Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4d51cb7f-900e-4d07-ad64-181b594026f0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4d51cb7f-900e-4d07-ad64-181b594026f0-415x250-IndiaHerald.jpg'నాటు నాటు' అంటూ ప్రపంచాన్నే తన సంగీతంతో ఊర్రుతలుంగించారు సంగీత స్వరకర్త ఎంఎం కీరవాణి. ఈ పాటకు ఏకంగా ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్‌ గెలిచి తెలుగు సినిమా సంగీతాన్ని అంతర్జాతీయ వేదికలపై మారుమోగించారు కీరవాణి. ఎమ్‌ ఎమ్‌ కీరవాణి అంటే కేవలం సంగీత దర్శకుడు మాత్రమే కాదు.. గాన గాంధర్వుడు కూడా. బాణీలతో మాత్రమే కాదు తన స్వరంతోనూ సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నారు. అక్షరానికి, స్వరానికి సమ ప్రాధాన్యత ఇచ్చిన సంగీత దర్శకుడు ఈయన.అందుకే సినీ ఇండస్ట్రీలో కిరవాణికి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తెలుగులో ఎమsocialstars lifestyle{#}usha;Sangeetha;Allari;Fidaa;Hindi;Telugu;m m keeravani;Oscar;Music;Cinema;INTERNATIONAL;marriage;India;Ram Gopal Varma;Darsakudu;Directorఅసిస్టెంట్ టూ ఆస్కార్ 'మెలోడీ కింగ్' ప్రయాణం ఇదే..!అసిస్టెంట్ టూ ఆస్కార్ 'మెలోడీ కింగ్' ప్రయాణం ఇదే..!socialstars lifestyle{#}usha;Sangeetha;Allari;Fidaa;Hindi;Telugu;m m keeravani;Oscar;Music;Cinema;INTERNATIONAL;marriage;India;Ram Gopal Varma;Darsakudu;DirectorThu, 04 Jul 2024 17:15:00 GMT'నాటు నాటు' అంటూ ప్రపంచాన్నే తన సంగీతంతో ఊర్రుతలుంగించారు సంగీత స్వరకర్త ఎంఎం కీరవాణి. ఈ పాటకు ఏకంగా ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్‌ గెలిచి తెలుగు సినిమా సంగీతాన్ని అంతర్జాతీయ వేదికలపై మారుమోగించారు కీరవాణి. ఎమ్‌ ఎమ్‌ కీరవాణి అంటే కేవలం సంగీత దర్శకుడు మాత్రమే కాదు.. గాన గాంధర్వుడు కూడా.  బాణీలతో మాత్రమే కాదు తన స్వరంతోనూ సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నారు. అక్షరానికి, స్వరానికి సమ ప్రాధాన్యత ఇచ్చిన సంగీత దర్శకుడు ఈయన.అందుకే సినీ ఇండస్ట్రీలో కిరవాణికి ప్రత్యేక స్థానం  సంపాదించుకున్నారు. తెలుగులో ఎమ్‌.ఎమ్‌.కీరవాణిగా.. తమిళంలో మరకతమణిగా, హిందీలో ఎమ్‌.ఎమ్‌.క్రీమ్‌గా ఇలా దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు పొందారు ఈయన. తనదైన సంగీతం, స్వరంతో మ్యాజిక్‌ చేస్తూ ఇండియన్‌ మూవీ హిస్టరీలోనే వన్‌ అండ్‌ ఓన్లీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ పేరు గడించిన కిరవాణి బర్త్‌డే నేడు. జూన్‌ 4న ఆయన పుట్టిన రోజు. 1961 జూలై 4న జన్మించిన ఆయన 1987లో ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర అసిస్టెంట్‌గా కెరీర్‌ మొదలుపెట్టారు. ఉషా కిరణ్ మూవీస్ నిర్మాణ సంస్థలో 1989లో వచ్చిన తెలుగు సినిమా 'మనసు - మమత' తొలిసారి బాణీలు సమకూర్చారు. ఈ సినిమాతోనే ఆయన సంగీత దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేశారు. అలా ఇప్పటి వరకు కీరవాణి తెలుగు, తమిళంలో, హిందీ ఇలా ఇతర భాషల్లో కలిపి 250కి పైగా చిత్రాలకు సంగీతం అందించిన సంగీత ప్రియులను అలరించారు.

1991లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'క్షణ క్షణం' మూవీకి సంగీతం అందించారు.అలాగే ఇప్పటివరకూ మొత్తం 8 నంది పురస్కారాలు గెలవడం విశేషం. క సంగీత దర్శకుడిగా ఆయన కెరీర్‌లో చెప్పుకొదగ్గ సినిమాలు.. సీతారామయ్యగారి మనవరాలు, సుందరకాండ, ఆపద్బాంధవుడు, శుభ సంకల్పం, పెళ్లి సందడి, క్షణ క్షణం, మేజర్ చంద్రకాంత్, అన్నమయ్య, అల్లరి ప్రియుడు, స్టూడెంట్ నంబర్ 1, అల్లరి మొగుడు, ఛత్రపతి, సింహాద్రి, శ్రీరామదాసు, నేనున్నాను వంటి చిత్రాలు మ్యూజికల్‌గా మంచి విజయం సాధించాయి. గతేడాది పాన్‌ ఇండియా సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ఆయన సంగీతం అందించారు. ఇందులో నాటు నాటు పాటకు ఆయన బాణీలకు ప్రపంచం ఫిదా అయ్యింది. దీంతో ఏకంగా ఈ పాట ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యి అవార్డు గెలుచుకుంది. ఈ పాట రెండు విభాగాల్లో ఆస్కార్‌ గెలవడం విశేషం. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్ క్యాటగిరిలో నాటు నాటు పాటకు ఉత్తమ సంగీత దర్శకుడిగా కిరవాణి ఆస్కార్ అందుకోగా.. బెస్ట్‌ లిరిసిస్ట్‌గా సుభాస్‌ చంద్రబోస్‌ ఆస్కార్‌ అవార్డును గెలుచుకున్నారు.. ఇలా సంగీత దర్శకుడిగా ఆయన మరేన్నో  మైలురాయికి చేరాలని ఆకాంక్షిస్తూ ఆయనకు మరోసారి పెట్టిన రోజు శుభాకాంక్షలు.. హ్యాపీ బర్త్‌డే ఎమ్‌ ఎమ్‌ కీరవాణి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>