Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalki326be1e0-665a-4f37-8ab4-7c5d7777072e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalki326be1e0-665a-4f37-8ab4-7c5d7777072e-415x250-IndiaHerald.jpgఒకప్పుడు సినిమాలపై సోషల్ మీడియా ప్రభావం తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం లేని సినిమానే కనిపించడం లేదు. ఇక ఏ సినిమా వచ్చినా కూడా దానిపై సోషల్ మీడియాలో ఏదో ఒకటి పుట్టుకు వస్తూ ఉంది. ముఖ్యంగా ఇలా సినిమాలపై నెగిటివ్ విషయాలను ప్రచారం చేయడంలో ఎప్పుడూ అటు సోషల్ మీడియాలో నేటిజన్స్ ముందు ఉంటున్నారు అని చెప్పాలి. పనిగట్టుకుని మరి ఎన్నో చిత్ర విచిత్రమైన కామెంట్లు చేయడం చూస్తూ ఉన్నాం. ఇక ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాను వదలలేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమాKalki{#}Prabhas;Jr NTR;nag ashwin;prashanth neel;Cinema;media;vijay kumar naidu;Blockbuster hit;Comedy;war;Box office;Hero;News;Prasanth Neel'కల్కి'లో ప్రభాస్ కాకుండా.. ఆ హీరో నటించి ఉంటే చరిత్ర తిరగరాసేదట?'కల్కి'లో ప్రభాస్ కాకుండా.. ఆ హీరో నటించి ఉంటే చరిత్ర తిరగరాసేదట?Kalki{#}Prabhas;Jr NTR;nag ashwin;prashanth neel;Cinema;media;vijay kumar naidu;Blockbuster hit;Comedy;war;Box office;Hero;News;Prasanth NeelFri, 05 Jul 2024 17:15:00 GMTఒకప్పుడు సినిమాలపై సోషల్ మీడియా ప్రభావం తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం లేని సినిమానే కనిపించడం లేదు. ఇక ఏ సినిమా వచ్చినా కూడా దానిపై సోషల్ మీడియాలో ఏదో ఒకటి పుట్టుకు వస్తూ ఉంది. ముఖ్యంగా ఇలా సినిమాలపై నెగిటివ్ విషయాలను ప్రచారం చేయడంలో ఎప్పుడూ అటు సోషల్ మీడియాలో నేటిజన్స్ ముందు ఉంటున్నారు అని చెప్పాలి. పనిగట్టుకుని మరి ఎన్నో చిత్ర విచిత్రమైన కామెంట్లు చేయడం చూస్తూ ఉన్నాం. ఇక ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాను వదలలేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.



 మొదటి రోజు నుంచే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టిస్తున్న ఈ మూవీ ఇక ఇటీవల 800 కోట్లకు పైగా వసూళ్లను క్రాస్ చేసేసింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఉన్న ఎన్నో రికార్డులను తిరగరాస్తుంది అని చెప్పాలి. అయితే కల్కి మూవీలో ప్రభాస్ భైరవ పాత్రలో అదరగొట్టేసాడు. కామెడీ ఎమోషన్స్ యాక్షన్ ఇక అన్ని విభాగాలను ఇరగదీసాడు. కానీ ఇప్పుడు ప్రభాస్ కాకుండా మరో హీరో కల్కి మూవీలో నటించి ఉంటే మరింత పెద్ద హిట్ అయ్యేది అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది.


 ఏకంగా భైరవ పాత్రలో ప్రభాస్ కంటే జూనియర్ ఎన్టీఆర్ నటిస్తే బాగుండేది అని కొంతమంది నెటిజెన్స్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారట. ఏకంగా తారక్ నటించి ఉంటే 1200 కోట్ల వసూలు దాటేసి ఉండేదని చెబుతున్నారట. కాగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. బాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా తెరకేకుతున్న వార్ 2 సినిమాలోను నటిస్తున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్  దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే ఇక ఇప్పుడు కల్కి సినిమాలో తారక్ నటిస్తే మరింత బాగుండేది అని వార్తలు ప్రచారం అవుతున్నాయ్. దీంతో ఏ హీరో చేయాల్సిన సినిమాహీరో చేస్తేనే బాగుంటుందని మరి కొంతమందిని నేటిజన్స్  కామెంట్లు చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>