PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandrababue8057110-0da4-45ae-871c-14413d63a4fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandrababue8057110-0da4-45ae-871c-14413d63a4fc-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... అన్ని శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. వైసిపి పరిపాలనలో జరిగిన అవకతవకులను కూడా... తవ్వితీస్తున్నారు చంద్రబాబు. ఏపీ లోటు బడ్జెట్ లో ఉన్న నేపథ్యంలో... ఎక్కడ ఖర్చు పెట్టాలి...? ఇక్కడ ఖర్చు పెట్టకూడదు అనే వివరాలను కూడా సేకరిస్తున్నారు. రోజుకు దాదాపు 18 గంటల పాటు చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారట. chandrababu{#}un employment;Survey;job;Population;CBN;Telangana Chief Minister;Telangana;YCP;Government;Andhra Pradesh;Newsకేసీఆర్‌ బాటలో బాబు... ఏపీలో సంచలన సర్వే ?కేసీఆర్‌ బాటలో బాబు... ఏపీలో సంచలన సర్వే ?chandrababu{#}un employment;Survey;job;Population;CBN;Telangana Chief Minister;Telangana;YCP;Government;Andhra Pradesh;NewsFri, 05 Jul 2024 13:46:24 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... అన్ని శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. వైసిపి పరిపాలనలో జరిగిన అవకతవకులను కూడా... తవ్వితీస్తున్నారు చంద్రబాబు. ఏపీ లోటు బడ్జెట్ లో ఉన్న నేపథ్యంలో... ఎక్కడ ఖర్చు పెట్టాలి...? ఇక్కడ ఖర్చు పెట్టకూడదు అనే వివరాలను కూడా సేకరిస్తున్నారు. రోజుకు దాదాపు 18 గంటల పాటు చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారట.


అయితే... తన కేబినెట్లో ఎక్కువ శాతం యూత్ కు అవకాశాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు... ఇప్పుడు ఏపీలో ఉన్న నిరుద్యోగులు అలాగే యువతపై ప్రత్యేక ఫోకస్ చేశారట. గ్రామీణ ప్రాంతాలలో... ఉన్నటువంటి యువత  ఏం చేస్తున్నారు? వారు అక్షరాసులా లేదా నిరక్షరాశులా? ఒకవేళ చదువుకున్న వారు అయితే... నిరుద్యోగులుగా ఉన్నారా లేదా ఏదైనా జాబ్ చేస్తున్నారా,?  అనే డేటాను సేకరించేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు.


ఇక చదువుకోని వారు ఎలాంటి ఉపాధి అవకాశాలను కోరుకుంటున్నారు. నిరుద్యోగులు ఎలాంటి.. డిమాండ్లు  పెడుతున్నారు? అలాగే గ్రామాల్లో ఎంతమంది జనాభా ఉన్నారు? అనే వివరాలను సేకరించాలని అధికారులకు చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో హుటాహుటిన... ఈ సర్వే నిర్వహించేందుకు... అధికారులు సన్నద్ధం  అవుతున్నారు.

 

ప్రాథమిక సమాచారం ప్రకారం ఆగస్టు ఒకటో తేదీ తర్వాత.... ప్రతి గ్రామంలో అధికారులు సర్వే చేసే ఛాన్స్ ఉంది. కాక గతంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా... ఓ సర్వేను చేశారు కేసీఆర్. ఈ సర్వే ఆధారంగా సంక్షేమ పథకాలు, పెన్షన్లు, తదితర అంశాలను  అమలు చేశారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక ఇప్పుడు చంద్రబాబు కూడా అదే బాటలో వెళ్తున్నారు. సర్వే నిర్వహించి నిరుద్యోగులకు ఎలాంటి అవకాశా లు కల్పించాలి అనే దానిపై... ఓ నిర్ణయం తీసుకోబోతున్నారట. అలాగే వారి కోసం ప్రత్యేక ఆర్థిక నిధిని కూడా కేటాయించాలని అనుకుంటున్నారట.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>