Politicsmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-chandrababu503d96ed-a8db-42ae-b574-18e879b8d4af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-chandrababu503d96ed-a8db-42ae-b574-18e879b8d4af-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తిరుగులేని విజయం సాధించింది.ఏకంగా 164 సీట్లు సాధించి చరిత్ర సృష్టించింది. గత ఎన్నికలలో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్ ఈ సారి కూటమిలో భాగంగా 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ స్థానాలు పొంది అన్నింటిని గెలిచి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించాడు అంతే కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా భాద్యతలు స్వీకరించారు. అయితే గత 151 సీట్లు సాధించిన వైసీపీ పార్టీ కేవలం 11 సీట్లు సాధించి ప్రతిపక్ష హోదా కోల్పోయింది.నాలు#chandrababu{#}Smart phone;YCP;history;Pawan Kalyan;Parliment;Assembly;Government;CBN;Party;Janasena;Andhra Pradesh;Hanu Raghavapudiఈ సారి అలాంటి తప్పులకు తావులేకుండా చంద్రబాబు పాలన..?ఈ సారి అలాంటి తప్పులకు తావులేకుండా చంద్రబాబు పాలన..?#chandrababu{#}Smart phone;YCP;history;Pawan Kalyan;Parliment;Assembly;Government;CBN;Party;Janasena;Andhra Pradesh;Hanu RaghavapudiThu, 04 Jul 2024 07:07:37 GMT*పాలనలో దూకుడుగా వ్యవహారిస్తున్న చంద్రబాబు
*గ్రౌండ్ లెవెల్ పనులపై ప్రత్యేక దృష్టి
* ఈసారి ఎలాంటి పొరపాటు జరగకుండా ముందస్తు జాగ్రత్త

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తిరుగులేని విజయం సాధించింది.ఏకంగా 164 సీట్లు సాధించి చరిత్ర సృష్టించింది. గత ఎన్నికలలో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్ ఈ సారి కూటమిలో భాగంగా 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ స్థానాలు పొంది అన్నింటిని గెలిచి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించాడు అంతే కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా భాద్యతలు స్వీకరించారు. అయితే గత ఎన్నికలలో  151 సీట్లు సాధించిన వైసీపీ పార్టీ ఈసారి కేవలం 11 సీట్లు సాధించి ప్రతిపక్ష హోదా కోల్పోయింది.నాలుగోసారి ముఖ్య మంత్రిగా భాద్యతలు స్వీకరించిన చంద్రబాబు మొదటి రోజు నుంచే పాలనలో తనదైన మార్క్ చూపిస్తూ వస్తున్నారు.కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 22 రోజులలో చంద్రబాబు ఎంతో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలకు అందేలా చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో చంద్రబాబు అధికారములో వున్నప్పుడు సంక్షేమ పధకాలు అందిన కూడా అవి పూర్తిగా ప్రజలకు చేరేవి కావని ఆయనపై ఎన్నో విమర్శలు వున్నాయి. అందుచేతనే 2019 ఎన్నికలలో చంద్రబాబు ఓడిపోయారని వైసీపీ హేళన చేస్తూ వచ్చేది. దీనితో ఈ సారి అలాంటి విమర్శలకు తావులేకుండా సంక్షేమ పధకాలు పూర్తిగా ప్రజలకు అందేలా గ్రౌండ్ లెవెల్ అధికారులను, నాయకులను ఆదేశిస్తున్నారు. ఇక నుంచి తనలో 1995 నాటి ముఖ్య మంత్రిని చూస్తారని తప్పు చేస్తే సొంత పార్టీ నాయకుడైన వదిలి పెట్టె సమస్య లేదని చంద్రబాబు తెలిపారు. దీనితో అధికారులు అందరూ కూడా అప్రమత్తం అయి పాలనలో ఎలాంటి తప్పు జరగకుండా చూసుకుంటున్నారు.రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం తన ఫోన్ నెంబర్ తో పాటు రాష్ట్ర మంత్రుల ఫోన్ నంబర్స్ ను ప్రజలకు అందుబాటులో ఉంచారు. గతంలో గ్రౌండ్ లెవెల్ లో జరిగిన పొరపాటు ఈ సారి అస్సలు జరగకూడదని చంద్రబాబు భావిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>