MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd41653d3-8981-4821-8187-27024addd753-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd41653d3-8981-4821-8187-27024addd753-415x250-IndiaHerald.jpgబాహుబలి, త్రిబుల్ ఆర్ వంటి సినిమాలతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నాడు స్టార్ డైరెక్టర్ రాజమౌళి. అయితే ఈ సినిమాల తరువాత రాజమౌళి చేయబోతున్న సినిమాపై ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఉన్న సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గత ఏడాది రాజమౌళి తన తదుపరి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నాడు అంటూ అధికారికంగా ప్రకటన చేశారు. ఇక రాజమౌళి ఏ సినిమా చేసినా కూడా చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు. సినిమా విషయంలో పర్ఫెక్షన్ అంటే ఏంటో చూపిస్తాడు. అంతేకాదు ఆయన సినిమా అంటే tollywood{#}mahesh babu;Rajamouli;India;Tollywood;Cinema;Rajani kanth;media;Director;Newsఫైనల్లీ: మహేష్, రాజమౌళి సినిమాపై బిగ్ అప్డేట్ ఇచ్చిన టీం..!ఫైనల్లీ: మహేష్, రాజమౌళి సినిమాపై బిగ్ అప్డేట్ ఇచ్చిన టీం..!tollywood{#}mahesh babu;Rajamouli;India;Tollywood;Cinema;Rajani kanth;media;Director;NewsThu, 04 Jul 2024 11:41:51 GMTబాహుబలి, త్రిబుల్ ఆర్ వంటి సినిమాలతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నాడు స్టార్ డైరెక్టర్ రాజమౌళి. అయితే ఈ సినిమాల తరువాత రాజమౌళి చేయబోతున్న సినిమాపై ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఉన్న సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గత ఏడాది రాజమౌళి తన తదుపరి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నాడు అంటూ అధికారికంగా ప్రకటన చేశారు. ఇక రాజమౌళిసినిమా చేసినా కూడా చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు. సినిమా విషయంలో పర్ఫెక్షన్ అంటే

 ఏంటో చూపిస్తాడు. అంతేకాదు ఆయన సినిమా అంటే ఎక్కడ కూడా హడావిడి కనిపించదు. స్క్రిప్ట్ వర్క్ కి సెట్ వర్క్ కి నటీనటుల ఎంపిక ఇలా అన్ని పనులకి దాదాపుగా సంవత్సరం కంటే ఎక్కువ సమయం పడుతుంది. రాజమౌళి ఇదివరకు చేసిన సినిమాల విషయంలో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. అయితే తాజాగా రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమాకి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ బయటికి వచ్చింది. దీంతో ఈ అప్డేట్ విన్న సూపర్ స్టార్ అభిమానులు తెగ సంతోషిస్తున్నారు.

జక్కన్న టీం మెంబర్స్‌ నుంచి అందుతున్న అనధికారిక సమాచారం ప్రకారం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ముగింపు దశకు చేరుకుంది. ఆగస్టు వరకు సెట్‌ వర్క్‌ పూర్తి అవ్వడంతో పాటు, నటీనటుల ఎంపిక పక్రియ కూడా పూర్తి అవ్వబోతుందట. దాంతో సినిమాను సెప్టెంబర్‌ లో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.  నిన్న మొన్నటి వరకు రాజమౌళి - మహేష్ బాబు కాంబో మూవీ షూటింగ్‌ ప్రారంభం అవ్వాలంటే 2025 వరకు వెయిట్‌ చేయాల్సిందే అన్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్‌ లోనే మొదటి షెడ్యూల్‌ జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>