ఈ సినిమా కూడా అప్పటి వరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని కలెక్షన్లను రాబట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలా విరి కాంబోలో రూపొందిన మూడు సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలు అయిన తర్వాత చిరు హీరోగా అశ్విని డేట్ నిర్మాణంలో విజయ్ భాస్కర్ దర్శకత్వంలో జై చిరంజీవ అనే మూవీ రూపొందింది.

కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను డిసప్పాయింట్ చేసింది. ఈ మూవీ తర్వాత వీరిద్దరి కాంబోలో ఇప్పటివరకు సినిమా రాలేదు. ఇక తాజా ఇంటర్వ్యూలో భాగంగా అశ్విని దత్ మాట్లాడుతూ ... జై చిరంజీవ సినిమా తర్వాత చిరుతో మా బ్యానర్ నుండి సినిమా రాలేదు. కానీ రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ది ఫ్యామిలీ మెన్ అనే వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథను మొదటగా చిరంజీవికి వినిపించాం. ఆ స్టోరీ నచ్చితే చిరంజీవితో దానిని సినిమాల రూపొందించాలి అనుకున్నాం. కానీ ఆ కథ చిరంజీవికి పెద్దగా నచ్చలేదు. అందుకే ఆ సినిమా వర్కౌట్ కాలేదు అని అశ్విని తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>