Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith70efc795-4af8-489e-81b0-9fea66c3ff89-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith70efc795-4af8-489e-81b0-9fea66c3ff89-415x250-IndiaHerald.jpgభారత జట్టు ఇటీవలే వరల్డ్ కప్ గెలవాలి అన్న కలను సహకారం చేసుకుంది. అప్పుడెప్పుడో 2011లో ధోని కెప్టెన్సీ లో గెలిచినవన్డే వరల్డ్ కప్ తప్పా ఇప్పటివరకు టీమిండియా మరో వరల్డ్ కప్ ఎవరిని గెలవలేకపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతిసారి కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ అదరగొట్టాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది టీమిండియా. కానీ మొదట్లో బాగా రాణించినప్పటికీ కీలకమైన మ్యాచులలో మాత్రం తడబడుతూ చివరికి ఇంటిదారి పడుతూ వచ్చేది. గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లో దాదాపు కప్పు గెలిచినంత పని చేసిన టీమిండియRohith{#}Maharashtra;Yashasvi Jaiswal;Kumaar;Shivam;Rohit Sharma;MS Dhoni;World Cup;ICC T20;CMమహారాష్ట్ర అసెంబ్లీకి ఇండియన్ క్రికెటర్స్.. దేనికోసం అంటే?మహారాష్ట్ర అసెంబ్లీకి ఇండియన్ క్రికెటర్స్.. దేనికోసం అంటే?Rohith{#}Maharashtra;Yashasvi Jaiswal;Kumaar;Shivam;Rohit Sharma;MS Dhoni;World Cup;ICC T20;CMThu, 04 Jul 2024 21:00:00 GMTభారత జట్టు ఇటీవలే వరల్డ్ కప్ గెలవాలి అన్న కలను సహకారం చేసుకుంది. అప్పుడెప్పుడో 2011లో ధోని కెప్టెన్సీ లో గెలిచినవన్డే వరల్డ్ కప్ తప్పా ఇప్పటివరకు టీమిండియా మరో వరల్డ్ కప్ ఎవరిని గెలవలేకపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతిసారి కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ అదరగొట్టాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది టీమిండియా. కానీ మొదట్లో బాగా రాణించినప్పటికీ కీలకమైన మ్యాచులలో మాత్రం తడబడుతూ చివరికి ఇంటిదారి పడుతూ వచ్చేది.


 గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లో దాదాపు కప్పు గెలిచినంత పని చేసిన టీమిండియా.. ఫైనల్ లో ఓడిపోయి నిరాశపరిచింది. అయితే 2024 t20 వరల్డ్ కప్ ఎడిషన్ లో మాత్రం అదరగొట్టేసింది టీమిండియా. ఈ క్రమంలోనే అదిరిపోయే ప్రదర్శన చేస్తూ జైత్రయాత్రను  కొనసాగించింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరల్డ్ కప్ టైటిల్ని ముద్దాడింది. దీంతో టీమిండియా ప్రదర్శన పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ముఖ్యంగా భారత జట్టు కప్పు గెలవడంపై ఇండియాలో సంబరాలు అంబరాన్ని అంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంతో మంది రాజకీయ నాయకులు కూడా భారత ఆటగాల ప్రతిభ పై ప్రశంసలు కురిపిస్తూ నజరానాలు కూడా ప్రకటిస్తున్నారు.


 అయితే ఇక ఇటీవలే వరల్డ్ కప్ ట్రోఫీతో స్వదేశానికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు ముంబైలో ప్రస్తుతం రోడ్ షో నిర్వహించారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక టి20 వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెటర్లకు మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి ఆహ్వానం అందింది అన్నది తెలుస్తుంది. ఆ రాష్ట్రానికి చెందిన రోహిత్ శర్మ సూర్య కుమార్ యాదవ్ శివం దుబే యశస్వి జైస్వాల్ అసెంబ్లీకి వెళ్లి సీఎం ఏక్ నాథ్ షిండేని కలిసే అవకాశం ఉందట  ఇక ఇతర క్రికెటర్లను సైతం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే సత్కరించారు అన్న విషయం తెలిసిందే. కాగా దాదాపు 17 ఏళ్ల గ్యాప్ తర్వాత టి20 ఫార్మాట్లో భారత జట్టు టైటిల్ గెలవగలిగింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>