MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpg‘కల్కి’ మూవీ ఇచ్చిన బ్రేక్ తో ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు అదేవిధంగా ధియేటర్ యజమానులు జోష్ లో ఉన్నారు. ఈ జోష్ ను వచ్చేవారం విడుదలకాబోతున్న ‘భారతీయుడు 2’ కొనసాగిస్తుందని ఈమూవీ బయ్యర్లు ఆశతో ఉన్నారు. అయితే ఈమూవీ విడుదలకావడానికి ఇక కేవలం ఒక వారం రోజులే ఉన్నప్పటికీ ఈమూవీ క్రేజ్ ప్రేక్షకులలో పెద్దగా కనిపించక పోవడం ఈమూవీ నిర్మాతలకు ఆదేవిదంగా ఈమూవీ బయ్యర్లకు షాక్ ఇస్తున్నట్లు సమాచారం. ఈసినిమాను ప్రమోట్ చేస్తూ కమల్ హాసన్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈమూవీకి సంబంkamalhassan{#}Josh;Industry;media;Prabhas;Cinemaశంకర్ కు షాక్ ఇచ్చిన కమలహాసన్ కామెంట్స్ !శంకర్ కు షాక్ ఇచ్చిన కమలహాసన్ కామెంట్స్ !kamalhassan{#}Josh;Industry;media;Prabhas;CinemaThu, 04 Jul 2024 13:54:36 GMT‘కల్కి’ మూవీ ఇచ్చిన బ్రేక్ తో ఫిల్మ్  ఇండస్ట్రీ వర్గాలు అదేవిధంగా ధియేటర్ యజమానులు జోష్ లో ఉన్నారు. ఈ జోష్ ను వచ్చేవారం విడుదలకాబోతున్న ‘భారతీయుడు 2’ కొనసాగిస్తుందని ఈమూవీ బయ్యర్లు ఆశతో ఉన్నారు. అయితే ఈమూవీ విడుదలకావడానికి ఇక కేవలం ఒక వారం రోజులే ఉన్నప్పటికీ ఈమూవీ క్రేజ్ ప్రేక్షకులలో పెద్దగా కనిపించక పోవడం ఈమూవీ నిర్మాతలకు ఆదేవిదంగా ఈమూవీ బయ్యర్లకు షాక్ ఇస్తున్నట్లు సమాచారం.



ఈసినిమాను ప్రమోట్ చేస్తూ కమల్ హాసన్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈమూవీకి సంబంధించి సెకండ్ పార్ట్ కంటే థర్డ్ పార్ట్ కు తాను అభిమాణిని అంటూ చేసిన కామెంట్స్ కమల్ అభిమానులను కూడ కలవర పరుస్తున్నాయి. కమల్ దృష్టిలో ఈమూవీకిసంబంధించిన అసలు కథ ఉంటుందని కమల్ అభిప్రాయం అయినప్పటికీ త్వరలో విడుదల కాబోతున్న ‘భారతీయుడు 2’ సీక్వెల్ గురించి అంచనాలు తగ్గించడం ఏమిటి అంటూ కమలహాసన్ అభిమానులు కలవర పడుతున్నారు.  



‘భారతీయుడు 2’ లో తన పాత్ర కంటే తన మనవడు పాత్రలో నటించిన సిద్దార్థ్ పాత్ర ఎక్కువగా ఉంటుందని కమల్ లీకులు ఇస్తున్నాడు. సిద్దార్థ్ తాత సేనాపతి పాత్రలో కమల్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసినిమా విడుదల సమయానికి ప్రభాస్ కల్కి మ్యానియా చాలవరకు తగ్గిపోతుందని అంచనా ఉంది. దీనితో ‘భారతీయుడు 2’ మూవీకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలక్షన్స్ విషయంలో సంచలనాలు ఉంటాయని కమల్ అబిమానులు అంచనా వేస్తున్నారు.



వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న కమల్ హాసన్ కు ఊహించని బ్రేక్ ‘విక్రమ్’ మూవీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హిట్ ట్రాక్ ను కొనసాగించడానికి ‘భారతీయుడు 2’ సరైన బ్రేక్ ఇస్తుందని అభిమానుల అంచనా. అయితే ఇప్పటివరకు విడుదలైన ఈమూవీలోని పాటలు ట్రైలర్ కు స్పందన అంతంత మాత్రంగా ఉండటంతో ఏమేరకు ‘భారతీయుడు 2’ రికార్డులు క్రియేట్ చేస్తుంది అన్న విషయమై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి..










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>