MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/kalki-2898-adc7ac7024-e72b-4fdd-9006-6e9c078d92ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/kalki-2898-adc7ac7024-e72b-4fdd-9006-6e9c078d92ee-415x250-IndiaHerald.jpgకల్కి ఫస్ట్ వీక్ కలెక్షన్స్: బాక్స్ ఆఫీస్ బద్దలయ్యిందిగా? పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'కల్కి 2898 ఏడీ'. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. ఇంకా అలాగే సీనియర్ స్టార్ హీరోస్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. దిశా పటానీ గ్లామర్ పాత్రలో మెరిసింది. ఇక ఈ భారీ బKalki 2898 AD{#}Amitabh Bachchan;ashwini dutt;krishnam raju;Blockbuster hit;Vyjayanthi Movies;June;Varsham;Heroine;Prabhas;Tamil;Director;Manam;Box office;Telugu;bollywood;Cinema;Indiaకల్కి ఫస్ట్ వీక్ కలెక్షన్స్: బాక్స్ ఆఫీస్ బద్దలయ్యిందిగా?కల్కి ఫస్ట్ వీక్ కలెక్షన్స్: బాక్స్ ఆఫీస్ బద్దలయ్యిందిగా?Kalki 2898 AD{#}Amitabh Bachchan;ashwini dutt;krishnam raju;Blockbuster hit;Vyjayanthi Movies;June;Varsham;Heroine;Prabhas;Tamil;Director;Manam;Box office;Telugu;bollywood;Cinema;IndiaThu, 04 Jul 2024 12:07:33 GMTకల్కి ఫస్ట్ వీక్ కలెక్షన్స్: బాక్స్ ఆఫీస్ బద్దలయ్యిందిగా?  

పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'కల్కి 2898 ఏడీ'. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. ఇంకా అలాగే సీనియర్ స్టార్ హీరోస్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. దిశా పటానీ గ్లామర్ పాత్రలో మెరిసింది. ఇక ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రానికి కబాలి, మహాన్ లాంటి సూపర్ హిట్ మూవీస్ కి మ్యూజిక్ అందించిన తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. జూన్ 27 వ తేదీన విడుదలైన్ ఈ సినిమా ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది.ఈ నేపథ్యంలో 'కల్కి 2898 ఏడీ' 7 రోజుల కలెక్షన్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


కల్కి 2898 ఏడీ' మూవీకి అన్ని ఏరియాలు కలిపి మొత్తం రూ. 380 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా హిట్ అవ్వాలంటే 381 కోట్ల షేర్ రావాలి. 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి ఏడో రోజు కూడా జనాల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 10 కోట్లు వరకూ షేర్ వసూలు చేసింది. మిగిలిన అన్ని ఏరియాలూ కలుపుకుని మొత్తం రూ. 20 కోట్లు రాబట్టింది. ఈ సినిమా టోటల్ గా వారంలో రూ. 345 కోట్లకి పైగా షేర్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటింది. ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకొక 36 కోట్లు వసూళ్లు చేస్తే సరిపోతుంది. గ్రాస్ పరంగా చూసుకుంటే ఈ సినిమా 720 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసి 'బాహుబలి 1', 'జైలర్', 'సలార్' వసూళ్ళని దాటేసింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>