PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyanb74285fa-a33c-4c9b-8370-d153785816e8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyanb74285fa-a33c-4c9b-8370-d153785816e8-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా కెరియర్ పై అందరిలోనూ సందిగ్ధత నెలకొంది. అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారా? కేవలం రాజకీయాల్లోనే కొనసాగుతారా? అని అందరూ చర్చించుకుంటున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే... ఓజీ ఇలాంటి సినిమాలను లైన్ లో పెట్టారు. ఈ సినిమాలో షూటింగ్ దశలో ఉన్నాయి. కాబట్టి కచ్చితంగా ఈ సినిమాలు... పూర్తి చేయాల్సి ఉంటుంది. pawan kalyan{#}kalyan;Deputy Chief Minister;Janasena;Telangana Chief Minister;Minister;Cinemaచంద్రబాబుకు భయపడుతున్న పవన్... అందుకే సినిమాలకు దూరం?చంద్రబాబుకు భయపడుతున్న పవన్... అందుకే సినిమాలకు దూరం?pawan kalyan{#}kalyan;Deputy Chief Minister;Janasena;Telangana Chief Minister;Minister;CinemaThu, 04 Jul 2024 11:35:00 GMTచంద్రబాబుకు భయపడుతున్న పవన్... అందుకే సినిమాలకు దూరం?
pawan kalyan good bye to politics


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా కెరియర్ పై అందరిలోనూ సందిగ్ధత నెలకొంది. అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారా? కేవలం రాజకీయాల్లోనే కొనసాగుతారా? అని అందరూ చర్చించుకుంటున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే... ఓజీ ఇలాంటి సినిమాలను లైన్ లో పెట్టారు. ఈ సినిమాలో షూటింగ్ దశలో ఉన్నాయి. కాబట్టి కచ్చితంగా ఈ సినిమాలు... పూర్తి చేయాల్సి ఉంటుంది.

 
ఈ నేపథ్యంలోనే తాజాగా...  జనసేన అధినేత డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు సమయం ఉన్నప్పుడు... ఒప్పుకున్న సినిమాలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఓజీ  సినిమా అని నేను అంటే... ప్రజలు క్యాజీ అంటారని... తన భావాలను వ్యక్తపరిచారు. మూడు నెలల తర్వాత సినిమాల షూటింగ్ కు వస్తానని కూడా తెలిపారు. ఈ విషయంలో సినిమా దర్శకులు, ముఖ్యంగా నిర్మాతలు తనను క్షమించాలని కోరారు పవన్ కళ్యాణ్.


అసలు తనకు సినిమాలు చేసే... సమయం ఎక్కడ దొరుకుతుందని కూడా అన్నారు  డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌. కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలని వెల్లడించారు. ఒకవేళ సినిమాలు చేయాలనుకున్నా... పవన్ కళ్యాణ్ చాలా సమయం కేటాయించాల్సి వస్తుంది. ఒక సాంగ్ లేదా పెద్ద సీన్ కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఒక నెల కావచ్చు లేదా మూడు నెలలు సమయం పట్టవచ్చు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అధినేతగా, డిప్యూటీ ముఖ్యమంత్రి, ఇతర మంత్రి పదవులలో కొనసాగుతున్నారు.

 
షూటింగ్ కు పవన్ కళ్యాణ్ పెడితే ఆ శాఖలన్నీ... పడకేస్తాయి.  పాలన కూడా అస్తవ్యస్తమవుతుంది.  ఇక కొంతమంది అయితే... చంద్రబాబుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీని అలాగే ప్రభుత్వాన్ని వదిలే షూటింగ్లకు పవన్ కళ్యాణ్ వెళితే... చంద్రబాబు... వెన్నుపోటు పొడిచి జనసేన ను ఆక్రమించే ప్రమాదం ఉందని కూడా అంటున్నారు  రాజకీయ విశ్లేషకులు. అయితే ఆ విషయాన్ని ముందే గ్రహిస్తున్న పవన్ కళ్యాణ్... సినిమాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో సినిమాలకు దూరంగా పవన్ కళ్యాణ్ ఉంటేనే మంచిదని చెబుతున్నారు.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>