MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgతెలుగు వారి ఖ్యాతిని మరోసారి ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేసిన ‘కల్కి 2898’ మూవీ గురించి అనేక ఆశక్తికర వార్తలు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఈసినిమా విడుదలఅయిన మొదటి నాలుగు రోజులలోనే 5 వందల కోట్ల కలక్షన్స్ రావడంతో కలక్షన్స్ విషయంలో కల్కి పెట్టుకున్న టార్గెట్ చేరుకున్నట్లయింది. ఈమూవీలో నటించిన అన్ని ప్రధాన పాత్రలతో పాటు ఈ సినిమాలో రైయాపాత్రలో నటించిన ఒక పిల్లాడి పాత్ర గురించి కూడ బాగా అందరిలోనూ ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈమూవీలో అమితాబ్ నటించిన అశ్వథ్థామ పాత్ర వెంటే ఉంటూ అనేక ప్రశ్నలు అడుగుతూ అprabhas{#}Sridevi Kapoor;Girl;Ashwatthama;Athadu;Audience;Amitabh Bachchan;Prabhas;Hero;News;nag ashwin;vijay kumar naidu;Cinemaబయటపడ్డ కల్కి అబ్బాయి రహస్యం !బయటపడ్డ కల్కి అబ్బాయి రహస్యం !prabhas{#}Sridevi Kapoor;Girl;Ashwatthama;Athadu;Audience;Amitabh Bachchan;Prabhas;Hero;News;nag ashwin;vijay kumar naidu;CinemaWed, 03 Jul 2024 08:35:00 GMTతెలుగు వారి ఖ్యాతిని మరోసారి ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేసిన ‘కల్కి 2898’ మూవీ గురించి అనేక ఆశక్తికర వార్తలు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఈసినిమా విడుదలఅయిన మొదటి నాలుగు రోజులలోనే 5 వందల కోట్ల కలక్షన్స్ రావడంతో కలక్షన్స్ విషయంలో కల్కి పెట్టుకున్న టార్గెట్ చేరుకున్నట్లయింది.


ఈమూవీలో నటించిన అన్ని ప్రధాన పాత్రలతో పాటు ఈ సినిమాలో రైయాపాత్రలో నటించిన ఒక పిల్లాడి పాత్ర గురించి కూడ బాగా అందరిలోనూ ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈమూవీలో అమితాబ్ నటించిన అశ్వథ్థామ పాత్ర వెంటే ఉంటూ అనేక ప్రశ్నలు అడుగుతూ అతడి నుంచి సమాధానాలు రాబట్టే పాత్రలో రైయా పాత్రకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.


వాస్తవానికి ఈఅబ్బాయి పాత్రలో నటించింది ఒక అమ్మాయి. ఆమె పేరు కేయా నాయర్. కేరళకు చెందిన ఈ అమ్మాయిని రైయా అనే అబ్బాయి పాత్రకు నాగ్ అశ్విన్ ఎంపిక చేశాడు. గతంలో చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు అమ్మాయిలు అయినప్పటికీ అబ్బాయిలుగా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ప్రముఖ నటి రోజారమణి ‘భక్త ప్రహ్లాద’ మూవీలో ప్రహ్లాదు డుగా నటించి ఆరోజులలోనే జాతీయ స్థాయి అవార్డులు అందుకుంది.


శ్రీదేవి కూడ అనేక సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అబ్బాయిగా నటించిన సందర్భాలు ఉన్నాయి. ఆ ట్రెండ్ ను కొనసాగిస్తూ రైయా చేత నాగ్ అశ్విన్ ‘కల్కి 2898’ అబ్బాయి పాత్రలో సమర్థవంతంగా నటించేలా చేశాడు. ప్రస్తుతం ఈ అమ్మాయి మీడియాకు హాట్ టాపిక్ కావడంతో ఆమె అనేక ఇంటర్వ్యూలు కూడ ఇస్తోంది. ఒక ఇంటర్వ్యూలో ఈమె ప్రభాస్ పై విపరీతమైన ప్రశంసలు కురిపించింది. అతడు టాప్ హీరో అయినప్పటికీ ఎప్పుడు నవ్వుతూ తనతో చాల సరదాగా కాలం గడిపిన విషయాలను గుర్తుకు చేసుకుంది. అంతేకాదు అమితాబ్ మొదటిసారి సెట్ లోకి రాగానే ప్రభాస్ ఆయనకు ఎదురు వెళ్ళి పాద నమస్కారం చేసిన సందర్భాన్ని వివరిస్తూ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించింది..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>