PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/balanagireddy11e31733-ba1d-453d-8a2f-fc3869471994-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/balanagireddy11e31733-ba1d-453d-8a2f-fc3869471994-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... 2024 అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల ఇటీవల జరగగా.... ఇందులో ఎవరు ఊహించని ఫలితాలు వెలుపడ్డాయి. ఏపీ ఎన్నికల్లో 175 స్థానాలకు 175 గెలుస్తామని వైసిపి పార్టీ ఎన్నికల ప్రచారంలో చెప్పింది. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి... పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేవలం వైసీపీ పార్టీ 11 స్థానాలకు పరిమితమైపోయింది. ఇందులో జగన్మోహన్ రెడ్డి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి కీలక నేతలు మినహా.. పెద్ద పెద్ద లీడర్ అందరూ ఓడిపోయారు. balanagireddy{#}Raghavendra;history;Leader;Assembly;TDP;Reddy;MLA;YCP;Andhra Pradesh;Yevaruమంత్రాలయం: బాలనాగి రెడ్డి మిస్సింగ్‌..ఆ పార్టీలోకి వెళుతున్నాడా ?మంత్రాలయం: బాలనాగి రెడ్డి మిస్సింగ్‌..ఆ పార్టీలోకి వెళుతున్నాడా ?balanagireddy{#}Raghavendra;history;Leader;Assembly;TDP;Reddy;MLA;YCP;Andhra Pradesh;YevaruFri, 05 Jul 2024 14:06:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... 2024 అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల ఇటీవల జరగగా.... ఇందులో ఎవరు ఊహించని ఫలితాలు వెలుపడ్డాయి. ఏపీ ఎన్నికల్లో 175 స్థానాలకు 175 గెలుస్తామని వైసిపి పార్టీ ఎన్నికల ప్రచారంలో చెప్పింది. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి... పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేవలం వైసీపీ పార్టీ 11 స్థానాలకు పరిమితమైపోయింది. ఇందులో జగన్మోహన్ రెడ్డి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి కీలక నేతలు మినహా.. పెద్ద పెద్ద లీడర్ అందరూ ఓడిపోయారు.



అయితే ఈ 11 మందిలో టిడిపి గాలి వీచిన కూడా... వైసిపి నేతలు గట్టిగా నిలబడ్డారు. అందుకే విజయం సాధించారు. అలాంటి  వారిలో మంత్రాలయం ఎమ్మెల్యే గా బాలనాగిరెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో 12 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో... టిడిపి అభ్యర్థి నల్లగౌని రాఘవేంద్ర రెడ్డి పైన విజయం సాధించారు బాలనాగిరెడ్డి. దీంతో ఓటమి ఎరుగని నాయకుడిగా చరిత్ర సృష్టించారు.


దాదాపు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలనాగిరెడ్డి... టిడిపి నుంచి మాత్రం ఎమ్మెల్యేగా మొదటిసారి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో మంత్రాలయం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బాలనాగిరెడ్డి. ఆ తర్వాత వైసిపి పార్టీ ఏర్పాటు కావడంతో... టీడీపీ పార్టీ నుంచి జంప్ అయి వైసీపీలో చేరారు. ఇక 2014 నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు బాలనాగిరెడ్డి. అంటే దాదాపు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారన్నమాట.

అయితే మొన్న వైసీపీ పార్టీ తరఫున గెలిచిన బాల నాగిరెడ్డి... అసలు పార్టీలో గాని నియోజకవర్గంలో కానీ కనిపించడం లేదట. గెలిచిన తర్వాత ఒకసారి కనిపించిన బాలనాగిరెడ్డి.. ఎక్కడికి వెళ్ళాడో తెలియదట. దీంతో ఆయన టిడిపి టచ్ లోకి వెళ్లినట్లు.. కొంతమంది ప్రచారం చేస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.... కేసులు పెడతారని... పారిపోయాడని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు బాలనాగిరెడ్డి విషయం హాట్ టాపిక్ అయింది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>