MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pooja-hegdef845098d-c711-48a7-8558-72f49af60fa3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pooja-hegdef845098d-c711-48a7-8558-72f49af60fa3-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమను ఒక ఊపు ఊపిన నటి మణులలో పూజా హెగ్డే ఒకరు. ఈ ముద్దుగుమ్మ నాగ చైతన్య హీరోగా రూపొందిన ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో వరుసగా ఈ బ్యూటీ కి టాలీవుడ్ టాప్ హీరోల సరసన అవకాశాలు దక్కడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు వరుసగా విజయాలు సాధిస్తూ వెళ్లడంతో చాలా తక్కువ కాలంలోనే ఈ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. తెలుగు లో మంచి అవకాశాలు దక్కుతున్న సమయం లోనే ఈమె అనpooja hegde{#}BEAUTY;Karthik;Pooja Hegde;Tamil;Hindi;Rangasthalam;Oka Laila Kosam;Heroine;Naga Chaitanya;Josh;surya sivakumar;News;Tollywood;Teluguమరి దారుణంగా పూజా హెగ్డే పరిస్థితి.. ఒక హిట్ కొడితే అందరికీ సమాధానం..?మరి దారుణంగా పూజా హెగ్డే పరిస్థితి.. ఒక హిట్ కొడితే అందరికీ సమాధానం..?pooja hegde{#}BEAUTY;Karthik;Pooja Hegde;Tamil;Hindi;Rangasthalam;Oka Laila Kosam;Heroine;Naga Chaitanya;Josh;surya sivakumar;News;Tollywood;TeluguThu, 04 Jul 2024 06:45:00 GMTతెలుగు సినీ పరిశ్రమను ఒక ఊపు ఊపిన నటి మణులలో పూజా హెగ్డే ఒకరు. ఈ ముద్దుగుమ్మ నాగ చైతన్య హీరోగా రూపొందిన ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో వరుసగా ఈ బ్యూటీ కి టాలీవుడ్ టాప్ హీరోల సరసన అవకాశాలు దక్కడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు వరుసగా విజయాలు సాధిస్తూ వెళ్లడంతో చాలా తక్కువ కాలంలోనే ఈ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది.

తెలుగు లో మంచి అవకాశాలు దక్కుతున్న సమయం లోనే ఈమె అనేక తమిళ , హిందీ సినిమాలలో కూడా నటించి అక్కడ కూడా విజయాలను అందుకుంది. ఇలా తెలుగు , తమిళ్ , హిందీ సినీ పరిశ్రమలలో ఫుల్ జోష్ ను చూపించిన ఈ బ్యూటీ కి ఈ మధ్య కాలంలో అనేక అపజయాలు వచ్చాయి. దానితో ఈమె క్రేజ్ కూడా చాలా వరకు తగ్గింది. ఇప్పుడు ప్రస్తుతం ఈమె సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే పూజా హెగ్డే గతంలో రంగస్థలం , ఎఫ్ 3 వంటి సినిమాలలో ఐటమ్ సాంగ్ లలో కూడా నటించింది.

ఈ రెండు సినిమాలలో ఈమె తన అద్భుతమైన అందాలతో , డ్యాన్స్ తో సినిమాకు మంచి క్రేజ్ ను తీసుకువచ్చింది. ఇలా అద్భుతమైన జోష్లో కెరియర్ను కొనసాగించిన ఈ బ్యూటీకి వరుసగా ఫ్లాప్ లు వస్తూ ఉండటంతో ఐటమ్ సాంగ్ లలో కూడా తీసుకోవడానికి భయపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదంతా చూస్తున్న అనేక మంది సినీ లవర్స్ పూజా హెగ్డే గొప్ప అందగత్తె , అలాగే మంచి టాలెంట్ ఉన్న నటి కూడా ... ప్రస్తుతం ఆమెకు అపజయాలు రావడంతో పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఈమెకు గనక ఒక్క సాలిడ్ విజయం పడినట్లు అయితే మళ్లీ ఈమెకు అవకాశాలు క్యూ కడతాయి. అలాగే ఎంత రెమ్యూనరేషన్ అడిగితే అంత ఇవ్వడానికి రెడీ అవుతారు అని భావిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>