Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rukmini-vasanth6a534aa9-6463-4cee-8cd3-414958ed5bf6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rukmini-vasanth6a534aa9-6463-4cee-8cd3-414958ed5bf6-415x250-IndiaHerald.jpgకన్నడ నుంచి వచ్చే ప్రతి హీరోయిన్ కి సౌత్ ఇండస్ట్రీలో భలే డిమాండ్ ఉంటుంది. అక్కడ నుంచి వచ్చిన హీరోయిన్స్ అంతా స్టార్ క్రేజ్ దక్కించుకున్న వారే ఉన్నారు. ఈ క్రమంలో కన్నడ నుంచి మరో హీరోయిన్ టాప్ లీగ్ లోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆమె సప్త సాగరాలు దాటి తో ప్రేక్షకుల హృదయాలను గెలిచిన రుక్మిణి వసంత్. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన సప్త సాగరాలు దాటిRukmini Vasanth{#}Kannada;Rakshit Shetty;Avunu;Tollywood;Telugu;Heroine;Cinemaఅందాల భామ టీచర్ అవ్వాలని అనుకుందట..!అందాల భామ టీచర్ అవ్వాలని అనుకుందట..!Rukmini Vasanth{#}Kannada;Rakshit Shetty;Avunu;Tollywood;Telugu;Heroine;CinemaThu, 04 Jul 2024 08:05:00 GMTకన్నడ నుంచి వచ్చే ప్రతి హీరోయిన్ కి సౌత్ ఇండస్ట్రీలో భలే డిమాండ్ ఉంటుంది. అక్కడ నుంచి వచ్చిన హీరోయిన్స్ అంతా స్టార్ క్రేజ్ దక్కించుకున్న వారే ఉన్నారు. ఈ క్రమంలో కన్నడ నుంచి మరో హీరోయిన్ టాప్ లీగ్ లోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆమె సప్త సాగరాలు దాటి తో ప్రేక్షకుల హృదయాలను గెలిచిన రుక్మిణి వసంత్. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన సప్త సాగరాలు దాటి సినిమాలో ప్రియ పాత్రలో రుక్మిణి ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఆ సినిమాలో తన నటనతో అలరించిన రుక్మిణికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే తమిళంలో ఒక సినిమా చేస్తున్న అమ్మడు టాలీవుడ్ నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తుంది. ఇదిలాఉంటే అసలు రుక్మిణి వసంత్ హీరోయిన్ కాకపోతే ఏమయ్యేది అని ఆమెను అడిగితే టీచర్ అయ్యేదాన్నని చెప్పి షాక్ ఇచ్చింది.

అదేంటి అనుకోవచ్చు. అవును ఆమెకి చిన్నప్పటి నుంచి టీచర్ అవ్వాలని కోరిక ఉండేదట. టీచర్ గా మారి పిల్లలకు పాఠాలు చెప్పాలని అనుకుందట. కానీ సినిమా హీరోయిన్ గా మారింది. ఐతే తను హీరోయిన్ అవుతానని అస్సలు అనుకోలేదని గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక ఒక ఫెస్ట్ లో చూసి ఒక ప్రాటనలో ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత అది చూసి సినిమా ఛాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చింది.

రుక్మిణి వసంత్ తెలుగు లో నటిస్తే మాత్రం ఆమెకు ఇక్కడ క్రేజీ ఫ్యాన్స్ ఏర్పడే ఛాన్స్ ఉంది. రుక్మిణి వసంత్ ఇప్పటికే తెలుగు మేకర్స్ తో డిస్కషన్స్ చేస్తుందని తెలుస్తుంది. మరి అమ్మడు ఎంట్రీ ఏ సినిమాతో అన్నది తెలియాల్సి ఉంది. సప్త సాగరాలు దాటి సినిమా తెలుగులో కూడా మంచి ప్రేక్షకాదరణ తెచ్చుకుంది. ఈ సినిమాలో రుక్మిణిని చూసి తెలుగు ఆడియన్స్ మనసు పారేసుకున్నారు. ఆమె తెలుగు స్ట్రైట్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>