PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/lokesh-tdp-nellore-kakani-govardhan-reddy-yuvagalam-lokesh-red-book7fe7d12d-688d-4712-a234-aa1759109be5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/lokesh-tdp-nellore-kakani-govardhan-reddy-yuvagalam-lokesh-red-book7fe7d12d-688d-4712-a234-aa1759109be5-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇదే తరుణంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే పాలన కూడా మొదలై 20 రోజులు గడిచింది. ఈ సందర్భంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన ఉన్నప్పుడు కొంతమంది నాయకులు కనీసం టిడిపి నాయకులను బయట తిరగనివ్వలేదు. కొంతమంది అధికారులు మాత్రం చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా పని చేశారు. అలాంటి వారందరినీ లోకేష్ గుర్తుపెట్టుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఆయన తLOKESH;TDP;NELLORE;KAKANI GOVARDHAN REDDY;YUVAGALAM;LOKESH RED BOOK{#}Y. S. Rajasekhara Reddy;KAKANI GOVARDHAN REDDY;Congress;Nellore;Government;District;CBN;Lokesh;Lokesh Kanagaraj;TDP;Reddy;Andhra Pradesh;Party;Red;YCP'కాకాణి'కి దడ పుట్టిస్తున్న లోకేష్ రెడ్ బుక్..!'కాకాణి'కి దడ పుట్టిస్తున్న లోకేష్ రెడ్ బుక్..!LOKESH;TDP;NELLORE;KAKANI GOVARDHAN REDDY;YUVAGALAM;LOKESH RED BOOK{#}Y. S. Rajasekhara Reddy;KAKANI GOVARDHAN REDDY;Congress;Nellore;Government;District;CBN;Lokesh;Lokesh Kanagaraj;TDP;Reddy;Andhra Pradesh;Party;Red;YCPFri, 05 Jul 2024 07:11:00 GMT- ఎర్రబుక్ లో రాసుకున్న ఎవరిని వదలను..
- కాకాణి గోవర్ధన్ కు ఎలాంటి శిక్ష వేయబోతున్నారు..
- ఆసక్తికరంగా మారిన రెడ్ బుక్..

 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇదే తరుణంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే పాలన కూడా మొదలై 20 రోజులు గడిచింది. ఈ సందర్భంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన ఉన్నప్పుడు  కొంతమంది నాయకులు కనీసం టిడిపి నాయకులను బయట తిరగనివ్వలేదు. కొంతమంది అధికారులు మాత్రం చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా పని చేశారు. అలాంటి వారందరినీ లోకేష్ గుర్తుపెట్టుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఆయన తన యువగళం పాదయాత్ర సమయంలో ఎవరెవరు అడ్డుపడ్డారు. ఎవరెవరు ఏం మాట్లాడారు అనేదానిపై ఒక బుక్ మెయింటైన్ చేశారు. అదే రెడ్ బుక్..  ఆ సమయంలో రూల్స్ కు విరుద్ధంగా లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడం, ఆయనను అడుగడుగునా ఇబ్బందులు పెట్టడం వంటివి చేసినటువంటి అధికారుల పేర్లు మరియు నాయకుల పేర్లను ఆ రెడ్ బుక్ లో నమోదు చేసుకున్నారు. మేం అధికారంలోకి వచ్చాక మళ్ళీ మా రెడ్ బుక్ తెరుస్తామని ఆ సమయంలోనే చెప్పారు. ఆయన అప్పుడు ఏదైతే చెప్పారో, ఇప్పుడు అదే పనిని మొదలు పెట్టారని తెలుస్తోంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా..

 రెడ్ బుక్ హడల్ :
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి పగ ప్రతికారాలకు తావు లేకుండా పాలన అందిస్తామని చెబుతూనే మరోసారి రెడ్ బుక్ బయటకు తీశారు లోకేష్. అంతేకాదు తప్పు చేసిన వారు తప్పకుండా శిక్ష అనుభవించాలి అని అంటున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టిన అధికారులు మరియు నాయకుల పేర్లను ఆయన యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడే నమోదు చేసుకొని పెట్టుకున్నారు. ఆయన ప్రతి సభలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ లో రాసుకున్న ఏ ఒక్క వ్యక్తిని కూడా వదలను అని చెప్పారు. చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి అధికారిని శిక్షిస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అలాంటి రెడ్ బుక్ లో కేవలం అధికారులే కాకుండా, కొంతమంది వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.  అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరు కూడా ఉంది. అయితే గోవర్ధన్ రెడ్డి యువగళం పాదయాత్ర సమయంలో లోకేష్ ను విపరీతంగా ఇబ్బందులు పెట్టారు. పోలీసులను అడ్డుపెట్టుకొని పాదయాత్రను ఆపే ప్రయత్నం కూడా చేశారు.   టిడిపి కార్యకర్తలను, నాయకులను పోలీసుల ద్వారా అరెస్టులు చేయించి భయపెట్టారు.


అంతేకాకుండా  లోకేష్ యువగళం పాదయాత్ర గురించి చులకన చేసి మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్ర జరిగే సమయంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆ పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవ చేశారు. జిల్లా మొత్తం 24 లక్షల మంది ఉంటే అందులో కనీసం 24 వేల మంది కూడా పాదయాత్రకు రాలేదని అన్నారు. లోకేష్ యాత్ర, పాదయాత్రలా లేదని, వాకింగ్ చేస్తున్నట్లు ఉందని కామెంట్లు చేశారు. అంతేకాదు లొకేష్ గురించి చాలా చీప్ గా మాట్లాడుతూ, ఆ రెడ్ బుక్ గురించి కూడా హేళన చేశాడు. ఇదే సమయంలో లోకేష్ కాకాణికి కౌంటర్ ఇస్తూ  తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టను అందరి పేర్లు ఎర్రబుక్కులో రాసుకుంటున్నానని, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తప్పక శిక్షిస్తానని అన్నారు. ప్రస్తుతం లోకేష్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టారు. రెడ్ బుక్ తెరిచి కాకాణి గోవర్ధన్ రెడ్డి భరతం పడతారా.. ఆయనను ఏ విధంగా శిక్షించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>