MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rajamouli14c8263e-c217-447f-9c48-ba31f679281d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rajamouli14c8263e-c217-447f-9c48-ba31f679281d-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మరికొన్ని రోజుల్లో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ కథను అందించనుండగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే విజయేంద్ర ప్రసాద్ , రాజమౌళి , మహేష్ కాంబోలో రూపొందబోయే సినిమాకు సంబంధించిన కథ మొత్తం పూర్తి అయ్యింది అని చెప్పాడు. ఇక రాజమౌళి ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడకrajamouli{#}Prabhas;m m keeravani;mahesh babu;prashanth neel;Rajamouli;Cinema;Telugu;Music;Prasanth Neel;K V Vijayendra Prasad;Newsమహేష్.. రాజమౌళి మూవీలో విలన్ గా ఆ మలయాళ నటుడు..?మహేష్.. రాజమౌళి మూవీలో విలన్ గా ఆ మలయాళ నటుడు..?rajamouli{#}Prabhas;m m keeravani;mahesh babu;prashanth neel;Rajamouli;Cinema;Telugu;Music;Prasanth Neel;K V Vijayendra Prasad;NewsWed, 03 Jul 2024 09:52:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మరికొన్ని రోజుల్లో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ కథను అందించనుండగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే విజయేంద్ర ప్రసాద్ , రాజమౌళి , మహేష్ కాంబోలో రూపొందబోయే సినిమాకు సంబంధించిన కథ మొత్తం పూర్తి అయ్యింది అని చెప్పాడు.

ఇక రాజమౌళి ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను చాలా వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇంకో రెండు , మూడు నెలలలో ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం రాజమౌళిసినిమా కోసం నటీనటులను వెతికే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ లో విలన్ పాత్ర కోసం ఓ నటుడిని రాజమౌళి ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

అసలు విషయం లోకి వెళితే ... మలయాళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ ను ఈ మూవీ లో విలన్ పాత్రలో తీసుకోవాలి అని రాజమౌళి అనుకుంటున్నట్లు , అందులో భాగంగా ఈయనను కొన్ని రోజుల క్రితమే కథను వివరించినట్లు , ఆయన కూడా రాజమౌళి దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రస్తుతం వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ నటుడు కొన్ని రోజుల క్రితమే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ లో కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ తో ఈయనకు తెలుగు లో కూడా అద్భుతమైన గుర్తింపు లభించింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>