PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/big-blow-to-ycp-pawan-uncle-joins-jana-senac35c16e6-5c1a-48d7-8931-0ab3e6c84832-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/big-blow-to-ycp-pawan-uncle-joins-jana-senac35c16e6-5c1a-48d7-8931-0ab3e6c84832-415x250-IndiaHerald.jpgఏపీలో ఇటీవ‌ల జరిగిన సాధారణ ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది వైసిపి.. ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.. తాడేపల్లి ప్యాలెస్‌ దాటి బయటకు రాని ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. కేవలం సంక్షేమంతో తాను తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తానని అతి నమ్మకంతో అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. 2019 ఎన్నిక‌ల్లో ఆంధ్ర ప్రదేశ్ జనాలు జగన్ కు 151 సీట్లతో అధికారం కట్టబెట్టి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని 23 సీట్లకు పరిమితం చేశారు.. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కంటే ఘోరంగా వైసిపిని 11AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jagan; ycp; jenasena; pawan kalyan{#}srinivas;Telugu Desam Party;Jagan;Audimulapu Suresh;Andhra Pradesh;Janasena;Hanu Raghavapudi;Prakasam;Minister;News;Tadepalli;Partyవైసీపీకి పెద్ద దెబ్బ‌... జ‌న‌సేన‌లోకి ప‌వ‌న్ మామ‌..?వైసీపీకి పెద్ద దెబ్బ‌... జ‌న‌సేన‌లోకి ప‌వ‌న్ మామ‌..?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jagan; ycp; jenasena; pawan kalyan{#}srinivas;Telugu Desam Party;Jagan;Audimulapu Suresh;Andhra Pradesh;Janasena;Hanu Raghavapudi;Prakasam;Minister;News;Tadepalli;PartyThu, 04 Jul 2024 11:56:00 GMTఏపీలో ఇటీవ‌ల జరిగిన సాధారణ ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది వైసిపి.. ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.. తాడేపల్లి ప్యాలెస్‌ దాటి బయటకు రాని ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. కేవలం సంక్షేమంతో తాను తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తానని అతి నమ్మకంతో అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. 2019 ఎన్నిక‌ల్లో ఆంధ్ర ప్రదేశ్ జనాలు జగన్ కు 151 సీట్లతో అధికారం కట్టబెట్టి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని 23 సీట్లకు పరిమితం చేశారు.. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కంటే ఘోరంగా వైసిపిని 11 సీట్లకు పరిమితం చేసి జగన్ కు ప్రతిపక్ష నేత హోదా రాకుండా చేశారు. ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా అనేది లేకుండా పోయింది. జగన్ నిరంకుశ విధానాలతో సొంత పార్టీకి చెందిన నేతలు చాలామంది విసిగిపోయి ఉన్నారు.


సొంత పార్టీ నేతలు కాదు జగన్ బంధువుల సైతం ఇప్పుడు జగన్ ను నమ్మే పరిస్థితి లేదు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం తమ దారులు తాము వెతుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జగన్ బంధువు జగన్ కు వరుసకు మామ అయిన ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. జగన్తో ఉంటే పొలిటికల్ ఫ్యూచర్ కష్టమేనని భావించిన బలినేని తన కుమారుడు ప్రణీత్ రెడ్డితో కలిసి జనసేనలోకి వెళ్ళటానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టు ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాలలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.


అసలు ఎన్నికలకు ముందే జగన్ విషయంలో బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.  చివ‌ర‌కు బాలినేని మంత్రి పదవి కాలాన్ని సైతం జగన్ రెండున్నర సంవత్సరాలకు తగ్గించేశారు.. ఆ తర్వాత ఆయనకు మంత్రి పదవి కంటిన్యూ చేయలేదు సరి కదా బాలినేని ఎంత వద్దని చెప్పినా జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేష్ పదవిని మాత్రం ఐదు సంవత్సరాల పాటు కంటిన్యూ చేశారు. ఇదిలా ఉంటే పవన్ సినిమాకు బాలినేని కోట్లలో పెట్టుబడులు పెట్టారని వార్తలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా బాలినేని పదవి విడితే అది జగన్కు ... వైసిపికి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>