MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalki-part2-eee9fc44-e2fd-4f0a-b66d-38a9f558b017-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalki-part2-eee9fc44-e2fd-4f0a-b66d-38a9f558b017-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898ఏడీ ఏ రేంజ్ సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. విడుదలైన నాటినుండి ఇప్పటి వరకు థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ క్రమంలో కలెక్షన్ల పరంగా దుమ్ము దులుపుతోంది. ఆరు రోజుల్లో 700 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. దర్శకుడు ఈ సినిమాని ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా తెరకెక్కించడంతో ఈ చిత్రాన్ని చూసినవారు అద్భుతం అంటూ కొనియాడుతున్నారు. Kalki Part2{#}nag ashwin;Tollywood;vijay kumar naidu;Success;Cinema;Darsakudu;Director;Indian;Audience;Amitabh Bachchan;war;Mahabharatham;kushi;Episodeకల్కి పార్ట్-2 కథే అసలైనది.. నాగ్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు?కల్కి పార్ట్-2 కథే అసలైనది.. నాగ్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు?Kalki Part2{#}nag ashwin;Tollywood;vijay kumar naidu;Success;Cinema;Darsakudu;Director;Indian;Audience;Amitabh Bachchan;war;Mahabharatham;kushi;EpisodeFri, 05 Jul 2024 13:14:00 GMTటాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898ఏడీ ఏ రేంజ్ సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. విడుదలైన నాటినుండి ఇప్పటి వరకు థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ క్రమంలో కలెక్షన్ల పరంగా దుమ్ము దులుపుతోంది. ఆరు రోజుల్లో 700 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. దర్శకుడు ఈ సినిమాని ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా తెరకెక్కించడంతో ఈ చిత్రాన్ని చూసినవారు అద్భుతం అంటూ కొనియాడుతున్నారు.

అవును, నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై ఓ నూతన ప్రపంచాన్నే ఆవిష్కరించి అందరిని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకొని పోయాడు. దీంతో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికి కల్కి మూవీ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో ఇండియన్ బాక్సాఫీస్ పై ఇదే భారీ కలెక్షన్స్ చిత్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇక అసలు విషయంలోకి వెళితే... దర్శకుడు నాగ్ తాజాగా కల్కి సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ప్రేక్షకులు మొదటి పార్టులో చూసింది కొంచెమేనని, ఇంకా చూడాల్సింది అంతా సెకండ్ పార్టులోనే ఎక్కువగా ఉందంటూ సెకండ్ పార్టుపైన అంచనాలు పెంచేసాడు.

కల్కి రెండవ భాగం వచ్చేసరికి కమల్, ప్రభాస్, అమితాబ్ మధ్య భారీ వార్ సీక్వెన్సెస్ ఉంటాయని చెప్పుకొచ్చారు నాగ్ అశ్విన్. ఇక మహాభారతం ఎపిసోడ్స్ కూడా రెండో పార్టులోనే ఎక్కువగా ఉండబోతున్నాని కూడా చెప్పుకొచ్చారు. దాంతో రెబల్ ఫాన్స్ ఖుషి ఐపోతున్నారు. ఇంకో విషయం ఏమిటంటే... దర్శకుడు నాగ్  కల్కి చిత్రంలో మహాభారతంలో కురుక్షేత్రం ఎపిసోడ్ ని చాలా అద్భుతంగా ఆవిష్కరించిన సంగతి విదితమే. మహాభారతం ఎపిసోడ్స్ చూపించింది తక్కువ వ్యవధి అయినప్పటికీ కురుక్షేత్రం బ్యాగ్రౌండ్ సెటప్ ని నాగ్ అశ్విన్ చాలా జాగ్రత్తగా తెరకెక్కించడంలో ఇపుడు చాలామంది మహాభారతం కథని నాగ్ అశ్విన్ అయితేనే బాగా తెరకెక్కించగలడు... అనే అభిప్రాయాన్ని వెళ్లగక్కుతున్నారు. మరి ఈ అంశంపైన నాగ్ అశ్విన్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>