PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-assembly-elections-ap-elections-survey-telangana-parliament-elections-andhrapradesh-assembly-elections-assembly-elections-2024-kcr-ktr-brsb20ee16f-062e-4997-b6ca-cd67a75de46a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-assembly-elections-ap-elections-survey-telangana-parliament-elections-andhrapradesh-assembly-elections-assembly-elections-2024-kcr-ktr-brsb20ee16f-062e-4997-b6ca-cd67a75de46a-415x250-IndiaHerald.jpgఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి శాసనమండలిలో సైతం తగ్గిపోతోంది. మండలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బలం 21కి పడిపోయింది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్లమెంటు ఎన్నికలకు ముందే ముగ్గురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత మరో ముగ్గురు చేరారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నాAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; kcr; ktr; brs{#}jeevan;Ranga Reddy;zero;Governor;venkat;KTR;Kumaar;Car;Parliament;local language;MLA;Karimnagar;Bhadrachalam;Jagtial;bhanu;srinivas;Reddy;Congress;Telanganaబీఆర్ఎస్ అక్క‌డ మొత్తం ఖాళీ.. కేటీఆర్‌, కేసీఆర్‌కు గుండు సున్నాయే ?బీఆర్ఎస్ అక్క‌డ మొత్తం ఖాళీ.. కేటీఆర్‌, కేసీఆర్‌కు గుండు సున్నాయే ?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; kcr; ktr; brs{#}jeevan;Ranga Reddy;zero;Governor;venkat;KTR;Kumaar;Car;Parliament;local language;MLA;Karimnagar;Bhadrachalam;Jagtial;bhanu;srinivas;Reddy;Congress;TelanganaFri, 05 Jul 2024 10:45:45 GMTఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి శాసనమండలిలో సైతం తగ్గిపోతోంది. మండలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బలం 21కి పడిపోయింది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్లమెంటు ఎన్నికలకు ముందే ముగ్గురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత మరో ముగ్గురు చేరారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.


పార్లమెంటు ఎన్నికల తర్వాత బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రావు, చేవెళ్ల ఎమ్మెల్యే  కాలే యాదయ్య కూడా కారు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఇక తాజాగా ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. అదిలాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ దండే విఠ‌ల్, కరీంనగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు, రంగారెడ్డి లోకల్ బాడీ ఎమ్మెల్సీ ప్రభాకర్, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ యెగ్గం మల్లేష్, గవర్నర్ కోట ఎమ్మెల్సీలు బొగ్గవరపు దయానంద్, బసవరాజు సారయ్య ఇద్దరు కూడా కాంగ్రెస్ గూటికి చేరిపోయారు.


ఇక ఇప్పటికే మండలిలో కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి, బల్మూరి వెంకట్ , మహేష్ కుమార్ గౌడ్, తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీలుగా ఉన్నారు. అలాగే కూచుకుళ్ల‌ దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి ఇద్దరు కాంగ్రెస్ పార్టీతో ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. మొత్తం మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు 12 కు చేరుకుంది త్వరలోనే బిఆర్ఎస్ నుంచి మరికొందరు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ గుటికి చేరుకోనున్నారు. ఏది ఏమైనా మండలి లో కూడా బిఆర్ఎస్ బలం పూర్తిగా తగ్గిపోవడంతో పాటు.. అక్కడ కూడా కేసీఆర్, కేటీఆర్ ప్రభావం జీరో అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>