MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/viswak97fadbf1-0bc1-4cb9-a796-e8b234cdbfbc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/viswak97fadbf1-0bc1-4cb9-a796-e8b234cdbfbc-415x250-IndiaHerald.jpgఅనుదీప్ కేవి కెరియర్ ప్రారంభంలో పిట్టబీగోడ అనే సినిమాకు దర్శకత్వం వహించిన దాని ద్వారా ఈయనకు పెద్ద గుర్తింపు రాలేదు, విజయం దక్కలేదు. ఆ తర్వాత ఈయన జాతి రత్నాలు అనే మూవీ ని తెరకెక్కించాడు. కామెడీ ఎంటర్టైనర్ మూవీగా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ను అందుకుంది. ఈ మూవీ ద్వారా అనుదీప్ కి కూడా దర్శకుడిగా అద్భుతమైన క్రేజ్ వచ్చింది. ఈ సినిమా తర్వాత ఈయన తెలుగు హీరోలతో కాకుండా తమిళ హీరో అయినటువంటి శివ కార్తికేయన్ తో ప్రిన్స్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ లో సత్యరాజ్ ఓ కీలకమైన పాత్రలో నటviswak{#}October;Viswak sen;sathyaraj;Shiva;lord siva;ravi teja;Darsakudu;Telugu;prince;Ravi;Comedy;Tamil;Director;News;Cinemaఅలాంటి పని చేసిన అనుదీప్.. అందుకే సినిమా ఓకే చేసిన విశ్వక్ సేన్..?అలాంటి పని చేసిన అనుదీప్.. అందుకే సినిమా ఓకే చేసిన విశ్వక్ సేన్..?viswak{#}October;Viswak sen;sathyaraj;Shiva;lord siva;ravi teja;Darsakudu;Telugu;prince;Ravi;Comedy;Tamil;Director;News;CinemaFri, 05 Jul 2024 09:15:00 GMTఅనుదీప్ కేవి కెరియర్ ప్రారంభంలో పిట్టబీగోడ అనే సినిమాకు దర్శకత్వం వహించిన దాని ద్వారా ఈయనకు పెద్ద గుర్తింపు రాలేదు, విజయం దక్కలేదు. ఆ తర్వాత ఈయన జాతి రత్నాలు అనే మూవీ ని తెరకెక్కించాడు. కామెడీ ఎంటర్టైనర్ మూవీగా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ను అందుకుంది. ఈ మూవీ ద్వారా అనుదీప్ కి కూడా దర్శకుడిగా అద్భుతమైన క్రేజ్ వచ్చింది. ఈ సినిమా తర్వాత ఈయన తెలుగు హీరోలతో కాకుండా తమిళ హీరో అయినటువంటి శివ కార్తికేయన్ తో ప్రిన్స్ అనే మూవీ ని రూపొందించాడు.

మూవీ లో సత్యరాజ్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. తెలుగు , తమిళ్ లో రూపొందిన ఈ సినిమా ఏకకాలంలో ఈ రెండు భాషలలో విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈ దర్శకుడు మాస్ మహారాజా రవితేజతో మూవీ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే రవితేజకు ఈ దర్శకుడు ఓ కథను వినిపించగా , ఆ కథలో రవితేజ కొన్ని మార్పులను సూచించినట్లు , ఆ తర్వాత మరికొంత సమయం తీసుకొని కొన్ని మార్పులు చేసి రవితేజకు వినిపించిన ఆ కథ ఆయనకు నచ్చకపోవడంతో ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

తాజాగా ఈ దర్శకుడు యువ నటుడు విశ్వక్ సేన్ తో మూవీ ఓకే చేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు పది రోజుల క్రితం అనుదీప్ , విశ్వక్ ను కలిసి ఒక కథను చెప్పినట్లు తెలుస్తోంది. చాలామంది రవితేజ రిజెక్ట్ చేసిన కథనే విశ్వక్ కి వినిపించాడు అని అంటున్నారు. కాకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రవితేజకు వినిపించిన స్టోరీ వేరు అని విశ్వక్ కోసం మళ్లీ పూర్తిగా కొత్త స్టోరీని అనుదీప్ తయారుచేసి దానిని విశ్వక్ కి వినిపించినట్లు తెలుస్తోంది. దానితో ఈయన ఇంప్రెస్ అయ్యి అనుదీప్ కి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని 14 రీల్స్ బ్యానర్ వారు నిర్మించనున్నట్లు , ఈ సినిమా షూటింగ్  అక్టోబర్ నుండి స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>