MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/shankar12314e4f-23c3-436f-87fc-da7107fadbe2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/shankar12314e4f-23c3-436f-87fc-da7107fadbe2-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో శంకర్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించి దేశవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ దర్శకుడు కొన్ని సంవత్సరాల క్రితం విక్రమ్ హీరోగా సదా హీరోయిన్గా అపరిచితుడు అనే మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీ తమిళ్ , తెలుగు భాషల్లో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా విక్రమ్ , సదాకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ మూవీ విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించిన చాలా సంవత్సరాల తర్వాతshankar{#}Ram Charan Teja;vikram;Aparichithudu;GEUM;Sada;Blockbuster hit;Darsakudu;Director;India;News;Indian;shankar;Hindi;Telugu;Cinemaఆగిపోయిన శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్.. ఆ హీరోకు ఇది పెద్ద షాకింగ్ న్యూస్..?ఆగిపోయిన శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్.. ఆ హీరోకు ఇది పెద్ద షాకింగ్ న్యూస్..?shankar{#}Ram Charan Teja;vikram;Aparichithudu;GEUM;Sada;Blockbuster hit;Darsakudu;Director;India;News;Indian;shankar;Hindi;Telugu;CinemaWed, 03 Jul 2024 17:10:00 GMTదేశవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో శంకర్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించి దేశవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ దర్శకుడు కొన్ని సంవత్సరాల క్రితం విక్రమ్ హీరోగా సదా హీరోయిన్గా అపరిచితుడు అనే మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీ తమిళ్ , తెలుగు భాషల్లో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా విక్రమ్ , సదాకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ మూవీ విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించిన చాలా సంవత్సరాల తర్వాత కొన్ని రోజుల క్రితం శంకర్మూవీ ని హిందీ లో రన్వీర్ సింగ్ హీరోగా రూపొందించబోతున్నట్లు ప్రకటించాడు.

కానీ అపరిచితుడు మూవీ ని హిందీలో రీమిక్ చేయనున్నట్లు ప్రకటించిన తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళలేదు. అదే సమయంలో శంకర్ , కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 మూవీని మొదలు పెట్టాడు. ఈ మూవీ షూటింగ్ కొత్త భాగం పూర్తి అయిన తర్వాత ఆగిపోయింది. దానితో ఆ తర్వాత శంకర్ , రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ మూవీని మొదలు పెట్టాడు..ఈ సినిమా జరుగుతున్న సమయంలోనే శంకర్ మళ్లీ ఇండియన్ 2 మూవీ ని తిరిగి స్టార్ట్ చేశాడు. దానితో ఏకకాలంలో ఒక వైపు ఇండియన్ 2 మరోవైపు గేమ్ చేంజర్ సినిమాల షూటింగ్లను తెరకెక్కిస్తూ వచ్చాడు. కొన్ని రోజుల క్రితమే ఇండియన్ 2 సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది.

సినిమా మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది. ఇకపోతే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం శంకర్ హిందీ లో రన్వీర్ సింగ్ తో తీయాలి అనుకున్న అపరిచితుడు రీమేక్ ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఎందుకు అంటే .. శంకర్ ఇప్పటికే ఇండియన్ 2 సినిమాను పూర్తి చేశాడు. ఇక ఇండియన్ 3 ని కూడా రూపొందించబోతున్నాడు. అలాగే గేమ్ చేంజెర్ సినిమా షూటింగ్ కూడా ఇంకా పూర్తి కాలేదు. గేమ్ చెంజర్ మూవీ కి సంబంధించిన అనేక పనులు పెండింగ్లో ఉన్నాయి. ఇక ఈయన ఈ సినిమాలన్నింటి పనులు ముగించుకొని ఫ్రీ కావాలి అంటే చాలా సమయం పడుతుంది. దానితో అపరిచితుడు మూవీ ని హిందీ రీమేక్ ను ఆపివేసినట్లు వార్తలు వస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>