Politicsmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-lokesh28250584-880c-40e5-92c5-1ea455963efb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-lokesh28250584-880c-40e5-92c5-1ea455963efb-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది.ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలనీ ఎన్నికల కమిషన్ ఆదేశించినప్పటికీ ఎన్నికలు జరిగిన తరువాత జూన్ 6 వ తేదీ వరకు పిన్నేల్లిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.ఈ క్రమంలో పిన్నెల్లి తరుపున బెయిల్ పిటిషన్ వేయడంతో హైకోర్ట్ ఆ పిటిషన్ ను కొట్టి వేసింది.అనేక వాయిదాల తరువాత ఎట్టకేలకు పిన్నేల్లిని అరెస్ట్ చేసారు.పిన్నెల్లి పై ఏకంగా నాలుగు కేసులు పెట్టడం #lokesh{#}Arrest;High court;Lokesh;Lokesh Kanagaraj;Red;vamsi;Nara Lokesh;June;YCP;Elections;Macherla;MLA;Reddyపిన్నెల్లికి చెక్ పెట్టిన లోకేష్ రెడ్ బుక్.. ఈ సారి టార్గెట్ ఎవరంటే..?పిన్నెల్లికి చెక్ పెట్టిన లోకేష్ రెడ్ బుక్.. ఈ సారి టార్గెట్ ఎవరంటే..?#lokesh{#}Arrest;High court;Lokesh;Lokesh Kanagaraj;Red;vamsi;Nara Lokesh;June;YCP;Elections;Macherla;MLA;ReddyFri, 05 Jul 2024 10:39:04 GMT*  సంచలనంగా మారిన లోకేష్ రెడ్ బుక్
* పిన్నెల్లి దే రెడ్ బుక్ లో తొలి వికెట్
* వారి పేర్లు అండర్ లైన్ చేసుకున్న లోకేష్ ?


ఆంధ్రప్రదేశ్ లో 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది.ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలనీ ఎన్నికల కమిషన్ ఆదేశించినప్పటికీ ఎన్నికలు జరిగిన తరువాత జూన్ 6 వ తేదీ వరకు పిన్నేల్లిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.ఈ క్రమంలో పిన్నెల్లి తరుపున బెయిల్ పిటిషన్ వేయడంతో  హైకోర్ట్ ఆ పిటిషన్ ను కొట్టి వేసింది.అనేక వాయిదాల తరువాత ఎట్టకేలకు పిన్నేల్లిని అరెస్ట్ చేసారు.పిన్నెల్లి పై ఏకంగా నాలుగు కేసులు పెట్టడం జరిగింది.అందులో ఈవీఎం ధ్వంసం ,టీడీపీ ఏజెంట్ పై దాడి ,ఎలేచ్షన్స్ జరిగిన తరువాత కొంతమంది మారణాయుధాలతో తిరిగి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం ,అలాగే సిఐపై కూడా దాడి చేసిన కేసుల కింద పిన్నెల్లిని అరెస్ట్ చేసారు.అయితే పిన్నెల్లి అరెస్ట్ పై లోకేష్ రెడ్ బుక్ పాత్ర ఉందా అనేది ప్రశ్నగా మారింది.ప్రస్తుతం నారా లోకేష్ రెడ్ బుక్ విషయం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది.

యువగళం పాదయాత్రలో భాగంగా అనేక ప్రాంతాలు పర్యటించిన లోకేష్ టీడీపీ నేతలపై ,కార్యకర్తలపై వైసీపీ నాయకులూ తమ అధికారాన్ని వుపయోగించి చేసిన దాడులు అన్నిటిని సాక్షాధారాలతో సహా లోకేష్ రెడ్ బుక్ లో నోట్ చేసుకున్నారు.తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రెడ్ బుక్ ఓపెన్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టిన నాయకుల భరతం పడతా అంటూ లోకేష్ ప్రకటించారు.ఊహించని స్థాయిలో ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో లోకేష్ రెడ్ బుక్ గురించి చర్చ మొదలైంది.అందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయనేది వైసీపీ నేతల గుండెల్లో దడ పుట్టిస్తుంది. పిన్నెల్లి అరెస్ట్ కేవలం శాంపిల్ మాత్రమే అని ముందు ముందు దాడులకు పాల్పడ్డ వైసీపీ నేతలకు ,కార్యకర్తలకు ఊహించని ట్రీట్ మెంట్ ఉంటుందని తెలుస్తుంది.గత ప్రభుత్వంలో ప్రతి పక్ష నాయకులాలపై ,కార్యకర్తలపై వైసీపీ నాయకులు అమానుషంగా చేసిన దాడికి కచ్చితంగా బదులు తీర్చుకుంటామని లోకేష్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే.అయితే ఆ తరువాత లిస్ట్ లో నాయకులూ ఎవరా అని అందరిలో ఆసక్తి నెలకొంది.ఈ లిస్ట్ లో కొడాలినాని,వల్లభనేని వంశీ వంటి వారి పేర్లు కూడా వున్నాయి.ముఖ్యంగా వాళ్ళ పేర్లు నారా లోకేష్ అండర్ లైన్ చేసుకున్నట్లు సమాచారం.ఆ నాయకులకు లోకేష్ ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>